డ్రోన్ కలకలం ..బాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినా అధికార, విపక్షాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి విపక్ష నేతలు, నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగి పోయాయి . దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే దాకా వెళ్ళింది. అయినా ఫలితం లేక పోగా,  కరకట్ట దగ్గర బాబు నివాసాన్ని కూల్చేందుకు జగన్ డిసైడ్ అయ్యారు. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు చంద్రబాబు నివాసం దగ్గరి వరకు నీళ్లు వచ్చాయి. ఆయన కుటుంబం అప్పటికే హైదరాబాద్ కు మార్చేసింది. ఈ విషయం వైరల్ గా మారింది.

మరో వైపు ప్రభుత్వం ఉన్నఫలంగా బాబుకు ఉన్న జెడ్ కేటగిరి భద్రతను కుదించింది. ఈ విషయంపై తెలుగు తమ్ములు కొందరు కోర్టుకు ఎక్కారు. దీనిపై విచారించిన ధర్మాసనం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరి కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తొంబై మందితో కూడిన భద్రతను పునరుద్దరించాలని ఆదేశించింది. ఇప్పటికే ఆశా వర్కర్స్ రోడ్డెక్కరు. కాంట్రాక్ట్ సిబ్బంది తమను తొలగించ వద్దంటూ ఆందోళన బాట పట్టారు. పాలనపై కంటే ప్రతిపక్షాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాని టైం వెస్ట్ చేస్తున్నారంటూ టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు . ఇదిలా ఉండగానే చంద్రబాబు నివాసంపై ఎలాంటి అనుమతులు లేకుండానే ఇద్దరు అపరిచిత వ్యక్తులు డ్రోన్ ప్రయోగించారు .

ఈ విషయం దేశమంతటా వైరల్ అయ్యింది. దీనిని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు చంద్రబాబు. ఓ వైపు వరదలు ముంచెత్తి జనం అష్టకష్టాలు పడుతుంటే ఇంకో వైపు ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తన నివాసంపై పెట్టిన శ్రద్ధ భాదితుల సాయం కోసం పెట్టి ఉనింటే బావుండేదని ఎద్దేవా చేశారు. సహాయక చర్యలు చేపట్టడంలో సర్కార్ ఘోరంగా విఫలం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ బెదిరింపులకు పాల్పడుతోందని ఇది మంచి పద్ధతి కాదన్నారు. వరద బాధితులకు తెలుగు తమ్ముళ్లు, శ్రేణులు సాయం చేయాలనీ బాబు సూచించారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!