మన సింధు ఇక బంగారం

ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది. కొన్నేళ్ల కల నెరవేరింది. ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎప్పటి నుంచో ఆశిస్తున్న పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది. తెలుగు తేజం సింధు సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో జపాన్ కు చెందిన క్రీడాకారిణి ఒకుహూరపై ఘన విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో తొలి రౌండ్ లోనే అదరగొట్టింది. రెండో రౌండ్ లోనూ దూసుకు వెళ్ళింది సింధు. ప్రారంభం నుంచే పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పై చేయి సాధించింది. అభిమానులను అలరించింది.

రెండవ పాయింట్ నుంచి తొమ్మిది పాయింట్ల వరకు వరుసగా చెలరేగింది. ఆట మధ్యలో ఒకుహర రెండు పాయింట్లు సాధించినా సింధు మళ్ళీ జోరు కొనసాగించింది. విజేతగా నిలిచింది. బలమైన షాట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ఏ స్థాయిలోను పోటీ పడలేక పోయింది ఒకుహర. ఇరవై నాలుగేళ్లున్న పీవీ సింధుకు చిన్ననాటి నుంచే బ్యాడ్మింటన్ అంటే అభిమానం. ఒలంపిక్ పోటీల్లో తన ప్రతిభ పాటవాలను ప్రదర్శించిన ఈ క్రీడాకారిణికి ఇదే టోర్నీ యెనలేని పేరును తీసుకు వచ్చింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ సారధ్యంలో శిక్షణ తీసుకుంది.

కాగా  ఒలంపిక్స్ లో రజత పతకం సాధించిన మొదటి ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది పీవీ సింధు. 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకుంది. దీంతో ఆమెకు ఇంటర్నేషనల్ గా మరింత గుర్తింపు లభించింది. 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాదించింది  ఇలా గెలిచిన మొదటి ఇండియన్ క్రీడాకారిణి సింధునే కావడం విశేషం. ఇలా వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా తనకు ఎదురు లేదని నిరూపించింది . అద్భుత విజయం సాధించిన సింధుకు ప్రధాని, ప్రెసిడెంట్, సీఎం లు శుభాకాంక్షలు తెలిపారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!