స్టార్టప్ సిటీస్‌లో సిటీనే టాప్
మహానగరంగా వినుతికెక్కిన తెలంగాణ రాష్ట్ర కేపిటల్ సిటీ ..భాగ్యనగరం సరికొత్త ఆవిష్కరణలకు అత్యుత్తమైన వేదికగా ఎంపికైంది. నగరం కీర్తి సిగలో మరో కలికితురాయిగా పేర్కొనవచ్చు. ప్రపంచ స్టార్టప్ నగరాల జాబితాల ఎంపికలో హైదరాబాద్ 75వ స్థానంలో నిలిచింది. అపారమైన వనరులు, అవకాశాలతో పాటు ప్రభుత్వ సానుకూల దృక్పథం కూడా ఇందుకు దోహద పడిందనే చెప్పాలి. చారిత్రక హైదరాబాద్..అధునాతన అభివృద్ధి ..ఐటీ కేంద్రంగానే కాకుండా సరికొత్త డిస్కవరీస్‌కు కేంద్రంగా ప్రపంచ స్థాయి నగరాలను ఆకర్చింది..సత్తా చాటింది. స్విట్జర్లాండ్‌కు చెందిన స్టార్టప్ బ్లింక్ అనే స్వయం నియంత్రణ అనే సంస్థ ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్‌లను ప్రోత్సహించే నగరాలను ఎంపిక చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా ఈసారి ప్రకటించిన నగరాల జాబితాలో ఏకంగా ప్రధాన నగరాలను తోసిరాజంటూ హైదరాబాద్ మెరుగైన స్థానాన్ని చేజిక్కించుకుంది. ప్రతి నగరానికి వచ్చిన పాయింట్ల ఆధారంగా సిటీస్‌ను ఎంపిక చేస్తుంది సంస్థ. 8.541 పాయింట్లతో హైదరాబాద్ జాబితాలోకి చేరింది. చెన్నై 74వ స్థానలో నిచింది. 262.8 పాయింట్లతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం మొదటి స్థానంలో నిలవగా ..55.9 పాయింట్లతో న్యూయార్క్ నగరం రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా యుఎస్ఏలోని 29 నగరాలు టాప్ 100 నగరాల్లో చోటు దక్కించుకున్నాయి. సరికొత్త ఐడియాలతో స్టార్టప్ లను ప్రారంభించే వారికి, ఆంట్రప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించే దిశగా తెలంగాణ సర్కర్ టీ హబ్‌ను ఏర్పాటు చేసింది.
పెట్టుబడులను కూడా ప్రభుత్వమే సమకూర్చి పెడుతోంది. కొత్త వారికి ప్రోత్సహం కల్పించేలా చేయడంతో భారీ ఎత్తున ఔత్సాహికులు స్టార్టప్‌లను స్టార్ట్ చేశారు. ఆ మేరకు లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలతో విస్తుపోయేలా చేస్తున్నారు. గత ఏడాది ప్రపంచ స్థాయిలో 115వ స్థానంలో ఉన్న మన నగరం ఇపుడు మరింత ముందుకు వెళ్లడంతో ఇక్కడి జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు స్టార్టప్ నగరాల ర్యాంకింగ్‌లో బెంగళూరు 11వ స్థానంలో ఉండగా ఢిల్లీ 18వ స్థానంలోను, ముంబై 19వ స్థానంలో, చెన్నై 74వ స్థానంలో, పూణె నగరం 84 వ స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఇలాంటి ర్యాంకింగ్‌లు రావడం వల్ల కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారికి..నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనే వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి