దుమ్ము రేపిన రహానే..తలవంచిన విండీస్..!
ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా జట్టు టెస్ట్ మ్యాచ్ లోను వెస్ట్ ఇండీస్ ను ఓడించింది. ఏకంగా 318 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అజింక్యే రెహానే సెంచరీతో చెలరేగి పోయాడు. మరో వైపు బుమ్రా అద్భుతంగా అయిదు వికెట్లు పడగొట్టాడు. 100 పరుగులకే విండీస్ కుప్ప కూలింది. టెస్ట్ సిరీస్ లోనూ భారత జట్టు శుభారంభం చేసింది. బుమ్రా దెబ్బకు ప్రత్యర్తి ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా అయిదు వికెట్లు పడగొట్టాడు.
ఇషాంత్ శర్మ, షమీ కూడా చెలరేగి పోయాడు. దీంతో 419 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ వంద పరుగులకే కుప్ప కూలింది. ఆ జట్టులో కీమర్ రోచ్ ఒక్కడే 38 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది విండీస్. అంతకు ముందు మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసిన ఇండియా జట్టు మరో 158 పరుగులు జోడించింది. ఏడు వికెట్లు కోల్పోయి 343 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద ఇండియన్ కెప్టెన్ కోహ్లీ ఆటను ముగిస్తున్నట్టు ప్రకటించాడు.అజింక్య రహానే విండీస్ బౌలర్ల భారతం పట్టగా. ఏకంగా సెంచరీ సాధించి చుక్కలు చూపించాడు.
మరో వైపు తెలుగు కుర్రాడు హనుమ విహారి కూడా 93 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ఇదే సమయంలో బరిలోకి దిగిన విండీస్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టాడు బుమ్రా. పదునైన బంతులతో చెలరేగి పోయాడు. ఓపెనర్లు బ్రాత్ వైట్ , క్యాంప్ బెల్ లను పది పరుగుల లోపు వెనక్కి పంపాడు. మరో బౌలర్ ఇషాంత్ శర్మ వైవిధ్యమైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టాడు. వీరిద్దరి ధాటికి టీ విరామ సమయానికి 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లోకి చేరుకుంది. ఈ సమయంలో షమీ కూడా తోడు కావడంతో విండీస్ కు ఓటమి తప్పలేదు. అటు వన్డేలోను దుమ్ము రేపిన ఇండియా ఇప్పుడు టెస్ట్ లో కూడా తనకు ఎదురే లేదని చాటి చెప్పింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి