భారీ ఆఫర్లు.. బిగ్ డిస్కౌంట్స్..బయ్యర్స్ కు పండగే పండుగ..!
ఎవరినైనా దెబ్బ కొట్టాలన్నా, వార్ లోనైనా, ఆధిపత్యం లోనైనా లేక వ్యాపారమైనా లేదా ఈ కామర్స్ రంగం లోనైనా అమెరికా తర్వాతే ఎవ్వరైనా..ఏ దేశమైనా. యుఎస్ కు చెందిన వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ ను టేకోవర్ చేసుకున్నాక దాని స్వరూపమే మారి పోయింది. బిగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్స్ కు తెర తీస్తూ తోటి కంపెనీలకు భారీ సవాల్ విసురుతోంది. ఇప్పటికే ఇదే అమెరికా కంపెనీ అమెజాన్ తన ప్లేస్ ను కాపాడుకుంటూ వస్తోంది. ఇటీవల సిబ్బంది సమ్మె చేసినా అది రోబోలను, న్యూ టెక్నాలజీని వాడుతూ తనకు ఎదురే లేకుండా చేసుకుంటోంది. దేశీయ, విదేశీ ఈ కామర్స్ కంపెనీలన్నీ ఇప్పుడు ఇండియా జపం చేస్తున్నాయి. ఇక్కడున్నంత మార్కెట్ ఇంకెక్కడా లేక పోవడమే ఇందుకు ప్రధాన కారణం.
కొన్ని రోజుల్లో దసరా పండగ రాబోతోంది. దీనిని టార్గెట్ గా పెట్టుకుని భారీ డిస్కౌంట్స్ ను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. అంతకు ముందే అమెజాన్ , స్నాప్ డీల్ తో పాటు ఇతర కంపెనీలు బయ్యర్స్ కు బంపర్ ఛాన్స్ ఇస్తున్నాయి. దీంతో ఏవి కొనుగోలు చేయాలో తెలియక తల్లడిల్లి పోతున్నారు. ఎక్కువగా గృహోపకరణాలు, దుస్తులు, షూస్, గాడ్జెస్, మొబైల్స్ వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక ఎప్పుడూ లేనంతగా ఫ్లిప్ కార్ట్ ఏకంగా 75 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో ఇతర ఈ కామర్స్ కంపెనీలు తాము సైతం ఆఫర్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ ముందుగా వినియోగదారులను ఆకర్షించే లా ‘బిగ్ బిలియన్ డేస్’ను ఆరు రోజుల పాటు ఏర్పాటు చేసింది. 29 నుంచి అక్టోబరు 4 వరకు ఈ డిస్కౌంట్ సేల్ కొనసాగనుంది. ఇంకా ఫ్లిప్ కార్ట్ ప్లస్ వినియోగదారుల కోసం 28,29 తేదీల్లో రాత్రి 8 గంటలకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.
ఈ సేల్‌లో రూ.49 నుంచే ఉత్పత్తులు ప్రారంభం కానున్నాయి. వీటిలో ఎక్కువగా టీవీలు, గృహోపకరణాలు, సౌందర్య ఉత్పత్తులు, బొమ్మలు, స్మార్ట్ పరికరాలు, కిరాణా సామాన్లు. ఇంకా టెక్ ప్రియుల కోసం మొబైల్స్, ట్యాబ్లెట్స్, గాడ్జెస్ వాటికి సంబంధించిన పరికరాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ప్లస్ ఉంటే ఈ ఆఫర్ మరింత ప్లస్ కానుంది. వీరి కోసం నాలుగు గంటల ముందే సేల్ ప్రారంభం అవుతుంది. దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు, ఇంటి అలంకరణ ఉత్పత్తులపై అదనంగా 20 శాతం తగ్గింపు..ప్రతి గంటకు ఒక కొత్త డీల్, ఒక ప్లాష్ సేల్ ఏర్పాటు చేసింది. అర్థరాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో అదనపు డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. గృహ సంబంధిత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. 36 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్సేంజ్‌పై మరిన్ని ఆఫర్లు కూడా అందించనుంది.
ఈ సేల్ లో 1,000కి పైగా బ్రాండ్లకు చెందిన 20 లక్షలకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి. ఇక దుస్తుల విషయానికి వస్తే అత్యధికంగా 90 శాతం వరకు తగ్గింపు ఉండనున్నట్లు పేర్కొంది సంస్థ. సౌందర్య సాధనాలు, బొమ్మలు, పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులు రూ.49 నుంచే ప్రారంభం కానున్నాయి. వీటిపై 29న అదనంగా 15 శాతం తగ్గింపు లభించనుంది. గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటి ఉత్పత్తులపై ఫ్రీ డెలివరీ, ఫ్రీ ఇన్‌స్టాలేషన్ని అందించనుంది. వీటికి సంబంధించి 5 వేలకు పైగా బ్రాండ్లు, 5 లక్షలకు పైగా ఉత్పత్తులు ఉండనున్నాయి. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫ్లిప్ కార్ట్ ప్లైట్ బుకింగ్స్ చేసుకునే వారికి రూ.25 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. బుకింగ్ సమయంలో సూపర్ కాయిన్లు ఉపయోగించడం ద్వారా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. ఇక కాంబో డీల్స్‌పై మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. మూడు ఉత్పత్తులు కొనుగోలు చేస్తే అదనంగా 15 శాతం, నాలుగు ఉత్పత్తులు కొంటే 20 శాతం డిస్కౌంట్ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్లిప్ కార్ట్ లోకి వెళ్లడమే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి