అజింక్యా ర‌హానేకు బంప‌ర్ ఆఫ‌ర్ - ఇంగ్లీష్ కౌంటీకి మ‌నోడు

భార‌తీయ క్రికెట్ జ‌ట్టులో కీల‌క‌మైన ఆట‌గాడిగా కొన‌సాగుతున్న అజింక్యా ర‌హానేకు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. ఇంగ్లీష్ క్రికెట్ కౌంటీ మ్యాచ్‌ల్లో ఆడేందుకు ఆహ్వానం అందింది. హాంప్ షైర్ క్రికెట్ జ‌ట్టు త‌ర‌పున రెహానే ఆడ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ -12 టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అటు టెస్ట్ క్రికెట‌ర్‌గా, ఇటు వ‌న్డే క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎడ‌మ చేతితో బ్యాటింగ్ చేసే ఈ క్రికెట‌ర్ ఫోర్లు, సిక్స‌ర్ల‌ను అల‌వోక‌గా కొడ‌తాడు. ఏ బౌల‌ర్ అయినా స‌రే..క్రీజులో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ స్కోర్ ఇత‌డి స్వంతం. 6 జూన్ 1988లో పుట్టాడు. మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ గా ఇపుడు ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టులో సేవ‌లందిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా చేశాడు.

ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ను 2007-2008లో ముంబ‌యి జ‌ట్టుతో స్టార్ట్ చేశాడు. 100 ఇన్నింగ్స్‌లు ఆడాడు. రెహానే బ్యాటింగ్ యావ‌రేజ్ 62.04 శాతం. మొద‌టి అయిదు క్రికెట్ సీజ‌న్స్‌లలో వ‌రుస‌గా వెయ్యి ప‌రుగులు సాధించాడు. ఇదో రికార్డు. టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. మాంచెస్ట‌ర్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రెహానే పాల్గొన్నాడు. 2013లో బోర్డ‌ర్ - గ‌వాస్క‌ర్ ట్రోఫీలో టెస్ట్ క్రికెట్‌లో ఆడాడు. వెల్లింగ్ట‌న్ లో న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో మొద‌టి సెంచ‌రీ చేశాడు. 17 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు మాజీ క్రికెట‌ర్ ప్ర‌వీణ్ ఆమ్రేతో కోచింగ్ తీసుకున్నాడు. అండ‌ర్ 19 జ‌ట్టులో 2007లో న్యూజిలాండ్ టూర్‌లో ఆడాడు.

ఇంగ్లండ్ ల‌య‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 172 ప‌రుగులు చేశాడు. విజ‌య్ హ‌జారే ట్రోఫీ టోర్నీకి ముంబై జ‌ట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. దియోద‌ర్ ట్రోఫీకి ఇండియ‌న్ స్క్వాడ్‌కు కెప్టెన్‌గా నియ‌మించారు. 144 ప‌రుగులు చేసి టైటిల్ సాధించేందుకు దోహ‌ద ప‌డ్డాడు రెహానే. టీ 20 లో కూడా యావ‌రేజ్ గా ఆడాడు. పాకిస్తాన్, ఇంగ్లండ్ తో జ‌రిగిన మ్యాచ్‌ల్లో మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 2013లో ఆస్ట్రేలియాతో టెస్ట్ క్రికెట్ ప్రారంభించాడు. 187 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు. 56 టెస్టులు ఆడి 3 వేల 488 ప‌రుగులు చేశాడు. ఇక వ‌న్డే క్రికెట్‌లో 90 మ్యాచ్‌లు ఆడి 2 వేల 962 ప‌రుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో యావ‌రేజ్‌గా 40.55 శాతం వుంటే..వ‌న్డే ప‌రంగా చూస్తే 35.26 శాతంగా ఉంది. టెస్టుల్లో టాప్ స్కోర్ 188 కాగా వ‌న్డేలో 111 ప‌రుగులుగా త‌న పేరు మీద రికార్డు న‌మోదైంది.

టి-20 మ్యాచ్‌ల్లో 80 మ్యాచ్‌లు ఆడాడు. 2 వేల 182 ప‌రుగులు చేశాడు. 103 ప‌రుగులు అత్య‌ధిక స్కోర్. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ఆట‌తీరు స్టీవ్ వాను, రాహుల్ ద్ర‌విడ్‌ను త‌ల‌పిస్తుంది. సియ‌ట్ ఇండియ‌న్ క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డును 2014 -2015 సంవ‌త్స‌రానికి అందుకున్నాడు. 2016లో బీసీసీఐ అర్జున అవార్డుకు సిఫార‌సు చేసింది. తాజాగా జ‌రుగుతున్న ఐపీఎల్ టోర్నీలో దుమ్ము రేపుతున్నాడు. ప్ర‌త్య‌ర్థుల బౌల‌ర్ల భ‌ర‌తం ప‌డుతున్నాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు రెహానే పిల్ల‌ర్‌గా మారాడు. సో..ఇత‌డి దూకుడును గుర్తించిన ఇంగ్లీష్ కౌంటీకి సంబంధించి హ్యాంప్ షైర్ రెహానేను ఎంపిక చేసుకుంది. ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభానికి ముందు కౌంటీ మ్యాచ్‌లు వార్మ‌ప్ గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

కామెంట్‌లు