ప్రపంచం మెచ్చిన మహిళా నాయకురాలు - కరుణా గోపాల్ ..!
ఫ్యూచరిక్ సిటీస్ ..స్మార్ట్ సిటీస్ ..ఈ పేర్లు వింటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఒకే ఒక్కరు ..ఆమె కరుణా గోపాల్. వ్యక్తి నుండి సంస్థగా ఎదిగిన ఆమె ప్రయాణం స్ఫూర్తి దాయకంగా వుంటుంది. ఒక మహిళగా ..తల్లిగా..ఆంట్రప్రెన్యూర్‌గా..మెంటార్‌గా..ఫౌండర్‌గా..మేధావిగా..ప్రతిభ..తేజస్సు కలిగిన వ్యక్తిగా ఎదిగారు. ఎందరికో ఆదర్శ ప్రాయంగా నిలిచారు. ప్రస్తుతం బీజేపీలో కేంద్ర స్థాయిలో కీలకమైన భూమికను పోషిస్తున్నారు. మరో వైపు ఫ్యూచరిక్ సిటీస్‌ను స్థాపించి నగరాలను ఎలా కాపాడు కోవాలో తెలియ చేస్తున్నారు. ఐవిఎల్‌పీ ఫెలోగా ఉన్నారు. అమెరికాలో పేరొందిన హార్వర్డ్ యూనివర్శిటీలోని జాన్ ఎఫ్. కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మేధావిగా..ఆలోచనల్లో అత్యంత సునిశితమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్లినా థాట్ ..డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. స్మార్ట్ సిటీస్ గురించి ఆమె ఎన్నో పరిశోధనలు చేశారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. అపారమైన అనుభవాన్ని గడించారు. ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిక్ సిటీస్ సంస్థకు ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్నారు.
గత కొన్నేళ్లుగా ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా సెమినార్లు, సమావేశాలు, అవగాహన శిబిరాలు నిర్వహించారు. లెక్కలేనన్ని థీసెస్ సమర్పించారు. 100 స్టార్మ్ సిటీస్ మిషన్ పేరుతో ఏర్పాటైన కార్యక్రమానికి ఆమె కీలక పాత్ర పోషించారు. దీనిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. కరుణా గోపాల్ పట్టణాలు, నగరాలు ఎలా వుండాలో ..ఎలాంటి సౌకర్యాలను..వసతులను ఏర్పాటు చేయాలో ..వాటికి కావాల్సిన వనరుల సమీకరణ..ఆచరణలోకి ఎలా తీసుకు రావాలో సూచిస్తూ కార్యాచరణను రూపొందించారు. అదే స్కల్ట్ పేరుతో అమలు చేస్తున్నారు. దీనికి గాను కరుణా గోపాల్‌కు జాతీయ స్థాయిలో నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్ పేరుతో పురస్కారాన్ని అందజేసింది ప్రభుత్వం. సింగపూర్, స్వీడన్, యుకె, ఫిలిప్పైన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, ఇజ్రాయిల్, అమెరికా లాంటి దేశాలు స్మార్ట్ సిటీస్‌ను ఎలా రూపొందించాలో కోరుతూ కరుణా గోపాల్‌ను అడ్వయిజర్‌గా నియమించుకున్నారు. అర్బన్ ఎక్స్‌పర్ట్‌గా ప్రపంచ బ్యాంకుతో పాటు డిఎఫ్ ఐడి, యుఎస్ ఏఐడి తో పాటు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులో పనిచేశారు. 2015లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో పాటు యునియన్ మినిస్ట్రి ఫర్ హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్‌కు సీనియర్ అడ్వయిజర్‌గా బాధ్యతలు చేపట్టారు.
