అక్బరుద్దీన్ దౌత్యం..పాక్ కు పరాభవం..నిను చూసి గర్విస్తోంది దేశం..!
నిన్నటి దాకా చిలుక పలుకులు పలుకుతూ, భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాది పాకిస్థాన్ కు అంతర్జాతీయ వేదికపైన పరాభవం తప్ప లేదు. తాను నమ్ముకున్న అమెరికా మౌనం వహిస్తే, ఒక్క చైనా తప్ప ఏ ఒక్క కంట్రీ పాక్ కు మద్దతు పలకలేదు. ఇస్స్యూ సీరియస్ కావడంతో ..అంతర్జాతీయ భద్రత సంస్థలో చర్చకు వచ్చింది. పాకిస్థాన్ ను ఒంటరి ప్రపంచలో ఒంటరి చేయడంలోనూ, దౌత్య పరంగా సక్సెస్ చేయడంలో ఒకే ఒక్కడు కీలక పాత్ర పోషించారు. అతడెవరో కాదు సయ్యద్ అక్బరుద్దీన్ . ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత ప్రతినిధి గా , భారత రాయబారిగా ఉన్నారు.
కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తో పాటు దానికి వంత పాడిన చైనాకు పరాభవం జరిగేలా చేసాడు. ఇది తమ స్వంత వ్యవహారమని, వేరెవ్వరు ఇందులో జోక్యం చేసుకోలేరని స్పష్టం చేశారు సయ్యద్. దీనిపై ప్రపంచాన్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు మాను కోవాలని పాక్ ను హెచ్చరించింది. అంతర్జాతీయ వేదికపై తన గొంతును గట్టిగా, మరింత బలంగా వినిపించారు. ఆయన ప్రదర్శించిన దౌత్యం , దూకుడు భారతీయుల మనసు గెలుచుకుంది. టెర్రరిజాన్ని రూపు మాపేందుకు ప్రతి దేశం, దానిని పాలిస్తున్న పాలకులు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ మీడియా సంధిస్తున్న ప్రశ్నలకు బెరుకు లేకుండా సమాధానం చెప్పారు. ఎక్కడా తొట్రు పడలేదు.
తాజాగా జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ లో అక్బరుద్దీన్ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ శాంతికి తీవ్రవాదం ఎలా అడ్డంకులు సృష్టిస్తుందో వివరించారు. దావుద్ లాంటి బడా నేతలతో పాటు ఉగ్రవాదులకు అడ్డాగా సదరు కంట్రీ పెంచి పోషిస్తోందంటూ ఆధారాలతో సహా మన రాయబారి వెల్లడించారు. దీంతో పాకిస్తాన్ మిన్నకుండి పోయింది. పర్యావరణం దెబ్బ తింటోందని, నూలుతో తాయారు చేసిన బ్యాగ్ లను పంచి పెట్టారు. కాశ్మీర్ పై ప్రకటన చేయాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలకు ఏ ఒక్క దేశం మద్దతు పలకలేదు. ఒక్క చైనా మాత్రం సపోర్ట్ చేసినా ఫలితం లేక పోయింది. చైనా ఈ అంశంపై ఎంత ఒత్తిడి తీసుకు వచ్చినా అంతర్జాతీయ వేదిక తలొగ్గలేదు. ఈ విషయంలో భారత్ కు విజయం చేకూర్చడంలో, అన్ని దేశాలను ఒప్పించడంలో అక్బరుద్దీన్ చేసిన కృషిని ఎలా మర్చి పోగలం. అందుకే ఈ దేశం సలాం చేస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి