ఆపన్నులకు నటుల కొండంత అండ

దేశవ్యాప్తంగా వర్షాల తాకిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒడిస్సా, కేరళ , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , మహారాష్ట్ర , తదితర రాష్ట్రాలను వరదలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, తదితర నదులన్నీ పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. ప్రమాద స్థాయిని దాటడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు భాదితులకు నిలువ నీడ లేకుండా పోయింది. దీంతో అక్కడి బీజేపీ సర్కార్ సహాయక చర్యలు చేపట్టింది, మరో వైపు తమిళ నాడులో కూడా వర్షాలు ఆశించినంత మేర పడ్డాయి. భారీ ఎత్తున వరద నీరు చేరడంతో ఎగువన ఉన్న ఆల్మట్టి , నారాయణ్ పూర్ జలాశయాలు నిండు కున్నాయి. 

ప్రమాద స్థాయిని దాటడంతో కర్ణాటక నీటి పారుదల శాఖా అధికారులు దిగువన ఉన్న జూరాలకు నీటిని వదిలారు. మరో వైపు కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తోంది. తుంగభద్ర కు భారీగా నీరు చేరుతోంది. అన్ని రాష్ట్రాలలో ప్రాజెక్టులు, ఎత్తి పోతల పథకాలు నిండి పోయాయి. కొన్ని నీట మునిగాయి. మరికొన్ని జలాశయాలు నిండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ కు నీటిని వదులుతున్నారు. గోదారి ఉగ్ర రూపం దాల్చడంతో అక్కడ కూడా ప్రమాద హెచ్చరికలు జారే చేసారు . దిగువన ఉన్న ప్రాంతాలు నీట మునిగాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి దాకా 250 మందికి పైగా మృతి చెందారు. 

ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయం చేయమని కోరారు. దీంతో ఆయన ప్రాంతాలలోని సినీ రంగాలకు చెందిన నటులు తమ వంతు సాయం ప్రకటించారు. ఇప్పటికే మహేష్ బాబు, కార్తీ తో పాటు ఆయన సోదరుడు తదితరులు స్పందించారు. తమవంతు భరోసా కల్పించారు. కార్తీ సోదరులు కర్ణాటక, కేరళ ప్రాంతాల్లోని బాధితులకు 10 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. కొల్హాపూర్ లోని శిరోలి ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. చాలా మంది ఇల్లు కోల్పోయారు. దీంతో ప్రముఖ నటుడు నానా పటేకర్ స్పందించారు. బాధితులకు  ఇల్లు కట్టించేందుకు  ముందుకు  వచ్చారు. సినీ రంగానికి చెందిన మిగతా నటీ నటులు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు రావాలని అభిమానులు కోరుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!