చెన్నై చంద్రమా ..గెలుపే మంత్రమా

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా మరో విజయాన్ని నమోదు చేసింది . కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిని ఐపీఎల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. మొదట కోల్ కత్తా జట్టు బ్యాట్టింగ్ చేయగా చెన్నై నిర్దేశించిన టార్గెట్ ను ఈజిగా ఛేదించింది . ఇరు జట్లు బలమైనవి కావడం తో మ్యాచ్ మరింత హీట్ పెంచుతుందని అనుకున్న ఫాన్స్ కు ఆట ఏకపక్షంగా సాగింది . దీంతో గెలుపు సునాయాసంగా చెన్నైకి లభించింది. మొత్తం మీద కోల్ కత్తా జట్టుపై రైనా ఆఫ్ సెంచరీ చేయడం ..రవీంద్ర జడేజా తోడుగా నిలవడంతో ఏడో విజయాన్ని నమోదు చేసింది .

టార్గెట్ ను ఛేదించే క్రమంలో చెన్నై జ‌ట్టు ఆదిలోనే ఫాంలో వున్న షేన్ వాట్స‌న్, డుప్లిసిస్ , మ‌హేంద్ర సింగ్ ధోనీ , కేదార్ జాద‌వ్ లు త‌క్కువ ప‌రుగుల‌కే పెవీలియ‌న్ దారి ప‌ట్టారు. దీంతో మైదానంలో వున్న సురేష్ రైనా ఒక్క‌డే అద్భుత‌మైన ఫాంను క‌న‌బ‌ర్చి జ‌ట్టును విజ‌యపు అంచుల్లోకి తీసుకు వెళ్లాడు. కేవ‌లం 41 బంతులు ఆడి ఏడు ఫోర్లు, ఒక భారీ సిక్స‌ర్ సాయంతో 57 ప‌రుగులు చేశాడు. కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు రైనా.

సురేష్ కు తోడుగా రవీంద్ర జ‌డేజా తోడ‌వ‌డంతో గెలుపు చెన్నైని వ‌రించింది. ఫ్యాన్స్ ఎక్కువ‌గా ధోనీ బాగా ఆడ‌తాడ‌ని భావించారు. కానీ వాట్స‌న్, ధోనీలు ఇద్ద‌రు మంచి హిట్ట‌ర్సే. సిట్యూయేష‌న్ చూసుకుని ఆడ‌టంలో వీరికి వీరే సాటి. వాట్స‌న్ గ‌తంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. కాగా ఐపీఎల్ టోర్నీ జ‌రుగుతున్న‌ప్ప‌టి నుండి ధోనీ చెన్నై జ‌ట్టుకే ప్రాతినిథ్యం వ‌హిస్తూ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాల‌ను న‌మోదు చేస్తున్నాడు. ఓ వైపు భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ ఆట‌గాడు విలువ కోట్ల‌కు పై మాటే. ఇపుడు ఐపీఎల్ పుణ్య‌మా అంటూ ధోనీ త‌న గ‌త‌కాల‌పు టాలెంట్‌ను మ‌ళ్లీ క్రికెట్ అభిమానుల‌కు రుచి చూపిస్తున్నాడు. టోర్నీలో ఇప్ప‌టి దాకా ఆడిన అన్ని మ్యాచుల్లోను చెన్నై గెలుపొందింది. పాయింట్ల ప‌ట్టిక‌లో నెంబ‌ర్ వ‌న్‌లో ఉంది. మిగ‌తా జ‌ట్లు కొట్టుమిట్టాడుతున్నాయి.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రిస్ లిన్ చెన్నై బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడాడు. అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు. బంతుల‌ను బౌండ‌రీలు, సిక్స‌ర్లు దాటించాడు. అత‌డు గ్రౌండ్‌లో ఉన్నంత సేపు చెన్నై ఆట‌గాళ్లు మిన్న‌కుండి పోయారు. కేవ‌లం 51 బంతులు మాత్ర‌మే ఆడిన ఈ కోల్‌క‌త్తా ఆట‌గాడు విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్‌ను ప్ర‌ద‌ర్శించాడు. ఏ కోశాన ఎదుటి జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు ముఖ్యంగా బౌల‌ర్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా దంచేశాడు. ఏడు అద్భుత‌మైన ఫోర్లు రాగా..క‌ళ్లు చెదిరేలా ఆరు సిక్స‌ర్లు కొట్టాడు. క్రిస్ లిన్ ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు చెన్నై జ‌ట్టుతో.

మ‌రో వైపు చెన్నైకి చెందిన స్పిన్ మాంత్రికుడు ఇమ్రాన్ తాహిర్ నాలుగు కీల‌క‌మైన వికెట్లు ప‌డ‌గొట్టడంతో కోల్‌క‌త్తా అనుకున్న స్కోర్‌ను చేయ‌లేక పోయింది. బౌల‌ర్లు రాణించ‌డంతో కోల్‌క‌త్తా కేవ‌లం 20 ఓవ‌ర్లలో 161 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. చెన్నై బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ రెండు, మిచెల్ శాంట‌ర్న్ ఒక వికెట్ తీశారు. ఏ ముహూర్తాన చెన్నై జ‌ట్టు యాజ‌మాన్యం ధోనిని వేలం పాట‌ల్లో కొన్న‌దో అప్ప‌టి నుంచి ఆ మే.నేజ్‌మెంట్ నిశ్చింత‌గా నిద్ర పోతోంది. ఐపీఎల్ టోర్న‌మెంట్‌లో చెన్నై జ‌ట్టుకు ప్ర‌త్యేక‌మైన బ్రాండ్ ను ఎంఎస్ ఏర్పాటు చేశాడు. దీంతో ఇదో స్పెష‌ల్ టీంగా అంద‌రూ ప‌రిగ‌ణిస్తున్నారు.

కామెంట్‌లు