ఈ వెహికిల్స్ - ఐడియా సక్సెస్..!
ఇండియాలో స్టార్టప్‌లు దుమ్ము రేపుతున్నాయి. ఒకరి దగ్గర పని చేయడం కాకుండా తామే పది మందికి ఉద్యోగాలు ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది. ఎక్కువగా అంకురాలు ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం ఇటీవల ఆ కాన్సెప్ట్ తో ఊహించని రీతిలో ఎక్కువ సక్సెస్ రేట్ నమోదు కావడమే. ప్రపంచాన్ని చమురు డామినేట్ చేస్తోంది. ప్రతి రోజంతా పెట్రోల్, డీజిల్ వాడకుండా ఉండని పరిస్థితి. దీంతో కోట్లాది వాహనాలు ప్రతి రోజు రోడ్లపై ప్రయాణం చేస్తున్నాయి. ఆకాశంలో ఎగరాలన్నా ఇంధనం కావాల్సిందే. లేకపోతే ఉన్న చోటనే వుండి పోతాం. చమురు నిక్షేపాలు ఎక్కువగా కొన్ని దేశాలలోనే లభ్య మవుతున్నాయి. దీంతో ఎక్కువగా 70 శాతానికి మించి దేశాలు ఉత్పత్తి చేసే కంట్రీస్ మీదే ఆధార పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. తాజాగా సౌదీ పై దాడులు పెరిగాయి. దీంతో ప్రత్యామ్నాయం చూసు కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఇందులో భాగంగానే ఎలాంటి ఆయిల్ వాడకుండానే బయో డీజిల్ తో పాటు ఎలక్ట్రిసిటీ తో వాహనాలు తయారు చేసి పనిలో పడ్డాయి పలు కంపెనీలు. దీని వల్ల తక్కువ ఖర్చు, ఎక్కువ మిగులు, టైం సేవ్ కావడం జరుగుతోంది. విద్యుత్ వాహనాలు ఇప్పుడు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. అందులో భాగంగా ఏర్పాటు అయ్యిందే..రూట్‌మ్యాటిక్ స్టార్ట్ అప్. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉద్యోగులకు రవాణా సేవలు అందిస్తోంది. హైదరాబాద్ లో మొదటగా 10 వాహనాలతో నెల రోజుల్లో సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే సాంకేతికత, మార్కెటింగ్ నిపుణులు నియామకం పూర్తయింది. మైండ్ ట్రీతో కూడా ఈ కంపెనీ ఒప్పందం చేసుకుంది. మరికొన్ని కంపెనీలతో టై అప్ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెలాఖరు నాటికి మరో 600ల వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. రూట్ మ్యాటిక్ సంస్థను ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులు సురాజిత్ దాస్, శ్రీరామ్ కన్నన్‌లు బెంగళూరు కేంద్రంగా 2013 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఉద్యోగుల రవాణా కోసం వాహన సర్వీసెస్, ట్రాన్స్‌పోర్ట్ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ను అందజేస్తుంది.
వాహనాన్ని బట్టి కాకుండా అందులో ప్రయాణించే ఉద్యోగుల దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తుంది. దీంతో కంపెనీలకు ఖర్చు భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, మధురై వంటి 12 నగరాల్లో సేవలు అందిస్తోంది. సిస్కో, బార్క్‌లెస్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి 60కి పైగా కార్పొరేట్ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం రూట్ మ్యాట్రిక్ కు 700లకు పైగా వాహనాలు, 1.50 లక్షల మంది కస్టమర్లున్నారు. నెలకు 10 లక్షల కిలోమీటర్ల ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతుంది. ఈ ఏడాది ముగింపు నాటికి 4 వేల వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలన్నది టార్గెట్ గా పెట్టుకుంది కంపెనీ. ఇందులో 200 మంది ఉద్యోగులున్నారు. అదనంగా 100 మందిని తీసుకోనుంది. బ్లూమ్ వెంచర్స్, దుబాయ్‌కు చెందిన వ్యామ్ క్యాపిటల్, కెఫే కాఫీ డే మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నరేష్ మల్హోత్ర ఇందులో పెట్టుబడులు పెట్టారు. బిజినెస్ మరింత విస్తరించేందుకు మరో 175 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి