జాక్ పాట్ కొట్టేసిన అర్బన్ క్లాప్

ఇప్పుడు ఇండియాలో స్టార్తప్ ల హవా కొనసాగుతోంది. వందలాదిగా అంకుర సంస్థలు పుట్టుకు వస్తున్నప్పటికిని, కొన్ని మాత్రమే సక్సెస్ అవుతుండగా మరికొన్ని ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇంకొన్ని ఫెయిల్ అయ్యాయి. తాజాగా సేవల రంగంలో ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉన్న అర్బన్ క్లాప్ జాక్ పాట్ కొట్టేసింది. భారత దేశంలోని పలు నగరాలతో పాటు దుబాయ్ లో కూడా ఈ అంకుర సంస్థ తన వ్యాపారాన్ని విస్తరించింది. దీంతో పలు కంపెనీలు దీనిలో పెట్టుబడి పేట్టేందుకు ఉత్సుకత చూపిస్తున్నాయి. ఏకంగా 75 మిలియన్ల పెట్టుబడి అందుకుంటోంది ఈ సంస్థ. టైగర్ గ్లోబల్ దీనికి సపోర్ట్ గా నిలుస్తోంది.

వైయి కేపిటల్ కూడా అర్బన్ క్లాప్ లో ఇన్వెస్ట్ చేయనుంది. ఇప్పటికే 185 మిళియన్లను సేకరించింది. పని చేసే వారిని ఒకే చోటుకు చేరుస్తుంది ఈ సంస్థ. కాలీనర్స్, మరమత్తు చేసే సిబ్బంది, వృత్తి నైపుణ్యం కలిగిన వారి కోసం ఆయా కంపెనీలు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. అర్బన్ క్లాప్ లో తమ వివరాలు నమోదు చేసుకుంటే చాలు ఇక ఇబ్బందులు అంటూ వుండవు. బ్యూటీషియన్స్ కూడా వేలాది మంది ఇందులో ఇప్పటికే జాయిన్ ఆయారు. వినియోగదారులు 10 నగరాల్లో ఉన్నారు. మన సిటీసుతో పాటు దుబాయ్, అబుదాబి లో కూడా అర్బన్ క్లాప్ విస్తరించింది. ఈ స్టార్తప్ 20, 000  సూక్ష్మ సంస్థలతో ( దుకాణాలు, షాప్స్ ) ఒప్పందం కలిగి ఉన్నాయి. ప్రతి నెలా 4,50,000 లావాదేవీలు జరుగుతున్నాయని కో ఫౌండర్ అభిరాజ్ భాయ్ వెల్లడించారు.

టెక్నాలజీ పెరగడం , లైఫ్ మరింత ఇబ్బందిగా మారడం తో పాటు ఆయా కంపెనీలు , ఇతర రంగాలలో ప్రతిరోజు వేలాది మంది కార్మికులు, సిబ్బంది, నైపుణ్యం కలిగిన వారితో పాటు ఆఫీస్ స్టాఫ్ అవసరం అవుతారు. ఇందు కోసం లేటెస్ట్ టెక్నాలజీ వాడుతోంది అర్బన్ క్లాప్. నేరుగా అవసరమైన వారిని సమకూరుస్తుంది ఈ సంస్థ. దీని వల్ల దాదాపు 80 శాతం ఖర్చులు తగ్గడమే కాకుండా టైం సేవ్ అవుతుంది. తమ కంపెనీలో పని చేసే వారు ఒక్క కంపెనీలోని కాకుండా మరో రెండు మూడు కంపెనీల్లో పని చేస్తూ చేతి నిండా సంపాదిస్తున్నారు. దీంతో ఉన్న చోటనే ఉపాధి దొరుకుతోంది. సేవల రంగంలో అర్బన్ క్లాప్ దుమ్ము రేపుతోంది. ఆదాయ పరంగా దూసుకెళుతోంది. మొత్తం మీద సేవలను విస్తరించుకుంటూ వేలాది మందికి భరోసా కల్పిస్తున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!