టీమిండియా తీరుపై యువీ అస‌హ‌నం

ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో హాట్ ఫెవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన టీమిండియా జ‌ట్టు నాకౌట్ ద‌శ‌లో న్యూజిలాండ్ టీంతో ఓడిపోవ‌డాన్ని కోట్లాది అభిమానుల‌తో పాటు మాజీ క్రికెట‌ర్లు జీర్ణించు కోలేక పోతున్నారు. నాలుగో స్థానంలో బ‌ల‌మైన ఆట‌గాళ్ల‌ను ఆడించ‌క పోవ‌డం వ‌ల్ల‌నే అప‌జ‌యం ద‌క్కింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక రాయుడి ప‌ట్ల బీసీసీఐ అనుస‌రించిన ధోర‌ణిపై మాజీ క్రికెట‌ర్, తాజాగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన యువ‌రాజ్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. అంత‌కు ముందు మాజీ కెప్టెన్ ధోనీ కావాల‌నే ఆడ‌లేదంటూ యువీ తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. అంత అనుభ‌వం క‌లిగి ఉన్న ధోనీ జ‌డేజాపై భారం మోపడం భావ్యం కాదన్నారు. టీమిండియా యాజమాన్యం ఇపుడు ఏం స‌మాధానం చెబుతుంద‌ని యువీ నిల‌దీశాడు. ప్ర‌పంచ క్రికెట్ టోర్నీ కంటే ముందు నాలుగో స్థానం విష‌యంలో ఎవ‌రు స‌రిపోతార‌ని ..బీసీసీఐ , మేనేజ్ మెంట్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎంత‌మంది ఆ స్థానంలో ఆడినా ఏ ఒక్క క్రికెట‌ర్ కుదురుకోలేద‌ని, ఒక్క అంబ‌టి రాయుడు కొంత మేర‌కు ఆ స్థానానికి న్యాయం చేశాడ‌ని అన్నారు. ఇక ఇదే ప్లేస్‌లో విజ‌య‌శంక‌ర్, కేఎల్ రాహుల్‌లు ప్రపంచ క‌ప్ కు ఎంపిక‌య్యారు. లీగ్ ద‌శ‌లో అగ్ర‌స్థానంలో నిలిచిన టీమిండియా కీల‌క ద‌శ‌లో చేతులెత్తేసింది..ఇంటికి వ‌చ్చేసింది. కివీస్ నిర్దేశించిన అతి త‌క్కువ స్కోరును అందుకోలేక పోయింది. చూస్తే ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్ మెన్స్..కానీ ప‌రుగులు చేసేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు. ఆదిలోనే నాలుగు వికెట్లు స‌మ‌ర్పించుకుని, త‌మ చిత్త‌శుద్ధిని చాటుకున్నారు. ఓ వైపు కోట్లాది మంది ఫ్యాన్స్ క‌మాన్ ఇండియా అంటూ నినాదాలు చేస్తే..ఇంకెందుక‌ని ఆడాల‌ని అనుకున్నారో ఏమో, త్వ‌ర‌గా పెవీలియ‌న్ కు చేరుకున్నారు. ఈ విష‌యంపై యువీ ఘాటుగా స్పందించాడు.

స‌రైన ఆట‌గాడిని ఎంపిక చేయాల్సి ఉండేద‌న్నారు. ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో ఛాన్స్ ఇస్తామ‌ని చెప్పి వునింటే రాయుడు మ‌రింత రాణించేందుకు అవ‌కాశం క‌లిగేద‌న్నారు. 2003 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి ముందు టీమిండియా న్యూజిలాండ్‌తో ఆడిన‌ప్పుడూ ఇదే స‌మ‌స్య ఎదురైంద‌ని గుర్తు చేశాడు యువీ. అప్పుడు జ‌ట్టు యాజ‌మాన్యం ఇలాగే చెప్పింద‌ని, అదే జ‌ట్టుతో వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడామ‌న్నారు. రాయుడి ప‌ట్ల మేనేజ్‌మెంట్ ప్ర‌వ‌ర్తించిన తీరు త‌న‌ను ఎంత‌గానో బాధ‌కు గురి చేసింద‌న్నారు. ప్ర‌పంచ‌క‌ప్ లో ఆడాల‌న్న క‌సితో ఉన్నాడ‌ని అత‌డి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించినా ..ఆస్ట్రేలియాతో ఆశించిన మేర ఆడ‌లేక పోయాడ‌న్నారు. రాయుడుకు బ‌దులు రిష‌బ్ పంత్‌కు అవ‌కాశం ఇచ్చార‌ని, ఆ త‌ర్వాత అత‌డిని కూడా ప‌క్క‌న పెట్టార‌ని ఆరోపించారు. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం డిసిష‌న్ తీసుకోక పోవ‌డం వ‌ల్ల‌నే టీమిండియా ఓడిపోయింద‌న్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!