పూరీ సంచ‌ల‌నం .. ప‌డి లేచిన కెర‌టం

మూడేళ్ల పాటు ఒక్క స‌క్సెస్ లేదు. టాలీవుడ్‌లో ..బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న సెన్సేష‌న‌ల్..డైన‌మిక్ డైరెక్ట‌ర్‌గా పేరొందిన పూరీ జ‌గ‌న్నాథ్ ..ఫీనిక్స్ ప‌క్షిలా తిరిగి విజయాన్ని స్వంతం చేసుకున్నారు. త‌న‌కు ఎదురే లేదంటూ నిరూపించుకున్నారు. ఆయ‌న స్థానంలో మ‌రొక‌రు ఉన్న‌ట్ల‌యితే ఈ పాటికే ఎప్పుడో ఆత్మ‌హ‌త్య చేసుకునే వారు. కోట్లాది రూపాయ‌లు స్వంతం చేసుకున్న ఈ డైరెక్ట‌ర్ ..ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ మ‌ధ్య డ్ర‌గ్స్ విష‌యంలో ఆయ‌న పేరు ప్ర‌ధానంగా వినిపించింది. ఇదే అంశంపై పూరీ జ‌గ‌న్నాథ్‌ను విచారించారు. సంపాదించినదంతా పోగొట్టుకున్నారు. చేతుల్లో చిల్లిగ‌వ్వ లేకుండా చేసుకున్నారు. న‌మ్ముకున్న వారే న‌ట్టేట ముంచ‌డంతో ఆయ‌న రోడ్డు మీద నిల్చున్నారు. స‌క్సెస్‌లో త‌న చుట్టూ తిరిగిన వారంతా ..త‌ను కోల్పోయిన మ‌రుక్ష‌ణ‌మే రాకుండా పోయారు. ముఖం చాటేశారు. 

ఫ్రీ అండ్ ఫ్రాంక్‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్ విప‌రీత‌మైన వ‌త్తిడికి లోన‌య్యాడు. త‌న కొడుకును పెట్టి సినిమా తీశాడు . అదీ ఫెయిల్ అయ్యింది. నేనింతే త‌ర్వాత ఏ ఒక్క సినిమా ఆడ‌లేదు. చివ‌ర‌కు బాల‌య్య‌తో తీసిన పైసా వ‌సూలు కొంత మేర‌కు ఆడినా అది కూడా బాక్సాఫిస్ వ‌ద్ద అప‌జ‌యం మూట‌గ‌ట్టుకుంది. ఇంకోరైతే సినిమా రంగం నుంచి నిష్క్ర‌మించే వారే..కానీ పూరీ జ‌గ‌న్నాథ్ అలా చేయ‌లేదు. ఫీనిక్స్  ప‌క్షిలా తిరిగి త‌న‌ను తాను రీఛార్జ్ చేసుకున్నారు. మ‌ళ్లీ త‌న క‌లానికి ప‌దును పెట్టారు. త‌నలోని క‌సికి ప్రాణం పోశారు. మ‌రో వైపు విజ‌యం కోసం ఆక‌లి మీదున్న ఎన‌ర్జటిక్ న‌టుడిగా పేరొందిన రామ్ పోతినేనితో సినిమా తీశాడు. తెలంగాణ నేప‌థ్యంగా ..అదే శ్లాంగ్‌తో ఏకంగా సినిమాను ప్లాన్ చేశాడు. రామ్ మంచి బాలుడు అన్న ట్యాగ్ లైన్‌ను మార్చేశాడు పూరీ. పూర్తిగా డిఫ‌రెంట్ రోల్‌తో ..డైలాగ్ మాడ్యూల్‌ను మార్చేశాడు. అద్భుతంగా ఇస్మార్ట్ శంక‌ర్ ను తీర్చిదిద్దాడు. దీని దెబ్బ‌కు 18న రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ టాక్ స్వంతం చేసుకుంది. 

ప‌వ‌ర్ ఫుల్ పంచ్‌ల‌తో పాటు ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ చాన్నాళ్ల త‌ర్వాత అద్భుత‌మైన రీతిలో సాంగ్స్ అందించాడు. మాట‌లతో మంట‌లు రేపాడు పూరీ జ‌గ‌న్నాథ్. మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ గా ఉన్న రాం గోపాల్ వ‌ర్మ టీంలోని స‌భ్యుడే ..పూరీ. ఈ అనూహ్య‌మైన విజ‌యం డైరెక్ట‌ర్‌కు ఎన‌లేని ఛార్జ్ క‌లిగేలా చేసింది. ఓవ‌ర్సీస్‌లో కూడా భారీ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టే దిశ‌గా సినిమా ప‌రుగులు తీస్తోంది. ఇప్ప‌టికే సినిమా కోసం చేసిన ఖ‌ర్చంతా ఒక్క‌రోజులోనే వ‌చ్చింద‌ని టాక్. న‌టీన‌టులు రామ్, హిబా, నిధిల న‌ట‌న టాప్ రేంజ్‌లో ఉండ‌డంతో ప‌క్కా మాస్ మూవీగా రికార్డులు బ్రేక్ చేసే దిశ‌గా సాగుతోంది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించేందుకు రెడీ అవుతోంది. పూరీ జ‌గ‌న్నాథ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మోస్ట్ టాలెంటెడ్ , క్రియేటివ్ క‌లిగిన డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గా , న‌టుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. 

2006లో మ‌హేష్‌బాబుతో తీసిన పోకిరి టాలీవుడ్‌ను షేక్ చేసింది. మ‌గ‌ధీర దానిని బీట్ చేసింది. బ‌ద్రి, ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం, ఇడియ‌ట్, అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి, శివ‌మ‌ణి,  చిరుత‌, నేనింతే , బిజినెస్ మాన్, టెంప‌ర్ త‌దిత‌ర చిత్రాలు విజ‌య‌వంతంగా ఆడాయి. పూరీ టాకీస్ బ్యాన‌ర్ మీద హార్ట్ ఎటాక్ నిర్మించాడు. యువ ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించేందుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా స్ఫూర్తిగా నిలిచాడు.  తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో  కలసి బుడ్డా హోగ తేరా బాప్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని సినిమా రంగానికి పరిచయం చేస్తూ అప్పులాంటి మూవీస్ తీశారు. మొత్తం మీద పూరీ జ‌గ‌న్నాథ్ మ‌ళ్లీ బ‌తికాడు. నిరాశ‌ను ద‌రి చేర‌నీయ‌ని ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు..త‌న‌కు ఎదురు లేదంటూ ప్రూవ్ చేసుకున్నాడు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!