క్రికెట్ ముగిసింది..కర్నాటక మిగిలింది..!
దేశ రాజకీయాలు ఇపుడు కన్నడ రాజకీయం చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ఉంటుందా..ఊడిపోతుందో తెలియక కన్నడిగులు ఉత్కంఠకు లోనవుతున్నారు. ఓ వైపు 45 రోజుల పాటు టెన్షన్ కు గురి చేసిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఇక కర్నాటకలో వేడి మొదలైంది. సభలో సమర సన్నాహాలు జరగనున్నాయి. విశ్వాస పరీక్ష నిర్వహించి తీరాల్సిందేనని యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరో వైపు తగినంత బలం లేక పోయినా సీఎం నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపణలు చేసింది. మరో వైపు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు. ముంబయిలో బస చేసిన కాంగ్రెస్ రెబల్స్ ను బుజ్జగించే పనిలో పడ్డారు. అయినా ఒకరు తప్ప మరికొందరు తన లైన్లోకి రాలేదు.
విశ్వాస పరీక్షలో తమ వైపు ఓటు వేయక పోతే..శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోతారంటూ హెచ్చరించారు. తమ రాజీనామాలు తక్షణమే ఆమోదించాలని కోరుతూ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగబద్ధంగా తాను ఎన్నికైనందున, సరైన ఫార్మాట్‌లో నింపలేదని అందుకే వారి రిజిగ్నేషన్స్ చెల్లవంటూ స్పీకర్ స్పష్టం చేశారు. దీనిని సవాల్ చేస్తూ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఏం జరుగుతుందోనని ..సస్పెన్స్ కొనసాగుతోంది. సంకీర్ణ సర్కార్‌లో భాగస్వాములైన కాంగ్రెస్ నేతలు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్టు కనిపించినా స్పష్టత మాత్రం కొరవడింది. మొత్తం ఎమ్మెల్యే నాగరాజు చుట్టూ రాజకీయం తిరుగుతోంది.
కాగా ముంబై వెళ్లిన నాగరాజ్ వెంట బీజేపీకి చెందిన సీనియర్ నేత ఆర్. అశోక్ కూడా ఉన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగిన కాంగ్రెస్ నేత రామలింగారెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖాంద్రేతో కలిసి పాటిల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎలాగైనా సరే సంకీర్ణ సర్కార్‌ను నిలబెట్టాలని తలంపుతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఉన్నాయి. మరో వైపు బలం ..బలగం తమ వైపు ఉందని, ఇక కర్నాటక తమదేనని బీజేపీ అంటోంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర హైకమాండ్ ఇప్పటికే గవర్నర్‌తో టచ్‌లో ఉంది. మరో వైపు ..డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న డ్రామాగా కొట్టి పారేశారు. త్వరలో అంతా సర్దుకుంటుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. రెబల్ ఎమ్మెల్యేల గొంతెమ్మ కోర్కెలన్నింటిని తీరుస్తామంటూ స్పష్టం చేశారు. డోన్ట్ వర్రీ బాస్..ఆల్ ఈజ్ ఓకే..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి