చెరిగి పోని మ‌ధుర క్ష‌ణాలు..మ‌న‌సు దోచిన మ‌హ‌రాజులు

45 రోజుల పాటు అల‌రించిన ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్ ఎట్ట‌కేల‌కు ముగిసింది. రోజు రోజుకు టెన్ష‌న్‌ను క‌లుగ‌జేస్తూ..క్రికెట్ ప్రేమికుల‌కు ఎన‌లేని సంతోషాన్ని నింపిన ఈ టోర్నీ వారికి క‌ల‌కాలం గుర్తుండి పోతుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎంద‌రో ఆట‌గాళ్లు ఆయా జ‌ట్ల త‌ర‌పున ఆడారు. త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించారు. కానీ కొంద‌రు క్రికెట‌ర్లు మాత్రం వెరీ వెరీ స్పెష‌ల్. ఎందుకంటే వారు లేకుండా ఆ జ‌ట్టు గెల‌వ‌లేదు కాబ‌ట్టి. వారంతా ఇపుడు దేశాల త‌ర‌పున హీరోలుగా చెలామ‌ణి అవుతున్నారు. ఫైన‌ల్ పోరులో స్టోక్స్ త‌మ జ‌ట్టుకు విస్మ‌రించ‌లేని విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టి ఆల్ టైం హీరోగా రికార్డుకు ఎక్కాడు. 12వ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఆద్యంత‌మూ ఉత్సాహ భ‌రిత‌..ఉత్కంఠ రేపుతూ జ‌రిగింది. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్, ఇండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు హాట్ ఫేవ‌రేట్‌లుగా నిలిచాయి. కానీ ఈ టోర్నీలో మాత్రం అనామ‌క జ‌ట్టుగా ప‌రిగ‌ణించిన బంగ్లా దేశ్ ఆట‌గాళ్లు మిగ‌తా జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించారు.

ఒకానొక స‌మ‌యంలో షాక్ ఇచ్చారు. అటు బౌలింగ్‌లోను..ఇటు బ్యాటింగ్‌లోను త‌మ స‌త్తా చాటారు. ఇక టోర్నీలో ఆయా జ‌ట్ల నుంచి ప‌లువురు ఆట‌గాళ్లు స్టార్స్ రేటింగ్ పొందారు. త‌మ అద్భుత‌మైన ఆట‌తీరుతో అభిమానుల గుండెల్లో నిలిచి పోయారు. వారెవ‌రో తెలుసుకోవాలంటే చూడాల్సిందే. ప్ర‌పంచ క‌ప్ టోర్నీలో ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. జ‌ట్ల వారీగా ప‌రిశీలిస్తే..ఆస్ట్రేలియా జ‌ట్టు త‌ర‌పున ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ రేసులో ఉన్నాడు. గ‌త ఏడాది బాల్ టాంప‌రింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గుర‌య్యాడు. ఇటీవ‌లే నేరుగా వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి వ‌చ్చాడు. టోర్నీ మొత్తంగా అసాధార‌ణ‌మైన రీతిలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. త‌న బ్యాటింగ్‌తో అల‌రించాడు. బ్యాటింగ్ బాధ్య‌త‌ను ఒంటి చేత్తో త‌న భుజ‌స్కందాల‌పై మోశాడు ఈ ఆట‌గాడు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన ఈ క్రికెట‌ర్ అత్య‌ధికంగా 91.33 శాతంతో 548 ప‌రుగులు చేశాడు.

మ‌రో ఆట‌గాడు ఇండియా జ‌ట్టుకు చెందిన రోహిత్ శ‌ర్మ‌. ఓపెన‌ర్‌గా వ‌చ్చి వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపాడు. త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ పెర్‌ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో 5 సెంచ‌రీలు సాధించిన తొలి క్రికెట‌ర్‌గా రికార్డు బ్రేక్ చేశాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి అత్య‌ధికంగా అంద‌రికంటే ఎక్కువగా 648 ప‌రుగులు చేశాడు. దీంతో రోహిత్ కూడా ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌లో త‌ను కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియా జ‌ట్టులో మ‌రో కీల‌క ఆట‌గాడు మిచెల్ స్టార్క్..ఆ జ‌ట్టు సెమీ ఫైన‌ల్ వ‌ర‌కు వ‌చ్చిందంటే కేవ‌లం అత‌డి వ‌ల్ల‌నే . ప‌దునైన బౌలింగ్‌తో ఏకంగా 27 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంత‌కు ముందు మెక్ గ్రాత్ 26 వికెట్లు తీయ‌గా..ఆ రికార్డును బ్రేక్ చేశాడు స్టార్క్. టోర్నీలో మ‌రో కీల‌క ఆట‌గాడుగా త‌న‌ను తాను నిరూపించుకున్నాడు ..బంగ్లాదేశ్ జ‌ట్టుకు చెందిన ష‌కీబ్ అల్ హ‌స‌న్. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. 8 మ్యాచ్‌లు ఆడిన ఈ క్రికెట‌ర్ ఏకంగా 608 ప‌రుగులు చేశాడు. తాను కూడా బ‌రిలో ఉన్నాన‌ని చెప్పాడు. జోరూట్..ఆతిథ్య జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా అవ‌త‌రించాడు. ఈ టోర్నీలో 549 ప‌రుగులు చేసి..ఇంగ్లండ్ క‌ప్ సాధించ‌డంలో కీల‌క భూమిక పోషించాడు. మొత్తంగా చూస్తే..ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ..వార్న‌ర్, రోహిత్‌ల మ‌ధ్యే ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!