నేషనల్ మిషన్ ప్రోగ్రాం- క్లీన్ ఇండియా - స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాల రూపకల్పన..అమలుపై ఏకంగా బ్రీఫ్ నోట్ తయారు చేశారు. వాటి పర్యవేక్షణ కూడా ఆమె నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిష్టర్స్ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. సిస్టర్ స్టేట్ పార్ట్‌నర్‌షిప్ గా వాషింగ్టన్ - ఏపీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కీలక బాధ్యతలు చేపట్టారు. శిక్షణ ఐఏఎస్‌లకు సంబంధించిన ప్రిమియర్ అకాడెమీతో పాటు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్ట్రి అకాడెమి ఆఫ్ అడ్మిస్ట్రేషన్ కాలేజీ, వరల్డ్ బ్యాంక్ ఇనిస్టిట్యూట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా , సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లలో అటు ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు, మేనేజ్‌మెంట్ గురులకు స్మార్ట్ సిటీస్‌పై పాఠాలు చెప్పారు. 2016లో లండన్‌లో జరిగిన యుకె - ఇండియా పార్లమెంటేరియన్ల సమావేశానికి చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. ఆమె పనితీరుకు మెచ్చిన యునైటెడ్ కింగ్‌డమ్ లోని రాయల్ సొసైటీ ఫర్ చార్టెడ్ సర్వేయర్స్ లో కరుణా గోపాల్‌ను ఎమినెంట్ మెంబర్‌గా అపాయింట్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఆమె స్మార్ట్ సిటీస్ గురించి ఎన్నో వ్యాసాలు, ప్రత్యేక కథనాలు , విశ్లేషణలు రాశారు. ద ఎకానమిస్ట్, చానల్ న్యూస్ ఏషియా, ద నేషనల్, ఖలీజ్ టైమ్స్, లా ట్రిబ్యూన్, ఎకో బిజినెస్, నేషనల్ జియోగ్రాఫిక్ , వరల్డ్ ఎకనామిక్ ఫోరం తదితర వాటిల్లో ఆర్టికల్స్ వచ్చాయి.
పాలసీ మేకింగ్‌లో భాగంగా లోక్‌సభ కు సంబంధించిన పార్లమెంటరీ డాక్యుమెంటేషన్‌లో ప్రధాన భూమికను పోషఙంచారు కరుణా గోపాల్. ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రాంతో పాటు హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో జరిగిన సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఫారిన్ లీడర్స్ ప్రోగ్రాంలో కూడా ఉన్నారు. 2015లో పారిస్ లో జరిగిన యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ - కాప్ 21 - యుఎన్ ఎఫ్ సీసీసీ పేరుతో స్మార్ట్ సిటీస్ గురించి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సమావేశానికి కరుణా గోపాల్ ప్రధాన వక్తగా అటెండ్ అయ్యారు. ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పేరుతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కీలకోపన్యాసం చేశారు. స్మార్ట్ అర్బనైజేషన్ రీఇన్వెంటింగ్ గ్రోత్ విత్ ఈక్విటీ పేరుతో విస్తృతంగా ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, ఐఏఎస్‌ల కుటుంబం నుంచి కరుణా గోపాల్ వచ్చారు. 2017లో బార్సిలోనాలో స్మార్ట్ సిటీస్‌పై ప్రకటించిన జిఎస్ ఎంఏ గ్లోమో అవార్డును ఇంటర్నేషనల్ జ్యూరీ ఆమెకు ప్రకటించారు. న్యూయార్క్‌లోని ఇంటెలిజెంట్ కమ్యూనిటీస్ ఫోరం కు జ్యూరీ ఎంపిక చేసింది. ఇన్సియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కేంద్ర ప్రభుత్వం 2017లో స్మార్ట్ గ్రిడ్ ప్రోగ్రాం జ్యూరీ కరుణకు పురస్కారం ప్రకటించింది. న్యూయారక్ జెర్సన్ లెహర్‌మాన్ గ్రూప్ కౌన్సిల్ సభ్యురాలిగా నియమించింది. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టెక్నాలజీ ఆంట్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం కు మెంటార్‌గా వ్యవహరించారు.
ఐఐటీ బాంబే టెక్ ఫెస్ట్‌కు మెంటార్‌గా, అసోసియేషన్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ఇండస్ట్రీ ఇండియా జెనరల్ అసెంబ్లీ సభ్యురాలిగా, 2018 ద సీఎస్ఆర్ జర్నల్ ఎక్సలెన్స్ అవార్డు మెంబర్‌గా ఉన్నారు. అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ మేగజైన్ ఎడిటోరియల్ అడ్వయిజరీ బోర్డు సభ్యురాలిగా, యుకె ఇన్నోవేషన్స్ రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ సర్వేయర్స్ లండన్ ఎమినెంట్ మెంబర్ గా పనిచేశారు. అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్, స్కల్‌ప్ట్ యువర్ సిటీ, కార్పొరేట్స్ ఫర్ సిటీస్, స్టాక్, టు ఇన్‌ఫ్ల్యూయన్స్ పాలసీ , ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డైలాగ్ సిరీస్, విమెన్ అండ్ ఎంప్లాయిబిలిటీ రౌండ్ టేబుల్స్, స్టార్ట్ సిటీస్ అండ్ ఇన్‌క్లూస్ రౌండ్ టేబుల్స్, స్మార్ట్ ప్రొక్యూర్‌మెంట్ ఫ్రేం వర్క్ పేరుతో ఇన్నోవేషన్స్ క్రియేట్ చేశారు కరుణా గోపాల్. పట్టణాలు, నగరాల పరిరక్షణ..అభివృద్ధి ..కార్యాచరణ ప్రణాళికపై చేసిన కృషికి గాను ప్రపంచ వ్యాప్తంగా, దేశీయంగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ , ద సండే స్టాండర్డ్ సంయుక్తంగా 2015లో డైనమిజం అండ్ ఇన్నొవేషన్ కింద దేవి అవార్డుతో సత్కరించారు. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విజినరీ లీడర్‌షిప్ విభాగంలో చాణక్య అవార్డును బహూకరించింది. చెన్నైయిలోని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ మహిళా రత్న బిరుదుతో సన్మానించింది.
వరల్డ్ హెచ్ ఆర్ డి కాంగ్రెస్ ద మోస్ట్ ఇంపాక్టబుల్ స్మార్ట్ సిటీస్ లీడర్‌గా ప్రకటించింది. ద మోస్ట్ టాలెంటెడ్ గ్రీన్ లీడర్ అవార్డును దక్కించుకున్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఎమినెంట్ లీడర్‌షిప్ అండ్ అచీవ్‌మెంట్స్ పేరుతో కరుణా గోపాల్‌ను ఎంపిక చేసింది. పాజియోనేట్ ఫౌండేషన్ విమెన్ ఇన్నోవేటర్ అవార్డుకు ఎంపిక చేసింది. అట్లాంటా - హోస్టన్ డల్లాస్‌లో జరిగిన నాటా, తానా, ఆటలు బెస్ట్ విమెన్ లీడర్‌గా ప్రకటించాయి. అద్భుతమైన రీతిలో సత్కరించాయి. 2007లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన లీడ్ ఇండియా క్యాంపెన్‌లో ఐదు మంది ప్రతిభ కలిగిన మహిళలను ఎంపిక చేస్తే అందులో మొదటి పేరు కరుణ గోపాల్‌ను చేర్చారు. 2011లో ఐవీఎల్‌పీ ఫెలోగా ప్రకటించి యుఎస్ సర్కార్. 1991లో యుఎస్ రోటరీ జీఎస్ ఇ స్కాలర్‌గా ఎంపిక చేసింది. గ్లోబల్ కాన్ఫరెన్సెస్‌లో కీ నోట్ స్పీకర్‌గా వినుతి కెక్కారు కరుణా గోపాల్. 2018లో సైన్స్ ఇండియా నిర్వహించిన సైన్స్ గాల లో ..2019 ఖతార్‌లో నిర్వహించిన సైన్స్ ఇండియా ఫోరంలో కీలక ఉపన్యాసం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ప్రధాన మంత్రి ద వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రసంగించాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. ఇదే సమయంలో 2018 ఫిబ్రవరిలో దుబాయిలో సీఎన్ ఎన్ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ చీఫ్ రిచర్డ్ క్వెస్ట్ కరుణను ఇంటర్వ్యూ చేశారు. ఇదో రికార్డుగా మిగిలి పోయింది.
2018 ఏప్రిల్‌లో టర్కీలో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, ఇండస్ర్టీ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అండ్ నేచురల్ రిసోర్సెస్ , మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ శాఖలు సంయుక్తంగా ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ స్మార్ట్ గ్రిడ్స్ అండ్ సిటీస్ కాంగ్రెస్ పేరుతో నిర్వహించిన సమావేశానికి ఆమె ప్రధాన స్పీకర్‌గా ఉన్నారు. లండన్‌లోని రాయల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ చార్టెడ్ సర్వేయర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్ ఫోరం సమావేశంలో ప్రధాన వక్తగా హాజరయ్యారు. టర్కీలో టర్కిష్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ అర్బనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ జిఐఎస్ డే సెమినార్‌కు ప్రధాన వక్తగా అటెండ్ అయ్యారు. దుబాయిలో జరిగిన ఇండియా యుఏఇ ఎకనమిక్ ఫోరం సదస్సులో కీ స్పీకర్‌గా ఉన్నారు. ఐదవ ఇంటర్నేషనల్ ఇస్తాంబుల్ స్మార్ట్ గ్రిడ్స్ అండ్ సిటీస్ కాంగ్రెస్ ఫెయిర్‌లో స్పీకర్‌గా హాజరయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అర్బనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, నేచురల్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్, మేరిటైం అఫైర్స్, కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ముఖ్యురాలిగా హాజరయ్యారు. యుకె, బెల్జియంలలో ద ఎకనామిక్ అండ్ సోషల్ రిసెర్చ్ కౌన్సిల్ సమావేశానికి కీలక స్పీకర్‌గా ఉన్నారు. హాంగ్‌కాంగ్‌లో జరిగిన వరల్డ్ బిజినెస్ కాన్‌క్లేవ్‌లో గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా ..కీ స్పీకర్‌గా కరుణా గోపాల్ హాజరయ్యారు. సింగపూర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కాన్ఫరెన్స్‌లో కీ నోట్ ఇచ్చారు.
లండన్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో స్మార్ట్, సస్టయినబుల్ సిటీస్ సమ్మిట్‌కు సెషన్ చెయిర్ పర్సన్‌గా వ్యవహరించారు. సింగపూర్‌లో జరిగిన వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో కీలక భూమిక పోషించారు. మనీలాలో జరిగిన క్లార్క్ గ్రీన్ సిటీస్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యుఎస్ ఏలోని ఆస్టిన్‌లో జరిగిన స్మార్ట్ సిటీస్ ఇన్నోవేషన్ లో కీనోట్ సమర్పించారు. పారిస్‌లో జరిగిన కాప్ 21 సదస్సులో ప్రసంగించారు. మలేషియాలో జరిగిన సెకండ్ స్మార్ట్ సిటీస్ ఏషియా సదస్సుకు స్పీకర్‌గా హాజరయ్యారు. యుఎస్ ఏ అండ్ టోక్యో సంయుక్తంగా నిర్వహించిన ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ముఖ్యమైన వక్తగా హాజరయ్యారు. సింగపూర్ సర్కార్ బెర్జ్ అవార్డుకు ఎంపిక చేసింది. ఫ్రాన్స్‌లో జరిగిన బిల్డ్ అవర్ మెట్రోపోలిస్ ఇన్ యాన్ అర్బనైజ్ వరల్డ్ సదస్సులో కీలక ఉపన్యాసం చేశారు. సిడ్నీలో నిర్వహించిన సిఇఓలు ..బిజినెస్ లీడర్ల సదస్సులో కరుణ గోపాల్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ద ఇంటర్నేషనల్ ఫోరం ఆఫ్ హ్యూమన్ స్మార్ట్ సిటీస్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. యుకెలో గ్లోబల్ ఇండియా బిజినెస్ , లివర్ పూల్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ బిజినెస్ సదస్సులో కీ స్పీకర్‌గా ఉన్నారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఫెస్టివల్ సైన్స్ ఫ్రాంటియర్స్ - 24 అవర్స్ ఆన్ ఎర్త్ సమావేశంలో కీలక ఉపన్యాసం చేశారు. డల్లాస్‌లో జరిగిన మెగా ట్రెండ్స్ ఇన్ అర్బనైజేషన్ సదస్సులో, దక్షిణాఫ్రికాలోని చిలీలో జరిగిన సస్టయినబుల్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా, టెక్సాస్‌లో జరిగిన అర్బనైజేషన్ అండ్ బిజినెస్ ఆపర్చూనిటీస్ ఇన్ ఇండియా , అట్లాంటాలో జరిగిన ఆటా కన్వెన్ష్ లో జరిగిన ఆపర్చునిటీస్ ఇన్ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ సదస్సులో ఆమె ప్రసంగించారు.
