తేలనున్న కర్నాటక భవితవ్యం - ఎమ్మెల్యే కిడ్నాప్ కలకలం..!
కన్నడ నాట హై డ్రామా నడుస్తోంది. ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ రంగంలోకి దిగినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. ఎలాగైనా ఈ అవకాశాన్ని చేజిక్కించు కోవాలని, పవర్‌లోకి రావాలని బీజేపీకి చెందిన యడ్యూరప్ప పావులు కదుపుతున్నారు. రోజుకో ట్విస్టులతో మరింత రాజకీయాన్ని పండిస్తున్న కన్నడ పొలిటికల్ లీడర్స్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తండ్రీ కొడుకులు దేవెగడౌ, కుమార స్వామిలు ఎట్టి పరిస్థితుల్లోను తప్పుకునేది లేదంటూ స్పష్టం చేశారు. ఆ మేరకు విధాన సభలో స్పీకర్‌ను కలిసిన సీఎం తాము తమరు ఏ తేది నిర్ణయించినా బలపరీక్ష నిరూపించేందుకు రెడీగా ఉన్నామన్నారు. మరో వైపు సుప్రీంకోర్టులో రెబల్ ఎమ్మెల్యేలు తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ స్పీకర్‌ను ఆదేశించాలంటూ పిల్ వేశారు. దీనిపై ధర్మాసనం స్పీకర్ కు విశిష్ట అధికారాలు ఉన్న మాట వాస్తవమే..అయినంత మాత్రాన తానే సుప్రీం అనుకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు కిడ్నాప్‌నకు గురయ్యారంటూ వచ్చిన వార్తలు మరింత హీట్‌ను పెంచాయి. పరిస్థితులను దగ్గరుండి గమనిస్తున్న యడ్యూరప్ప ..నేరుగా తన అనుచరులతో గవర్నర్ ను కలిశారు. వెంటనే బల నిరూపణ చేపట్టాలంటూ కోరడంతో తక్షణమే దానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ..స్పీకర్‌ను ఆదేశించారు. ఆయన సూచనలను అసలు పట్టించు కోలేదు స్పీకర్ . తీవ్ర గందర గోళం మధ్య సభను వాయిదా వేశారు. తన సూచనలనే పక్కన పెట్టడంపై గవర్నర్ వజూభాయ్ వాలా సీరియస్ అయ్యారు. అటో ఇటో తేల్చకుంటే రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా ఇరు పార్టీలకు చెందిన అధినేతలు తమ మెదళ్లకు పని చెప్పారు. నువ్వా నేనా అన్న రీతిలో కన్నడ రాజకీయం కొనసాగుతోంది. ఈ సమయంలో అధికార పక్షం పంతమే నెగ్గింది. దిన దినగండంగా కొనసాగుతున్న సంకీర్ణ సర్కార్‌కు మరో రోజు గడువు దొరికింది. దీంతో ఇరు పార్టీల నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
విధాన సభలో ఏం జరుగుతుందో తెలియ లేదు. ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని సీఎం కుమార స్వామి ప్రవేశ పెట్టారు. ఆ సమయానికి విపక్షం వైపు 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా ..అధికార పక్షం వైపు 100 మంది లోపే ఉన్నారు. 15 మంది రెబల్స్ తో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరు డుమ్మా కొట్టారు. ఇప్పటికే బీజేపీకి మద్ధతు పలికిన ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు సభకు గైర్హాజరయ్యారు. దీంతో యెడ్యూరప్ప క్షణం ఆలస్యం చేయకుండా విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై అభ్యంతరం తెలిపారు కుమారస్వామి. ఇంకో వైపు కాంగ్రెస్ నేత సిద్దిరామయ్య ..దీనిపై క్లారిటీ కావాలంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. భోజన విరామం అనంతరం ప్రారంభమైన సభలో..కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ సంచలన ఆరోపణ చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీమంత పాటిల్‌ను బీజీపీ కిడ్నాప్ చేసి ముంబయికి తరలించిందంటూ ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్పీకర్‌కు అందజేశారు. దీనిపై విచారణ జరిపించడం తన పని కాదంటూ స్పీకర్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హుటాహుటిన గవర్నర్‌ను కలిశారు. తక్షణమే విశ్వాస పరీక్ష చేపట్టండంటూ గవర్నర్ ఆదేశించడంతో ..దీనిపై సాధ్యాసాధ్యాల గురించి అడ్వొకేట్ జనరల్ సలహా కోరారు. బల పరీక్ష జరిగేదాకా తాము సభ నుంచి కదిలేది లేదంటూ బీజేపీ సభ్యులు ధర్నాకు దిగారు. స్పీకర్ మాత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి