అబ్బో..అమెరికానా..ఆస‌క్తి చూప‌ని యువ‌త

ప్ర‌పంచ వ్యాప్తంగా అమెరికా దేశానికి ఉన్నంత డిమాండ్ ఇంకే దేశానికి లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. ముఖ్యంగా ఇండియ‌న్స్ కు డాల‌ర్ల అంటే విప‌రీత‌మైన క్రేజ్. పండ్లు తోముకునే బ్ర‌ష్‌ల నుండి ప‌డుకునే బెడ్ షీట్ల దాకా అంతా అమెరికాకు చెందిన‌వే. భార‌త్‌కు చెందిన రూపాయ‌ల కంటే యుఎస్ డాల‌ర్లంటే భ‌లే మోజు. ఇంజ‌నీరింగ్ దాకా ఇక్క‌డే చ‌దువుకున్న యువ‌తీ యువ‌కులు..రెక్క‌లొచ్చాక‌..అమెరికాకు రుయ్ మంటూ వెళ్లి పోతున్నారు. చ‌దువు కోవ‌డానికి, ఉద్యోగ అవ‌కాశాల‌కు స్వ‌ర్గ‌ధామంగా పేరుంది యుఎస్‌కు. అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసినా చేయ‌క పోయినా స‌రే..ఎగిరి గంతేస్తున్నారు ఇండియ‌న్స్. 

బ‌రాక్ ఒబామా అధ్య‌క్షుడిగా వున్న స‌మ‌యంలో ..ఇండియా, యుఎస్ సంబంధాలు మెరుగ్గా వుండేవి. ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌య్యాడో అప్ప‌టి నుంచి ఇత‌ర దేశాల‌కు క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. అక్క‌డ వుంటున్న ప్ర‌వాస భార‌తీయుల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయినా ..అమెరికాపై వున్న మోజును మాత్రం త‌గ్గించు కోవ‌డం లేదు ఇండియ‌న్స్. చాలా దేశాల‌లోని యువ‌త‌కు యుఎస్ ఓ డ్రీం కంట్రీ. 2018తో పోలిస్తే అమెరికాలోని టెక్ జాబ్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మ‌రింత పెరిగింది. అమెరికా ఉద్యోగాల్లో విదేశీయుల షేర్  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 9.6 శాతం కాగా..గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి 9.3 శాతంగా ఉన్న‌ట్లు ఇండీడ్ డాట్. కామ్ ఆర్థిక‌వేత్త ఆండ్రూ ఫ్ల‌వ‌ర్స్ వెల్ల‌డించింది. 

యుఎస్ అధ్య‌క్షుడు డొనాల్డ్  ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు వంటి వాటి వల్ల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. క‌ఠిన‌త‌ర‌మైన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డంతో చాలా మంది ప్ర‌తిభావంతుల‌కు అడ్డంకి ఏర్ప‌డింది. యుఎస్ కు ప్ర‌యాణం అనేది గ‌గ‌నంగా మారింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ..నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమెరికా ఉద్యోగాలంటే చెవి కోసుకునే ..భార‌తీయు యువ‌త ఇపుడు అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. యుఎస్ కు వెళ్లి అష్ట‌క‌ష్టాలు ప‌డే బ‌దులు..ఇండియాలో క‌నీసం బ‌జ్జీలు అమ్ముకునైనా బ‌త‌కొచ్చంటూ ఇక్క‌డికే ప్రిఫ‌ర్ చేస్తున్నారు. ఇండియ‌న్స్ తో పాటు పాకిస్తాన్, ఇంగ్లండ్ త‌దిత‌ర దేశాల‌కు చెందిన వారు సైతం నో అంటున్నారు. 
 
వాస్త‌వానికి అమెరికా ఐటీ సెక్టార్‌లో ఎక్కువ శాతం మంది ఇండియ‌న్ టెక్కీల‌దే రాజ్యం. అత్య‌ధిక రెవిన్యూ ఇక్క‌డి నుంచే వ‌స్తోంది . వీరు ల‌క్ష‌లు సంపాదించినా ఇండియా కోసం ఖ‌ర్చు పెట్టింది మాత్రం ఏమీ లేదు. యుఎస్ టెక్ పోస్టింగ్స్ కోసం అన్వేషించిన వారిలో 3.7 శాతం మంది ఇండియ‌న్స్ ఉండ‌గా ..ఆ త‌ర్వాతి స్థానంలో కెన‌డా రెండో స్థానంలో, ఇంగ్లండ్, జ‌ర్మ‌నీ, ఫిలిప్పీన్స్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కాగా జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్, ర‌ష్యాల‌కు చెందిన వారు యుఎస్ ను ఎంపిక చేసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. దేశీయంగా అవ‌కాశాలు లేక పోవ‌డం కార‌ణం కాగా..ఎక్కువ వేత‌నాలు వ‌స్తాయ‌నే దానిపై మొగ్గు చూపుతున్నారు. 

కామెంట్‌లు