అధిపతి ఆగ్రహం..యాదాద్రి మరో తిరుపతి కావాల్సిందే..!

ఈ దేశంలో ఆధ్యాత్మిక భావన కలిగిన ముఖ్యమంత్రులల్లో తెలంగాణా సీఎం కల్వకుంట్ల  చంద్ర శేఖర్ రావు ప్రథమ స్థానంలో నిలుస్తారు. అదీ ఆయన ప్రత్యేకత. ఎక్కడ గుడి కనిపిస్తే చాలు అక్కడికి తానే స్వయంగా వెళతారు. మొక్కులు తీర్చుకుంటారు. దర్శనం చేసుకుంటారు. మొదటి నుంచీ కేసీఆర్ దంపతులకు దైవం పట్ల నమ్మకం ఎక్కువ. వాసనలు రాక పోయినా, పాలన ప్రజలకు అందుబాటులో ఉండేలా, బంగారు తెలంగాణ దిశగా మార్చేలా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా ఆయన యజ్ఞ , యాగాలు చేస్తారు. పండితులను, పామరులను గౌరవిస్తారు. సన్మానిస్తారు. వారికి యెనలేని ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంపై విపక్షాలు విమర్శలు చేసినా పట్టించు కోలేదు.

తాను ఖర్చు చేసే ప్రతి పైసా తాను సంపాదించిన దానిలోంచే ఖర్చు చేస్తున్నానని, మీకెందుకు ఆ బాధ అంటూ సెటైర్స్ విసిరారు. కేసీఆర్ కు ముందు నుంచి యాదగిరిగుట్ట లో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి అంటే యెనలేని అభిమానం. నమ్మకం కూడా. ఆలయానికి యాదాద్రి పేరు పెట్టారు. పూర్తిగా శాస్త్రోక్తంగా, ప్రపంచంలోనే ఏ ఆలయం లేని రీతిలో పునర్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. జగత్ గురువు శ్రీ శ్రీ శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామీజీకి కేసీఆర్ అపార భక్తుడు. దీంతో ఆలయానికి పూర్వ వైభవం తీసుకు రావడంతో పాటు దాని డిజైన్ , నిర్మాణం, పర్యవేక్షణ అంతా స్వామి వారికి అప్పగించారు. వందల కోట్ల రూపాయలు యాదాద్రి ఆలయ నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్నారు.

ఇప్పటికే దాదాపు 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ప్రముఖ ఆర్కి టెక్షర్ ఆనంద సాయి ఆధ్వర్యంలో ఆలయ పనులు జరుగుతున్నాయి. అయితే ఆకస్మికంగా గుడినిసీఎం సందర్శించారు . భారీ ఎత్తున యాగాన్ని నిర్వహించ బోతున్నారు కేసీఆర్. ఇంకా పనులు పూర్తి కాక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే 54 కోట్లు మంజూరు చేశారు. అంతకు ముందు శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామిని దర్శించుకున్నారు . హరిత అతిథి గృహంలో 5 గంటలకు పైగా సమీక్ష నిర్వహించారు .ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం ను కలిశారు. మొత్తం మీద తాను మొక్కులు తీర్చుకునే , ఆరాధ్య దైవం నరసింహ్మ స్వామి కరుణ కటాక్షం కలగాలని కేసీఆర్ కోరుకున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!