మలిదశ పోరాటానికి మళ్ళీ రెడీ..!
నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు మలి దశ పోరాటం చేయాలని తీర్మానం చేశారు. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పసుపు పంటను పండిస్తారు ఇక్కడి రైతులు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించారు. అంతే కాకుండా దేశంలోనే ఈ పార్లమెంట్ నియోజకవర్గం రికార్డ్ సృష్టించింది. భారీ ఎత్తున రైతులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి చెందిన ధర్మపురి అరవింద్ కవితపై ఘన విజయం సాధించారు. అంతకు ముందు నిజామాబాద్ జిల్లా రైతాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు , ఆందోళనలు , ధర్నాలు, సమ్మెలు చేపట్టింది.
అంతే కాకుండా, శాంతి యుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన అన్నదాతలను అరెస్ట్ చేయడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వం దిగి వచ్చింది. తమ న్యాయపరమైన డిమాండ్ కోసం రోడ్డెక్కిన రైతులను అరెస్ట్ చేయడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు , మేధావులు, ప్రజాస్వామిక వాదులు అభ్యంతరం తెలిపారు. సర్కార్ సీరియస్ కావడంతో పోలీసులు రైతులను విడుదల చేశారు.దీంతో తమకు పసుపు బోర్డు తీసుకు వస్తానని చెప్పిన కవితకు జీవితంలో కోలుకోలేని షాక్ ఇచ్చారు.

ఇదే సమయంలో అరవింద్ కు కట్ట బెట్టారు. తీరా బీజేపీ పసుపు బోర్డు ఏర్పాటులో తాత్సారం చేస్తుండడంపై రైతన్నలు మండి పడ్డారు. ఆర్మూర్ పట్టణంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు మలిదశ పోరాటం చేయాలని తీర్మానం చేశారు. మొత్తం మీద అన్నదాతలు తమ డిమాండ్ తీరేంత దాకా పోరాడాల్సిందేనంటూ పిలుపునిచ్చారు. మొత్తం మీద రైతులు తీసుకున్న నిర్ణయానికి అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు పసుపు బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యం చేయడం శోచనీయం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి