26 ఏళ్లలో 11 రూపాయల పెట్టుబడి 54 వేల రాబడి - వన్నె తగ్గని ఎంఆర్ఎఫ్..!

డబ్బులు ఊరికే రావు. ఇటీవల తెలుగు వారి లోగిళ్ళలో బాగా పాపులర్ అయిన యాడ్. మార్కెట్ లో లెక్కలేనన్ని రూపాయలు ఉన్నాయి. కాకపోతే వాటిని ఎలా పొందాలో, ఎలా మన జేబుల్లోకి రావాలో ప్రయత్నం చేయాలి. కష్టపడాలి. సాధించాలి. చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే భయం. అపోహ కూడా. కానీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఆధారంగా తోచినంత డబ్బులను షేర్స్ రూపంలో పెట్టుబడిగా పెట్టుకుంటూ పోతే కొన్నేళ్లలో మీరు లక్షాధికారి కావొచ్చు. ఏ రంగం లోనైనా పర్ఫెక్ట్ గా సక్సెస్ కావాలంటే ఒకే రంగం మీద దృష్టి సారించాలి. బతకాలంటే మనీ ఉండాలిగా. అందుకే రూపీస్ కు , డాలర్లకు అంత డిమాండ్. ప్రతి ఒక్కరు దాని వెంట పరుగులు తీయడమే. ఇదే స్టాక్ మార్కెట్ ను నమ్ముకున్న వాళ్ళు కరోడ్ పతులయ్యారు. కోట్లాది మంది బికారులుగా మారినసందర్భాలు కోకొల్లలు.

కళ్ల ముందు జరిగిన వాస్తవం ఏమిటంటే ఐటీ రంగంలో సత్యం కంప్యూటర్స్ అనతి కాలంలోనే ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీగా పేరు తెచ్చుకుంది. ఇదే సమయంలో దాని చైర్మన్ రామలింగ రాజు చేసిన తప్పిదాలకు అరెస్ట్ కావడంతో వేళల్లో ఉన్న షేర్స్ ఒక్క సరిగా పడి పోయాయి. అదే సమయంలో దానిని టేకోవర్ చేసుకునేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. కానీ తెలివైన వాళ్ళు షేర్స్ పడిపోయినప్పుడు వందలాదిగా సత్యం షేర్స్ తీసుకున్నారు. ఫ్యూచర్ లో పెరుగుతుందన్న నమ్మకంతో . ఎందుకంటే కంపెనీ అలాంటిది. చాలా మంది దాని జోలికి వెళ్ళ లేదు. కానీ మహీంద్రా గ్రూప్ ముందుకు వచ్చింది. సత్యం ను టేకోవర్ చేసుకుంది. దీంతో సత్యం షేర్స్ అమాంతం పెరిగాయి. దాని షేర్ విలువ 58 రూపాయలు ఉన్నది 700 కు పైగా పెరిగింది. దీంతో ముందు చూపుతో షేర్స్ కొనుక్కున్న వాళ్ళు లక్షలాది కారులయ్యారు. తాజాగా ఇలాంటిదే ఎంఆర్ఎఫ్ కంపెనీ విషయంలో చోటు చేసుకుంది.

ఇండియాలో అత్యంత నమ్మకమైన, నాణ్యమైన బ్రాండ్ గా పేరున్న కంపెనీలలో మొదటి ప్లేస్ ఉండే ఒకే ఒక్క కంపెనీ ఏదంటే అది ఎంఆర్ఎఫ్. వేలాది వాహనాలకు టైర్లు సరఫరా చేస్తూ అతి తక్కువ సమయంలో వరల్డ్ లో బిగ్గెస్ట్ ఎగుమతి దారుగా పేరు తెచ్చుకుంది ఎంఆర్ఎఫ్. తరాలు మారినా, వందలాది కంపెనీలు వచ్చినా ఎంఆర్ఎఫ్  ముందు నిలువ లేక పోయాయి. రహదారులు ఉన్నంత దాకా ఎంఆర్ఎఫ్ ఉంటుంది. వాహనదారులు, తయారీదారుల మొదటి ప్రయారిటీ ఎంఆర్ఎఫ్. మద్రాస్ కేంద్రంగా ఓ చిన్న గదిలో స్టార్ట్ అయిన ఎంఆర్ఎఫ్  ప్రస్థానం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దీనిపై ఉన్న నమ్మకంతో ఎంతో మంది ఈ కంపెనీలో డబ్బులను పెద్దఎత్తున ఇన్వెస్ట్ చేశారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. ఎందుకంటే తరాలు మారినా, ఏళ్ళు గడిచినా ఎంఆర్ఎఫ్ అలాగే ఉంది కనుక. 26 ఏళ్ళ కిందట కేవలం 11 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దాని వాల్యూ 2019 లో 54,000 రూపాయలుగా మారి పోయింది. మదుపుదారులకు భారీగా ఆదాయాన్ని సమకూర్చి పెట్టింది.

ఎందరినో కరోడ్ పతులను చేసింది. రెట్టింపు రాబడి వచ్చింది. గత ఏడాదిలో ఎంఆర్ఎఫ్ ముఖ విలువ 10 రూపాయలపై  600 శాతం ఈక్విటీ డివిడెండ్ ప్రకటించింది, ఇది ఒక్కో షేరుకు 60 రూపాయలు అన్నమాట. ఆటో పరిశ్రమ మంద గమనంలో ఉన్నా ఎంఆర్ఎఫ్ మాత్రం అలాగే ఉన్నది. ప్రతి షేరుకు 10 రూపాయల ముఖ విలువతో ప్రభుత్వ సంస్థగా ప్రారంభమైన మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ గత 25 ఏళ్లలో పెట్టుబడిదారులకు 7,40,109 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఏప్రిల్ 27, 1993 న బిఎస్ఇలో ప్రస్తుత ధర 54,488 రూపాయలతో పోలిస్తే కంపెనీ వాటా 11 రూపాయల వద్ద ముగిసింది.  2018 ఏప్రిల్ 30 న దాని జీవితకాల గరిష్ట స్థాయి 81,423  రూపాయలను తాకింది. ఒక పెట్టుబడిదారుడు 25 సంవత్సరాల క్రితం ఎంఆర్ఎఫ్  షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే కరోడ్ పతి అయ్యేవారు.

బిఎస్‌ఇ డేటా ప్రకారం మే 11, 2009 నుండి మే 9, 2019 మధ్య ఎంఆర్‌ఎఫ్ షేర్లు 2,210 శాతం పెరిగాయి. గత ఐదేళ్లలో స్టాక్ వృద్ధి 154.83 శాతానికి ఏకీకృతం అయ్యింది. అయితే, కంపెనీ షేర్లు గత ఏడాది కాలంలో 28.72 శాతం ఉండగా  ఈ ఏడాది ప్రారంభం నుండి 18.6 శాతం క్షీణించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్వతంత్ర నికర లాభం 1,097.87 కోట్ల రూపాయలుగా నమోదైంది, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 1,092.28 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 16,254.47 కోట్లుగా ఉంది, ఇది సంవత్సరానికి 4.80 శాతం వృద్ధిని నమోదు చేసింది. సో..పెట్టుబడి అనేది పెరగాలంటే నమ్మకమైన కంపెనీ ఉండాలి. దానిని గుర్థించగలిగితే వాళ్ళు అదృష్టవంతులే. మొత్తం మీద అమెరికా ఎంఆర్ఎఫ్ ను చూసి విస్తుపోతోంది. 

కామెంట్‌లు