రుచిలో టాప్..ఆదాయంలో నెంబ‌ర్ వ‌న్ - కామ‌త్ హోట‌ల్స్ క‌హానీ

భార‌తీయ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలోంచి వ‌చ్చిన కామ‌త్ ఇపుడు ప్ర‌పంచంలోనే గ‌ర్వించ‌ద‌గిన హోట‌ల్స్ య‌జ‌మానిగా చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని స్వంతం చేసుకున్నారు. ఇదో ప్ర‌పంచ రికార్డు. ఒకప్పుడు డ‌బ్బుల కోసం నానా ఇబ్బందులు ప‌డిన కామ‌త్ కుటుంబం ఇపుడు వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా ఉపాధి చూపిస్తోంది. కోట్లాది రూపాయ‌లు రోజూ హోట‌ల్స్ ద్వారా స‌మ‌కూరుతున్నాయి. కొన్నేళ్లు గ‌డిచినా ఎలాంటి మార్పులు లేవు. క‌ష్ట‌మ‌ర్ల అభిరుచుల‌కు అనుగుణంగా హోట‌ల్స్‌ను ఏర్పాటు చేసుకుంటూ పోయారే త‌ప్పా ..నాణ్య‌త విష‌యంలో..సేవ‌లు అందించ‌డంలో కించిత్ తేడా క‌నిపించకుండా కాపాడుకుంటూ వ‌స్తోంది కామ‌త్ హోట‌ల్స్ యాజ‌మాన్యం. ఒక‌ప్పుడు చిన్న వీధి సందులో ఏర్పాటైన కామ‌త్ హోట‌ల్ ఇపుడు ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించింది. త‌న బ్రాండ్‌ను కాపాడుకుంటూ వ‌స్తోంది. డ‌బ్బున్న వాళ్లు గొప్ప వాళ్లు అనుకునే స్థాయికి దిగ‌జారిన మ‌న‌కు విఠ‌ల్ కామ‌త్ క‌ళ్లు తెరిపించారు.

భార‌తీయుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా..సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షిస్తూ కామ‌త్ హోట‌ల్స్ న‌డుస్తున్నాయి. ఇది ఒక ర‌కంగా పాఠంగా నేర్చుకోవాల్సిన అవ‌స‌రం వున్న‌ది. కాలే క‌డుపుల‌తో ..ప‌స్తులు ఉంటూ ఇడ్లి త‌యారీతో ప్రారంభ‌మైన కామ‌త్ ప్ర‌తి న‌గ‌రానికి విస్త‌రించింది. కామ‌త్‌లో టిఫిన్ల‌తో పాటు రుచిక‌ర‌మైన భోజ‌నాల‌ను వ‌డ్డిస్తారు. ఇండియ‌న్స్ తో పాటు ఇత‌ర దేశాల‌కు చెందిన వారంతా కామ‌త్ హోట‌ల్స్ కు రావ‌డం ప‌రిపాటిగా మారింది. ఇప్ప‌టికీ ఇడ్లి, సాంబారు, చెట్నీ ఈ మూడు కామ‌త్ కు పెట్టింది పేరు. ఏ దేశానికి వెళ్లినా కామ‌త్ హోట‌ల్ వుందా అని అడ‌గ‌టం మామూలే. అంత‌లా పాపుల‌ర్ అయ్యిందీ ఈ హోట‌ల్.

కామ‌త్ కుటుంబం ప్ర‌తి రోజు త‌ప్ప‌కుండా వారి హోట‌ల్స్ ల‌లో త‌యార‌య్యే ప్ర‌తి వంట‌కాన్ని రుచి చూస్తారు. ఏ మాత్రం రుచిలో..నాణ్య‌త‌లో తేడా వ‌చ్చినా వారు స‌హించ‌రు. డ‌బ్బుల కంటే రుచికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. ఆయా హోట‌ళ్ల‌లో ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేకంగా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇందులో ప‌నిచేసిన వారిని త‌మ ఇంటి వారికంటే ఎక్కువ‌గా చూసుకుంటారు. ప్ర‌భుత్వ స‌ర్వీసుల‌లో ప‌నిచేసే వారికి ఎలాంటి సౌల‌భ్యాలు వున్నాయో ఇక్క‌డ ప‌నిచేసే వారి ప‌ట్ల అంతే ర‌కంగా చూస్తారు. జీతాల‌తో పాటు ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పిస్తారు. దీంతో కామ‌త్ లో ప‌నిచేయ‌డం అంటే ప్ర‌తి ఒక్క‌రు గౌర‌వంగా భావిస్తారు. ఒక‌ప్పుడు హోట‌ల్స్ అంటే పూట‌కూళ్లుగా భావించే వారు. ఇపుడు సీన్ మారింది. ఫ్ల‌యిట్ ఎక్కినా..కోట్లు సంపాదించినా..ఎవ్వ‌రైనా స‌రే ..ఎక్క‌డ వున్నా..ఎంత దూరంలో వున్నా ..స‌రే తినేందుకు అక్క‌డికి ప‌రుగులు తీస్తున్నారు. డ‌బ్బులు ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడ‌టం లేదు.

డాక్ట‌ర్ విఠ‌ల్ కామ‌త్ కు 54 ఏళ్లు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ గా..మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా కామ‌త్ హోట‌ల్స్ గ్రూపున‌కు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇండియాలో ఎన్నో హోట‌ల్స్ త‌మ‌కు పోటీగా ఉన్నా ..కామ‌త్ మాత్రం త‌న స్థానాన్ని కోల్పోలేదు. ముంబై కేంద్రంగా న‌డుస్తున్న ఈ సంస్థను ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించేలా చేశారు కామ‌త్. 112 కోట్ల ఆదాయం కేవ‌లం ఈ హోట‌ల్స్ ద్వారా స‌మ‌కూరుతోంది. చిల్లి గ‌వ్వ లేకుండానే ..కేవ‌లం భార్య పుస్తెల‌తాడును అమ్మి ప్రారంభించిన కామ‌త్ ఇవాళ వ‌ర‌ల్డ్‌లోనే టాప్ టెన్ హోట‌ల్స్‌లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది. ఎలాంటి పైర‌వీలు..ఇంకెలాంటి సిఫార‌సులు లేకుండానే కామ‌త్ అగ్ర స్థానానికి ఎగ‌బాకింది. కామ‌త్ జీవిత‌మే ఓ సందేశంగా భావించ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా 22 రాష్ట్రాల‌లో పిల్ల‌లకు స్ఫూర్తి దాయ‌కంగా ఉంటుందనే ఉద్ధేశంతో నాన్ డిటైల్డ్ పుస్త‌కంగా పంపిణీ చేశారు. ఇది కూడా ఓ చ‌రిత్రే. ఒక సామాన్య‌మైన వ్య‌క్తి కోట్లాది రూపాయ‌ల హోట‌ల్స్ కు అధిప‌తి కావ‌డం విశేష‌మే. ఇడ్లి..ఆర్కిడ్..ఆకాశం పేరుతో ప్ర‌ముఖ ర‌చ‌యిత వీరేంద్ర‌నాథ్ తెలుగులోకి అనువాదం చేశారు.

ఎంద‌రో భార‌తీయులు ..ఎన్నో విజ‌యాలు స్వంతం చేసుకున్నారు. కానీ విఠ‌ల్ కామ‌త్ ది మాత్రం ప్ర‌త్యేక‌మైన క‌న్నీటి క‌థ‌. మ‌న‌క‌ళ్ల ముందే జ‌రిగిన గాథ‌. విఠ‌ల్ కామ‌త్ హోట‌ల్స్ య‌జ‌మానే కాకుండా మెంటార్‌గా, ఆంట్ర ప్రెన్యూర్‌గా, ట్రైన‌ర్ గా , స‌క్సెస్ ఫుల్ వ్యాపార వేత్త‌గా పేరు పొందారు. ఒకే ఒక్క గ‌దిలో ఉన్న కామ‌త్ ఇపుడు కోట్లాది రూపాయ‌లు క‌లిగిన భ‌వంతులు సంపాదించారు. అయినా త‌న మూలాలు మ‌రిచి పోలేదు. ఏ గ‌దిలో నుండి కామ‌త్ హోట‌ల్ ను ప్రారంభించారో అదే గ‌దిని అలాగే పెట్టుకున్నారు. అపురూపంగా చూసుకుంటున్నారు కామ‌త్. మొత్తం కామ‌త్ కుటుంబంలో ఎనిమిది మంది. ముగ్గురు అన్న‌ద‌మ్ములు, ముగ్గురు చెల్లెల్లు ..త‌ల్లిదండ్రులు. ఇంత మందితోనే ఆ ఒక్క గ‌దిలో నివ‌సించారు. ఆ జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ త‌న‌ను హెచ్చ‌రిస్తూనే వుంటాయంటారు కామ‌త్.

నేను పుట్టిన‌ప్పుడు మాకంటూ ఇల్లు వుండేది. మా నాయిన వెంకటేశ్ రెస్టారెంట్ న‌డిపించే వారు. ఎనిమిదేళ్ల వ‌య‌సులోనే మా తండ్రి ప‌నికి కుదిరాడు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త‌, స్వ‌యం శ‌క్తి ఇవ్వ‌న్నీ నాకు స్ఫూర్తి. మా అమ్మ ఆ రోజుల్లో ఇంత‌మందిని మ్యానేజ్ చేసేది. ప్ర‌తి ఒక్క‌రికి తానే వండి పెట్టేది. 1950లో మా నాయిన రెస్టారెంట్‌ను స్టార్ట్ చేశారు. వెంక‌టేశ్ కామ‌త్ ఈ పేరు కామ‌త్ హోట‌ల్స్ కు ప్రేర‌ణ‌. ఆయ‌న అందించిన ప్రోత్సాహ‌మే..క‌ష్ట‌ప‌డ‌ట‌మే ఇవాళ ఈ స్థాయికి చేరేందుకు దోహ‌ద‌ప‌డిందంటారు విఠ‌ల్ కామ‌త్. త‌న‌కు పోటీగా ఉన్న ఒబేరాయ్ హోట‌ల్స్ య‌జ‌మాని ఒబేరాయ్ ను క‌లిసేందుక‌ని వెళ్లారు. సెక్యూరిటీ అడ్డు చెప్పారు. చివ‌ర‌కు ఒబేరాయ్‌తో క‌లిసాక ..ఎట్టి ప‌రిస్థితుల్లోను ఒబేరాయ్ కు పోటీగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు కామ‌త్.

ఏదో ఒక‌రోజు మీకంటే గొప్ప‌గా..మీతో పోటీ ప‌డేలా నా కామ‌త్ హోట‌ల్స్‌ను తీర్చిదిద్దుతాన‌ని ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేశారు. మోసానికి గురైనా..చేతిలో చిల్లి గ‌వ్వ‌లేక పోయినా..కామ‌త్‌ను నిల‌బెట్టారు. తండ్రిని పోగొట్టుకున్నా..కుటుంబాన్ని కోల్పోలేదు విఠ‌ల్ కామ‌త్. ఒబేరాయ్ అప్ప‌టికే ఇండియాలో ఫేమ‌స్ హోట‌ల్స్ కు అధినేత‌. ముంబ‌యిలో ప్ర‌ధాన స్థ‌లంలో పూర్తిగా పచ్చ‌ద‌నంతో..ప‌ర్యావ‌ర‌ణం ఉట్టి ప‌డేలా కామ‌త్ భారీ ఎత్తున ఆర్చిడ్ హోట‌ల్‌ను నిర్మించారు. ఈ హోట‌ల్ ప్రారంభోత్స‌వానికి మొద‌టి ఆహ్వాన ప‌త్రిక‌ను ఒబేరాయ్‌కు అంద‌జేశారు డాక్ట‌ర్ విఠ‌ల్ కామ‌త్. ఒక‌ప్పుడు త‌న‌కు సాయం చేయండి అంటూ వ‌చ్చిన ఈ కుర్రాడు..ఇపుడు ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన హోట‌ల్‌కు అధిప‌తి అంటే న‌మ్మ‌లేక పోయారు ఒబేరాయ్.

నా జీవితంలో ఎంతో మందిని చూశాను..క‌లిశాను..కానీ విఠ‌ల్ నీలాంటి వ్య‌క్తి నాకు ఇంత‌వ‌ర‌కు తార‌స ప‌డ‌లేదు. నీ విజ‌యం కంటే నీకు నీమీదున్న న‌మ్మ‌కం గొప్ప‌ది. నేను మిమ్మ‌ల్ని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నానంటూ ఓ సుదీర్ఘ‌మైన లేఖ రాశారు ఒబేరాయ్. హోట‌ల్ ప‌రిశ్ర‌మ‌ల్లో దిగ్గ‌జాల స‌ర‌స‌న కామ‌త్ నిలిచింది. కామ‌త్ హోట‌ల్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా 18 మిలియ‌న్ల ఆదాయాన్ని పొందాయి. ఈ విష‌యాన్ని కామ‌త్ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ లో ప్ర‌క‌టించారు. ఎంతో ఎత్తుకు ఎదిగిన విఠ‌ల్ కామ‌త్ సాధించిన ఈ విజ‌యం కోట్లాది భార‌తీయుల‌కే కాదు ప్ర‌పంచానికి కూడా ఒక పాఠంగా మిగిలారు. కామ‌త్ జీ ..జీతే ర‌హో..కామ‌త్ మీ ఒక్క‌రిదే కాదు..కోట్లాది భార‌తీయుల కుటుంబానికి చెందింది..కాదంటారా..!

కామెంట్‌లు