మహిళల కోసం ఢిల్లీ ఐఐటియన్స్ ప్యాడ్స్ తయారీ

ప్రతి నెలనెలా వచ్చే నెలసరి సమయంలో మహిళలు ఉపయోగించే న్యాప్కిన్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఢిల్లీ ఐఐటి కి చెందిన విద్యార్థులు తయారు చేశారు. మార్కెట్ లో పేరొందిన కంపెనీలు తయారు చేసిన ప్యాడ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. స్టే ఫ్రీ , కంఫర్ట్, తదితర కంపెనీలు స్త్రీలకు మేలు కలిగించేలా రుమాళ్ళు (ప్యాడ్స్ ) తయారు చేస్తున్నాయి. కోట్లాది మంది మహిళలు, యువతులు, బాలికలు ప్రతి నెలా ఈ  రుతు సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వీటికి పరిష్కారం చూపేలా ప్రపంచంలో ప్రతి చోటా కంపెనీలు కొత్త రకంగా ప్యాడ్స్ తయారీలో పరిశోధనలు చేస్తున్నాయి. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.

వీటిని వాడడం వల్ల మహిళలు, బాలికలు తీవ్ర రోగాలకు గురవుతున్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న దేశంలో సగానికి పైగా మహిళలు, యువతులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా వచ్చే నెలసరి కోసం న్యాప్కిన్స్ తప్పని సరి. తన భార్య ప్రతి నెలా పడుతున్న ఇబ్బందిని గుర్తించిన తమిళనాడుకు చెందిన మురుగనాథన్ తక్కువ ధరల్లో, నాణ్యమైన ప్యాడ్స్ ను తయారు చేశాడు. ఆయన చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు దేశంలోని కోట్లాది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. స్వంతంగా న్యాప్కిన్స్ తయారు చేసేలా మెషీన్స్ రూపొందించాడు.

ఎందరికో న్యాప్కిన్స్ తయారీలో మహిళలకు , ఇతరులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంతో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రపంచ వ్యాప్తంగా అవార్డులు, భారత ప్రభుత్వం పురస్కారం అందజేసింది. ఇదే సమయంలో ఢిల్లీకి చెందిన ఐఐటి విద్యార్థులు సన్ ఫె అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. వీరి ఆధ్వర్యంలో అరటి పండ్ల గుజ్జుతో మహిళల కోసం వాడే న్యాప్కిన్స్ తయారు చేశారు. ఇవి పర్యావరణానికి ఎలాంటి హానీ చెయ్యమంటూ  సంస్థ సీఈఓ  అర్చిత్ అగర్వాల్ , కో ఫౌండర్ హ్యారీ శెరావత్ లు  వెల్లడించారు. రీ యూసబుల్ ప్యాడ్స్ వాడడం వల్ల మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. మొత్తం మీద వీరు చేసిన ఈ ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!