మోస్ట్ ఫేవ‌రబుల్ ఉమెన్‌గా అశ్విని అశోక‌న్

భార‌తీయులు త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌తో ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచేలా చేస్తున్నారు. దిగ్గ‌జ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, అడోబ్ , త‌దిత‌ర కంపెనీల‌న్నీ ఇండియ‌న్స్ చేతుల్లో ఉన్నాయి. తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా 40 మంది మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప‌ర్స‌నాలిటీని  అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ సెల‌క్ష‌న్ లిస్టులో ఇండియాకు చెందిన వ్యూ కంపెనీ సిఇఓగా ఉన్న అశ్విని అశోక‌న్ కు చోటు ద‌క్కింది. కేవ‌లం 36 ఏళ్ల వ‌య‌స్సున్న ఈమె అతి త‌క్కువ కాలంలోనే కంపెనీని లాభాల బాట‌లో ప‌య‌నించేలా చేసింది. ఇన్వెంట‌రీ మేనేజ్‌మెంట్ ప్రాసెస్‌ను ఉప‌యోగిస్తూ రిటైల్ బిజినెస్‌లో కంపెనీని టాప్ రేంజ్‌లో నిల‌బెట్ట‌డంలో అశ్విని కీల‌క భూమిక పోషించారు. సెంట్ర‌ల్ రిటైల్ డేటా బ్రెయిన్ పేరుతో ఆమె చేప‌ట్టిన ఆప‌రేష‌న్స్ కోట్లు కొల్ల‌గొట్టేలా చేశాయి. ఈ ప్రాసెస్ ట్రాన్సాక్ష‌న్స్ అంతా 180 దేశాల‌కు విస్త‌రించేలా చేసింది. 

రిటైల్ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక చ‌రిత్ర‌ను సృష్టించేలా అశ్విని అశోక‌న్ క‌ష్ట‌ప‌డ్డారు. గ‌త ఏడాది 2018లో ఏకంగా 8 బిలియ‌న్ ప్రొడ‌క్ట్స్‌ను వ్యూ కంపెనీ ద్వారా అమ్మ‌గ‌లిగేలా చేసింది. అశ్విని ..అమెరికాలోని కార్నేజీ మెల్లాన్ యూనివ‌ర్శిటీలో ఇంట‌రాక్ష‌న్ డిజైన్‌లో మాస్ట‌ర్స్ చేశారు. వ్యూలో చేర‌క ముందు ఆమె ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అమెరిక‌న్ ఐటీ దిగ్గ‌జ కంపెనీ ఇంటెల్ లో తొమ్మిది సంవ‌త్స‌రాల పాటు డిజైన్ స్పెష‌లిస్టుగా ప‌నిచేసి..ప్ర‌శంస‌లు అందుకున్నారు. అనంత‌రం ఆమెకున్న అనుభ‌వంతో కొత్త కంపెనీని స్టార్ట్ చేయాల‌ని ఆలోచించారు. త‌క్ష‌ణ‌మే త‌న భ‌ర్త ఆనంద్ చంద్ర‌శేఖ‌ర‌న్‌తో క‌లిసి 2014లో వ్యూ.ఏఐ కంపెనీని ప్రారంభించారు. ఇపుడా కంపెనీని ఐటీ అండ్ లాజిస్టిక్ సెక్టార్లో దుమ్ము రేపుతోంది. చెన్నైకి చెందిన వీరిద్ద‌రు ఇపుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. 

అశ్విని అశోక‌న్ వ్యూ కంపెనీని స్టార్ట్ చేసే ముందు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తం స్పెష‌లిస్టులు, టీం లీడ‌ర్లు, ఇత‌ర సిబ్బందిలో స‌గానికి పైగా మ‌హిళ‌లే ఉండాల‌ని నిర్ణ‌యించారు. ఆమేర‌కు స‌గానికి పైగా వ్యూ కంపెనీలో స్త్రీలు సేవ‌లందిస్తున్నారు. పురుషుల‌ను త‌క్కువ చేయ‌డం కాదు కానీ, మ‌హిళా సాధికార‌త అన్న‌ది దేశ వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రితో పాటు ప్ర‌ధాన మంత్రి కూడా ప‌దే ప‌దే ఉటంకిస్తున్నారు. దానిని మేం ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు రావాల‌ని అనుకున్నాం. దానికే ప్ర‌యారిటీ ఇస్తూ వారికే అవ‌కాశాలు ఇచ్చాం. మా న‌మ్మ‌కాన్ని వారు నిల‌బెట్టారు. కంపెనీకి త‌మ శ‌క్తియుక్తులను ధార పోశారు. ప్ర‌పంచంలో త‌మ కంపెనీలో ఎక్క‌డ ప‌నిచేసినా ..వారికి అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేశాం. అంతేకాకుండా మెట‌ర్నిటీ లీవ్‌తో పాటు ఇత‌ర సెల‌వులు, వేత‌నాలు ఇవ్వ‌డంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌డం లేదని స్ప‌ష్టం చేశారు అశ్వినీ అశోక‌న్.  కంపెనీని టాప్ రేంజ్‌లో నిల‌బెట్టినందుకు గాను అత్యంత ప్ర‌భావితమైన వ్య‌క్తుల‌లో అశ్విని చోటు ద‌క్కించుకున్నారు. భార‌త దేశానికి ఓ ర‌కంగా పేరు తీసుకు వ‌చ్చారు. మేరా భార‌త్ మ‌హాన్ క‌దూ. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!