ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో పేటిఎందే హ‌వా -350 మిలియ‌న్ల స‌బ్ స్క్రైబ‌ర్స్

రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది పేటిఎం. ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ ల‌క్ష‌లాది మంది ఇందులో స‌భ్యుల‌య్యారు. క్ష‌ణాల్లో కేవ‌లం స్మార్ట్ ఫోన్ల ద్వారా ఒక చోటు నుంచి మ‌రో చోటుకు డ‌బ్బుల‌ను పంపించే సౌక‌ర్యం ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు దీనినే ప్రిఫ‌ర్ చేస్తున్నారు. పేటిఎంకే ప్ర‌యారిటీ ఇస్తున్నారు. 350 మిలియ‌న్ల మంది పేటిఎం బ్యాంక్‌లో రిజిష్ట‌ర్ చేసుకున్నారు. ఇది ఇండియ‌న్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో ఓ రికార్డ్‌. 12 బిలియ‌న్ల లావాదేవీలు ఈ బ్యాంక్ ద్వారా జ‌ర‌గ‌డం ఓ చ‌రిత్ర‌. 2019-2020 సంవ‌త్స‌రానికి భారీ ఎత్తున ఇందులో స‌భ్య‌త్వం తీసుకున్నారు. 2018-2019 సంవ‌త్స‌రంలో 5.5 బిలియ‌న్ల ట్రాన్సాక్ష‌న్ జ‌రిగితే..ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి మ‌రింత పెరిగింది. 

డిజిట‌ల్ పేమెంట్ సిస్టంలో పేటీఎం వ‌చ్చాక రూపురేఖ‌లు పూర్తిగా మారి పోయాయి. ప్ర‌తి ప‌ది మందిలో 9 మంది పేటీఎంను వాడుతున్నారు. 5.5 నుంచి 12 బిలియ‌న్ల లావాదేవీలు జ‌ర‌గ‌డం మామూలు విష‌యం కాదు. 2017 -2018 సంవ‌త్స‌రంలో కేవ‌లం 2.5 బిలియ‌న్లు ఉండ‌గా ..ఇండియ‌న్ ప్రైమ్ మినిష్ట‌ర్ మోదీ నోట్ల ర‌ద్దు పుణ్య‌మా అంటూ..పే టీఎం ఇండియా వ్యాప్తంగా త‌న హ‌వాను కొన‌సాగించింది. ఎక్క‌డ‌లేని డిమాండ్ ఈ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు వ‌చ్చింది. గ్రాస్ ట్రాన్సాక్ష‌న్ విలువ ప‌రంగా చూస్తే 2018-2019లో 50 బిలియ‌న్లుండ‌గా..గ‌తంలో 25 బిలియ‌న్లు ఉండేది. 
పేటీఎం లాగానే డిజిట‌ల్ పేమెంట్ విధానంలో మ‌రికొన్ని కంపెనీలు వ‌చ్చినా..పేటీఎం సాధించినంత స్పీడ్..పురోగ‌తి ఇంకే బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ దాని ద‌రిదాపుల్లోకి రాలేక పోయింది.

పేటీఎంపై కూడా ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. పాస్ వ‌ర్డ్‌లు మారి పోతున్నాయ‌ని, త‌మ మ‌నీకి భ‌ద్ర‌త అంటూ లేకుండా పోతోంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాట‌న‌న్నింటిని ప‌టాపంచ‌లు చేస్తూ పేటీఎం ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీరుస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న టెక్నాల‌జీని మార్చుకుంటూ ఇతోధికంగా సేవ‌లందిస్తోంది. ఇటు ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్ లైన్‌లో కూడా పేటీఎం సేవ‌లందిస్తోంది. రెంట‌ల్ పేమెంట్స్, ఫీజులు, యుటిలిటి చెల్లింపులు, ట్రావెల్ బుకింగ్స్, ఎంట‌ర్ టైన్ మెంట్, గేమ్స్, త‌దిత‌ర వాటికి సంబంధించిన చెల్లింపులు జ‌రిపేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి లైసెన్స్ పొందింది. దీంతో అత్య‌ధిక ఆదాయం గ‌డించే దిశ‌గా పేటీఎం ప్లాన్ చేసింది. చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్యాపార‌స్తులు దేశంలో అత్య‌ధికంగా వున్నారు. 

గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా వీరే. వీరిని టార్గెట్ చేసింది పేటీఎం. భారీ ఆఫ‌ర్లు, డిస్కంట్ల‌ను ఇస్తోంది. క‌ష్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తోంది. టెలికాం కంపెనీల‌తో పాటు వివిధ కంపెనీల‌ను ల‌క్ష్యంగా పెట్టుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని న‌గ‌రాలకు విస్త‌రించిన ఈ పేటీఎం చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లో త‌న వ్యాపారాన్ని విస్త‌రించేలా ప్లాన్ చేస్తోంది. ఇప్ప‌టి దాకా 350 మిలియ‌న్ల‌ను త‌న ప‌రివారంగా చేసుకున్న ఈ ఆన్ లైన్ బ్యాంక్ మిగ‌తా బ్యాంకుల‌కు స‌వాల్ విసురుతోంది. రియ‌ల్ టైం పేమెంట్ సిస్టం , యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్ ఫేస్ , ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ల ద్వారా త‌న కార్య‌క‌లాపాల‌ను సాగిస్తోంది పేటీఎం. ఎక్కువ‌గా మ‌ర్చంట్స్ మీద కాన్‌సెంట్రేష‌న్ చేస్తోంది. రోజూ లక్ష‌లాది రూపాయ‌ల లావాదేవీలు కొన‌సాగుతుంటాయి. దీని వ‌ల్ల డ‌బ్బులు మార్పిడి జ‌రుగుతూ వుంటాయి. వారికి ఇబ్బంది అంటూ ఉండ‌దు. డ‌బ్బులు ఉండాలే కానీ ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా పంపించే వీలుంటే చాలు..ఇంకెందుకు ఆల‌స్యం అంటోంది పేటీఎం. 

కామెంట్‌లు