ఇక ఆర్ఐఎల్ సస్టెయినబుల్ డ్రెస్సెస్
ఇండియాలో ఆర్ఐఎల్ ఏది చేపట్టినా అది అదృష్టాన్ని మోసుకు వస్తోంది. ఇప్పటికే బిజినెస్ రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న రిలయన్స్ ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. ఆయిల్, లాజిస్టాక్, ఆయిల్, టెలికాం, జ్యుయెలరీ, ఈ కామర్స్, డిజిటల్ మీడియా టెక్నలాజి రంగంలో దుమ్ము రేపుతోంది. తాజాగా జియో ఇండియాలో రికార్డ్ బ్రేక్ చేసింది. ఇప్పటికే 34 కోట్ల కస్టమర్స్ తో చరిత్ర సృష్టించింది. జియో సాధించిన సక్సెస్ ను స్ఫూర్తిగా తీసుకుని ఇతర రంగాలకు ఎంటర్ అవుతోంది. తాజాగా సస్టెయినబుల్ డ్రెస్సెస్ పై దృష్టి పెట్టింది. అందరికి అందుబాటులో ఉండేలా, సామాన్యులు సైతం కొనుగోలు చేసేలా, పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్లాన్ చేస్తోంది. ఇటీవల 'సస్టైనబుల్ ఫ్యాషన్'కు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకు పోవాలని టార్గెట్ గా పెట్టుకుంది.
సస్టెయినబుల్ ఫ్యాషన్‌ను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని. ఇది కూడా ఒక రకమైన కార్పోరేట్ సామాజిక బాధ్యత కిందకే వస్తుందని ఆర్ఐఎల్ సీఎఫ్ఓ వెల్లడించారు. రిలయన్స్ పెట్రో ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడంలో ప్రపంచం మొత్తంలో తొలి కంపెనీ తమదే అన్నారు. భారతదేశంలో పెట్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసే ఏకైక కంపెనీ రిలయన్స్ మాత్రమేనని, ఏటా రెండు బిలియన్ల మేరకు ఉపయోగించిన పెట్ బాటిల్స్ ను ప్రాసెస్ చేస్తోందన్నారు. కాగా ప్రకృతికి ఎలాంటి హాని కలగని రీతిలో అతి తక్కువ కర్బన పదార్ధాలతో ఉండే దుస్తులను యువతరం కోరుకుంటోంది. ప్రతీ సంవత్సరం దాదాపు రెండు బిలియన్ల బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తున్నామని తెలిపారు. దీనిని రాబోయే రెండేళ్లలో ఆరు బిలియన్లకు పెంచాలన్నదే తమ లక్ష్యమని విపుల్ స్పష్టం చేశారు. ఈ విధానంలో తాము అనుసరించే విధానం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. రానున్న రెండేళ్ళలో దాన్ని ఆరు బిలియన్లకు పెంచాలని భావిస్తోంది.
రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ చేయడం ద్వారా అందుబాటు ధరల్లో ఉండేలా, అందరినీ చేరుకునేలా సుస్థిరదాయక ఫ్యాషన్ కు అవసరమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది. ఈత దుస్తులు మొదలుకొని చలికాలపు దుస్తులు, బ్యాక్ ప్యాక్స్ దాకా అన్నిటికీ అంతర్జాతీయ బ్రాండ్లు రీసైకిల్డ్ మెటీరియల్ తో తయారు చేయనుంది. వ్యర్థ పెట్ బాటిల్స్ సేకరణ, వాటిని పర్యావరణ స్నేహ పూర్వక ఫైబర్స్ గా రెక్రాన్ గ్రీన్ గోల్డ్ గా మార్చడం, టెక్స్ టైల్ వాల్యూ చెయిన్ లో వాటిని మరింత దిగువకు తీసుకెళ్తూ, ఫైబర్స్ ను అధిక విలువ కలిగిన స్లీప్ ఉత్పాదనలుగా, ఆర్ఎలాన్ ఆధారిత ఫ్యాషన్ దుస్తులుగా మార్చడం దాకా ఒక వలయాకారంలో ఈ ప్రక్రియ చేపట్టనుంది. 'సాధారణంగా వాటర్ బాటిల్స్‌ను ఖాళీ చేసిన తర్వాత వాటినే పారేస్తాం. కానీ వీటి వల్ల పర్యావరణానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. త్వరగా మట్టిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ డబ్బాలు నగరాలు, పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడతాయి'.
ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఉపయోగకరమైన ఉత్పాదనలుగా మార్చడం అనే భావనపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఒక బాధ్యతాయుత కార్పొరెట్ గా రిలయన్స్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్గత చర్యలను పటిష్ఠం చేసుకోవడంతో పాటుగా, యార్న్, టెక్స్ టైల్ తయారీదారులు, అగ్రగామి దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, రిటైలర్లు, ఫ్యాషన్ హౌస్ ప్రతినిధులతో కూడుకొని ఉన్న తన హబ్ ఎక్స్ లెన్స్ ప్రోగ్రామ్ ద్వారా యావత్ టెక్స్ టైల్ పరిశ్రమతో సన్నిహితంగా కలసి పని చేస్తోంది ఆర్.ఐ.ఎల్. కో-బ్రాండెడ్ వస్త్రాలు, దుస్తులు తయారు చేసేందుకు ఒక వ్యూహాన్ని రూపొందించింది. యారో, రాంగ్లర్, రేమండ్, లీ లతో సహా ఇతర అంతర్జాతీయ బ్రాండ్లతో అది ఇప్పటికే భాగస్వామిగా చేసు కోవడంతో మరింత బిజినెస్ పెరగడంతో పాటు ఆదాయం సమకూరుతోంది. ఎంతైనా రిలయన్స్ రూటే సపరేట్ కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి