దుమ్ము రేపిన ఢిల్లీ..డీలా పడిన హైదరాబాద్ ..!
భారత మాజీ క్రికెట్ దిగ్గజం గంగూలి మెంటార్‌గా ఉన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పేలవమైన ఆట తీరును ప్రదర్శించి అపజయాన్ని కొనితెచ్చుకుంది. సన్ రైజర్స్ ముచ్చటగా మూడోసారి ఓటమిని మూటగట్టు కోవడం విశేషం. రబాడ, పాల్ , మోరిస్ విజృంబించడంతో సన్ రైజర్స్ ఏ కోశాన ధీటుగా బదులు ఇవ్వలేక పోయింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆ జట్టు ఏకంగా మరో మూడు మ్యాచ్‌లను కోల్పోయింది. ఓపెనర్లు బెయిర్ స్టో, వార్నర్‌లను నమ్ముకున్న ఆ జట్టు ప్రతిసారి జరిగే మ్యాచ్‌లో చతికిల పడుతోంది. 39 పరుగుల తేడాతో ఢిల్లీ ఘనమైన విజయాన్ని నమోదు చేసుకుని ..గెలుపుల్లో హ్యాట్రిక్ కొట్టింది. మరోసారి బ్యాటింగ్ వైఫల్యం సన్ రైజర్స్ ను వెంటాడింది.
ఎప్పటిలాగే ఓపెనర్లు డేవిడ్ వార్నర్ కేవలం 47 బంతులు ఆడి 51 పరుగులు చేయగా..ఇందులో మూడు ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉంది. మరో కీలక ఆటగాడు జానీ బెయిర్ స్టో 31 బంతులు ఆడి 41 పరుగులు చేసి జట్టు స్కోర్ పెంచాడు. అయిదు ఫోర్లు ..మరో సిక్సర్ సాయంతో ఈ పరుగులు వచ్చాయి. మొదట బ్యాటింగ్‌కు దిగన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమై పోయింది. పేసర్ ఖలీల్ 30 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ పేస్ బౌలర్లు రబాడా అద్భుతమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్‌కు చుక్కలు చూపించాడు. ఏకంగా 22 పరుగులే ఇచ్చిన ఈ బౌలర్ 4 వికెట్లు కూల్చాడు. మరో కీలక బౌలర్ కిమో పాల్ కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ముగ్గురు ఆటగాళ్లను పెవిలియన్ బాట పట్టించాడు.
మరో బౌలర్ మోరిస్ ను కీలక సమయంలో ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైదానంలోకి దించాడు. 18.5 ఓవర్లకే 116 పరుగులకే ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయారు. ఒక్కరొక్కరు పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. కీలక వికెట్లు పడగొట్టిన కీమో పాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. సన్ రైజర్స్ జట్టు తొలి వికెట్ కు 72 పరుగులు చేసినా ..ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు పోగొట్టుకున్నారు. వార్నర్, స్టో లు మాత్రమే రెండెంకల స్కోరు దాటారు. మిగతా వారు ఎవ్వరూ బౌలర్లను ఎదుర్కోలేక పోయారు. అయ్యర్ బౌలర్లను మార్చడం..బ్యాట్స్ మెన్లపై తీవ్ర ఒత్తిడి పెంచడంతో వికెట్లు చేజేతులారా పారేసుకున్నారు. 2.4 ఓవర్లలో పది పరుగుల తేడాతో సన్ రైజర్స్ జట్టు 7 వికెట్లు కోల్పోవడం విశేషం.
ఢిల్లీ జట్టులో బౌలర్లు మెరిసారు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఒక్కో పరుగు చేసేందుకు అష్టకష్టాలు పడ్డారు. మైదానం అంతటా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలియ తిరుగుతూ తన సహచర ఆటగాళ్లలో స్థయిర్యాన్ని నింపాడు. చాలా తక్కువ స్కోర్ ఉండడంతో సన్ రైజర్స్ జట్టు ఈజీగా గెలుస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ విజయం సాధించేందుకు సన్ రైజర్స్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. బంతిని స్వింగ్ చేయడంలో ..బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయడంలో బౌలర్లు మంచి పర్ ఫార్మెన్స్ కనబరిచారు. దీంతో టోర్నీలో మూడో విజయం సునాయసంగా ఢిల్లీ పరమైంది. ఇండియన్ ప్రిమియర్ లీగ్ లో ఇప్పటి వరకు ఏ జట్టు ఫైనల్ వరకు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ టోర్నీ టెలికాస్ట్ అవుతుండడంతో స్టార్ టీవీ గ్రూప్ కు ఎనలేని ఆదాయం సమకూరుతోంది. ఓ వైపు బెట్టింగ్‌లు..మరో వైపు యాడ్స్‌లు టోర్నీని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి