షానే కింగ్ మేకర్ - మోదీ తర్వాతనే అతనే..!
నరేంద్ర దామోదర దాస్ మోదీకి నమ్మకమైన బంటుగా, నెంబర్ 2గా, ట్రబుల్ షూటర్‌గా, బీజేపీకి వ్యూహ చతురుడిగా, స్ట్రాటజిస్టగ్ రెండోసారి కమలం వికసించేలా చేసిన వ్యక్తిగా ..సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా అమిత్ షాకు పేరుంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఈ నాయకుడికి మోదీ ఎనలేని ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. ఏకంగా కేబినెట్‌లో అత్యంత కీలకమైన హోం శాఖను అప్పగించారు. ఆయనకు సహాయకుడిగా గంగాపురం కిషన్ రెడ్డికి చోటు కల్పించారు. తాజాగా మోదీ ప్రకటించిన కేబినెట్ కమిటీలలో ఏకంగా అత్యధిక కమిటీలో సభ్యుడిగా షాను నియమించం ఆయన ప్రాధాన్యతను చెప్పకనే చెప్పినట్లయింది.
ఇపుడు షా ఏది చెబితే అది తక్షణమే అమలవుతుంది. అంతలా ఆయన తన ప్రాభవాన్ని పెంచుకుంటూ పోయారు. ఏది పడితే అది బంగారం అన్నట్టుగా షా తన హవాను కొనసాగిస్తున్నారు. బీజేపీలో అతనిప్పుడు నెంబర్ 2 పొజిషన్ ను అనుభవిస్తున్నారంటూ మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. కమలంలో మరో సీనియర్ నేతగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ ప్రాభవానికి చెక్ పెట్టారు. కేవలం 2 కమిటీలకే పరిమితం చేశారు మోదీజి. విషయం తెలుసుకున్న సింగ్..అలక వహించడంతో మరో రెండు కమిటీలను చేర్చారు. 7 కమిటీల్లో ఏకంగా నిర్మలా సీతారామన్‌కు చోటు కల్పించారు. కేంద్ర కేబినెట్ కొలువు తీరడంతో కమిటీలను పునర్ వ్యవస్థీకరించారు. తాను రాజీనామా చేస్తానని బెదిరించడంతో గత్యంతరం లేక రాజ్‌నాథ్‌కు ప్రయారిటీ ఇచ్చారు.
ఎనిమిది కమిటీల్లో షాకు సభ్యత్వం కట్టబెట్టిన సర్కార్ ..నిర్మలకు ఏడు, గోయల్‌కు 5 కమిటీలలో స్థానం కల్పించారు. తనకు ప్రయారిటీ తగ్గడంపై అలక బూనడంతో రోజంతా హై డ్రామా జరిగింది. చివరకు ఆర్సెఎస్ జోక్యం కల్పించు కోవడంతో మరో రెండు స్థానాల్లోకి ఆయన పేరు చేర్చారు. సీనియర్ నాయకుడిగా, పార్టీకి జవసత్వాలు కల్పించడంలో రాజ్‌నాథ్ ఇతోధికంగా సేవలు అందించారని, ఇలా పక్కన పెట్టడం అవమానించడమే అవుతుందని ఆర్సెస్ పెద్దలు సూచించడంతో మోదీ తగ్గారు. సవరించిన జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఉన్నట్టుండి అమిత్ షా ప్రాధాన్యత అమాంతం పెరిగి పోయింది. ఆయన గ్రాఫ్ వందను దాటేసింది. కీలక కమిటీల్లో ఆయనకు చోటు దక్కింది.
దేశానికి సంబంధించిన ఆయా కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నే ముఖ్య కమిటీలనన్నింటిలోను షాకు స్థానం కల్పించారు మోదీ. ఆర్థిక వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, వసతి సౌకర్యాల కేబినెట్ కమిటీ ఇలా మొత్తం ఎనిమిదింట్లోను షానే కీలకం కాబోతున్నారు.ఇదిలా వుండగా ప్రతిష్టాత్మకమైన నీతి ఆయోగ్ కమిటీలోను అమిత్ షాకు చోటు దక్కింది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమించారు. ఆర్థిక, పార్లమెంటరీ, రాజకీయ, భద్రత, పెట్టుబడులు, వృద్ధి, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నియామకాలు, వసతి సౌకర్యాల కేబినెట్ కమిటీలను పునర్ వ్యవస్థీకరించింది. ప్రతి కమిటీలో షా ఉండడం విశేషం. ప్రధానమంత్రి లేని రెండు కమిటీల్లోను షా ఉన్నారు. నీతి ఆయోగ్ ను పునరుద్దరించారు. పూర్తి కాలపు సభ్యుడిగా ఉన్న దేవ్ రాయ్ ను తొలగించారు. షాను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమోట్ చేశారు. మొత్తంగా చూస్తే..అమిత్ షా నెంబర్ 2 అని అర్థం చేసుకోవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి