అతి క‌ష్టం మీద గ‌ట్టెక్కిన ఆస్ట్రేలియా

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా వెస్టిండీస్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో కంగారూల జ‌ట్టు అతి క‌ష్టం మీద గెలుపొందింది. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో క‌రేబియ‌న్స్ కంగారూల‌కు చుక్క‌లు చూపించారు. ఆఖ‌రు వ‌ర‌కు మ్యాచ్ విండీస్ వైపు ఉన్న‌ట్టు అనిపించినా కౌల్ట‌ర్ నైల్ విజ‌యానికి అడ్డుగోడ‌లా నిలిచాడు. త‌న జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. అత‌డు ఆడ‌క పోయివునింటే విండీస్ సునాయ‌సంగా విజ‌యం సాధించి వుండేది. వ‌చ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకుంది. అయినా దేనికైనా అదృష్టం క‌లిసి రావాలి. ఆద్యంత‌మూ ఆస‌క్తిక‌రంగా సాగింది ఈ మ్యాచ్.

79 ప‌రుగుల‌కే ఐదు ప్ర‌ధాన వికెట్ల‌ను కోల్పోయిన కంగారూల జ‌ట్టును కౌల్ట‌ర్, స్మిత్ లు క‌లిసి నిల‌బెట్టారు. కుప్ప కూలే ప్ర‌మాదం నుంచి త‌ప్పించారు. ముచ్చ‌ట‌గా రెండో విజ‌యం ద‌క్కించుకుంది ఆస్ట్రేలియా. మొద‌ట బ్యాటింగ్ కు దిగిన కంగారూలు ..49 ఓవ‌ర్ల‌లో 288 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 56 ప‌రుగులిచ్చి కాట్రెల్ 2 వికెట్లు తీయ‌గా, థామ‌స్ 63 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 41 ప‌రుగులు ఇచ్చి మ‌రో 2 వికెట్లు తీశాడు ర‌సెల్. నాథ‌న్ నైల్ 60 బంతులు ఆడి 8 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 92 ప‌రుగులు చేసి ఆదుకున్నాడు. స్టీవెన్ స్మిత్ 103 బంతులు ఆడి 7 ఫోర్ల‌తో 73 ప‌రుగులు చేసి నిల‌బెట్టాడు.

ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో మైదానంలోకి దిగిన విండీస్ జ‌ట్టు..అనుకోని ప‌రిస్థితుల్లో ఓట‌మి చెందింది. షై హూప్ 105 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 ప‌రుగులు చేస్తే..హోల్ట‌ర్ 57 బంతుల్లో 7 ఫోర్లు ఒక భారీ సిక్స‌ర్‌తో 51 ప‌రుగులు చేసి పోరాడినా విండీస్ జ‌ట్టును గ‌ట్టెక్కించ‌లేక పోయారు. 9 వికెట్లు కోల్పోయి 273 ప‌రుగులు చేసి..చ‌తికిల‌ప‌డింది. స్టార్క్ అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శించారు. 46 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టారు. క‌మిన్స్ 41 ప‌రుగులు రెండు వికెట్లు తీసి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ల‌క్ష్యం పెద్ద‌ది కాక పోయినా విండీస్ కు ఆరంభంలోనే దెబ్బ త‌గిలింది. 31 ప‌రుగుల‌కే ఓపెన్లు లూయిస్, గేల్ వెనుదిరిగారు. క్రీజులోకి వ‌చ్చిన పూరన్ కంగారూల‌ను ఆడుకున్నాడు.

36 బంతులు ఆడి 5 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 40 ప‌రుగులు చేసి ఆశ‌లు పెంచాడు. అయినా ఓట‌మి కొని తెచ్చుకుంది విండీస్ జ‌ట్టు. ఆస్ట్రేలియా జ‌ట్టు విష‌యానికి వ‌స్తే..కౌల్ట‌ర్ దుమ్ము రేపాడు. 28 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడి కేవ‌లం 154 ప‌రుగులు చేసిన ఆట‌గాడు ..ఇలా జ‌ట్టు స‌క్సెస్‌లో కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని ఎవ‌రూ న‌మ్మ‌రు.టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్ మెన్స్ స్థాయిలో ఈ టెయిలెండ‌ర్ అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించాడు. ఒక‌టి కాదు ఏకంగా 92 ప‌రుగులు చేసి ఔరా అనిపించాడు. 41 బంతుల్లోనే ఆఫ్ సెంచ‌రీ సాధించిన ఈ ఆట‌గాడు ఆ త‌ర్వాత రెచ్చి పోయాడు. 

కామెంట్‌లు