యుఎస్ లో జరిగిన విమెన్ లీడర్స్ కాన్ఫరెన్స్‌లో, సింగపూర్లో జరిగిన ఆఫర్డబుల్ హౌజింగ్ కాన్ఫరెన్స్‌లో, వాషింగ్టన్ డిసిలో జరిగిన రౌండ్ టేబుల్ డిస్కషన్స్లో ఆమె పాల్గొన్నారు. పారిస్‌లో జరిగిన మెగా సిటీస్ ..కెన్ వుయ్ లివ్ ఇన్ దెమ్ పేరుతో నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. యుఎస్‌లో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ నిర్వహించిన అర్బనైజేషన్ ఇన్ ఇండియా సదస్సుకు, ఇలినాయిస్‌లో జరిగిన రిమార్కింగ్ సస్టయినబుల్ సిటీస్ ఇన్ ద వెర్టికల్ ఏజ్ వరల్డ్ కాన్ఫరెన్స్‌కు, శ్రీలంకలో జరిగిన నేషనల్ వాటర్ సప్లయి అండ్ డ్రైనేజ్ బోర్డు ..నిర్వహించిన వాటర్ సెక్టార్ రిఫార్స్ సదస్సులో కరుణ గోపాల్ కీలక ప్రసంగం చేశారు. టెక్సాస్‌లో రోటరీ క్లబ్ ఆఫ్ హోస్టన్ ఆధ్వర్యంలో జరిగిన ఇండియా యాజ్ ఏ డెమోక్రసీ అండ్ ఇండియన్ కానిస్టిట్యూషన్ ..ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ సదస్సులో ప్రసంగించారు. హైదరాబాద్‌లో జరిగిన అమెరికన్ వాటర్ వర్క్స్ అసోసయేషన్ సదస్సులో ప్రసంగించారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఇండియా యుకె టెక్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఇందులో ప్లీనరీ స్పీకర్‌గా వ్యవహరించారు. ఐబీ హబ్స్ లో ద థింగ్స్ కాన్ఫరెన్స్‌లో కీలక ఉపన్యాసం చేశారు. ముంబయిలో జరిగిన వరల్డ్ టూర్‌లో పాల్గొన్నారు.
ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీస్ అర్బనైజేషన్ రౌండ్ టేబుల్ లో పాల్గొన్నారు. వరల్డ్ సీఎస్ ఆర్ కాన్ఫరెన్స్‌లోను, ఎన్డీటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ ఇన్నోవేషన్ ఫోరం సదస్సులో స్పీకర్‌గా హాజరయ్యారు. స్మార్ట్ సిటీస్ అండ్ సస్టయినబిలిటీ విత్ మేయర్ జేమ్స్ బ్రయనార్డ్ సిటీ ఆఫ్ కార్మెయిల్ , ఇండియానా స్టేట్ తో కలిసి సదస్సులో పాల్గొన్నారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్‌తో భువనేశ్వర్ లో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ద 11 మెట్రోపాలిస్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్లీనరీ స్పీకర్‌గా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ బిగ్ ఎనర్జీ చాలెంజ్ లో స్పీకర్‌గా ఉన్నారు. గ్లోబల్ బిగ్ ఎనర్జీ చాలెంజ్, కనెక్ట్ 14 సదస్సులో కీలక ఉపన్యాసం చేశారు. యుఎస్ ఇండియా టెక్నాలజీ సమ్మిట్‌లో , అమెస్ట్రాడ్యాం మిషన్ రౌండ్ టేబుల్ లో ప్రసంగించారు. కెనడాలో జరిగిన ఇంటెలిజెంట్ కమ్యూనిటీస్ ఫోరం , ఫ్యూచర్ సిటీస్ సదస్సులో పాల్గొన్నారు. ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియాస్ సోషల్ ఫ్యాబ్రిక్ సమావేశంలో అప్పటి రాష్ట్రపతి కలాంతో కలిసి ప్రసంగించారు. బిగ్ డేటా అండ్ ఈ - ఇన్ ఫ్రా స్ట్రక్షర్ యుకె ఇండియా రౌండ్ టేబుల్, సస్టయినబుల్ సిటీస్ రౌండ్ టేబుల్ లో స్పీకర్‌గా ఉన్నారు. రెన్యూబుల్ ఎనర్జీ అండ్ సస్టయినబిలిటీ సదస్సుకు సైంటిఫిక్ అడ్వయిజరీ గా వ్యవహరించారు.
వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం, ప్రీ సమ్మిట్ ఈవెంట్ , వైజాగ్ ఇండియా కాన్ఫరెన్స్‌కు కీలక భూమిక పోషించారు. బెంగళూరులో జరిగిన టెక్ ఎక్స్ సదస్సులో, ద సీఎస్ ఆర్ జర్నల్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ ప్రకటించిన శక్తివంతమైన మహిళల్లో కరుణా గోపాల్ ఒకరిని ఎంపిక చేసింది. నామినీ ఫర్ ప్రామిసింగ్ ఇండియన్స్ అవార్డ్, ద బ్రిటిష్ హై కమిషన్ నిర్వహించిన యంగ్ థింకర్స్ సదస్సులో స్పీకర్‌గా తానేమిటో నిరూపించుకున్నారు. గుజరాత్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ స్టార్టప్ అండ్ టెక్నాలజీ సమ్మిట్‌లో , ఇండియా ఇన్ ఫ్రాస్ట్రక్షర్ స్మార్ట్ సిటీస్ 2.0 కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. బిహెచ్ ఇఎల్ నిర్వహించిన మేనేజ్‌మెంట్ కమిటీ సదస్సులో చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఎంసీఆర్ హెచ్ ఆర్ డీలో ఐఏఎస్‌ల సదస్సులో కీలక ఉపన్యాసం చేశారు. ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన స్మార్ట్ మొబిలిటీ సమ్మిట్‌లో, టైమ్స్ ప్రో సదస్సుకు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నల్సార్ యూనివర్శిటీ నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఐఐటీ హైద్రాబాద్ నిర్వహించిన ఆర్ అండ్ డి షో కేస్ లో ఉన్నారు. నేషనల్ సమ్మిట్ ఫర్ విమెన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విమెన్ లెడ్ డెవలప్‌మెంట్ లో కీనోట్ ఇచ్చారు. ఎన్ ఐటీ తిరుచ్చీ నిర్వహించిన ప్రగ్యాన్ యూత్ సమ్మిట్‌లో కీలక ఉపన్యాసం చేశారు.
హైదరాబాద్ సిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. బెంగలూరులో జరిగిన క్లౌడ్ కాన్ సదస్సుకు సెషన్ చైర్ పర్సన్‌గా ఉన్నారు. చెన్నైలో బిఐఎస్ నిర్వహించిన స్టాండర్డ్స్ మేక్ సిటీస్ స్మార్టర్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముంబైలో జరిగిన స్మార్ట్ సిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ సమావేశంలో పాల్గొన్నారు. ద ఎయిర్ సమ్మిట్ - ఏ వరల్డ్ ఆఫ్ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ , ఐఓటి అండ్ రోబోటిక్స్ సదస్సులో, సి11 స్మార్ట్ అర్బన్ మొబిలిటీ రౌండ్ టేబుల్, ఇండియో మొబైల్ కాంగ్రెస్ , ద బిగ్ ఫైవ్ కన్‌స్ట్రక్ట్ ఇండియా కాన్ఫరెన్స్, ఐఓటీ కాన్ఫరెన్స్ ఎక్స్‌పో, యుఇఎం సదస్సులో కీలక ప్రసంగం చేశారు. ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా రౌండ్ టేబుల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ముంబయిలో జరిగిన ఎమర్జింగ్ వరల్డ్స్ కాన్ఫరెన్స్ లో స్పీకర్‌గా , మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిబిలిటీ ఆధ్వర్యంలో జరిగిన విమన్ అండ్ ఎంప్లాయిబిలిటీ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో ప్రసంగించారు. ఇండియా స్మార్ట్ గ్రిడ్ ఫోరం ఇన్నోవేషన్ అవార్డ్స్ కీ నోట్ స్పీకర్‌గా ఉన్నారు. శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ , బిజినెస్ కాన్ క్లేవ్ 2017 లో స్పీకర్‌గా ఉన్నారు. జియోస్ పాటియాల్ వరల్డ్ ఫోరం , ఐబీఎం ఇండియా ఆన్ వార్డ్ స్కాలింగ్ డిజిటల్ ఇండియా, పీఎం ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ , పీఎంఐ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ , బి డబ్ల్యు స్మార్ట్ సిటీస్ కాన్ క్లేవ్ అండ్ అవార్డ్స్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ మేనేజ్‌మెంట్ నేషనల్ కాన్ఫరెన్స్‌లో కీలక స్పీకర్‌గా ఉన్నారు. వందలాది సదస్సుల్లో కీలక ఉపన్యాసం చేశారు. 100 స్మార్ట్ సిటీస్ మిషన్ ఇండియా మేగజైన్ కు ఆమె కంట్రిబ్యూట్ చేశారు. స్వరాజ్య మేగజైన్ లో ఏ విజన్ ఆఫ్ తెలంగాణ పేరుతో డాక్యుమెంట్ రూపొందించారు.
హౌ టు బికం ఏ వరల్డ్ క్లాస్ సిటీ పేరుతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ పేరుతో హాన్స్ ఇండియా లో ఆర్టికల్ రాశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ బాటిల్ నెక్ ఈజ్ ఇట్స్ బ్యూరోక్రసీ పేరుతో హిందూలో వ్యాసం రాశారు. ఏ గ్లోబల్ విమెన్ పేరుతో బార్సిలోనా పత్రికలో ఇంటర్వ్యూ అచ్చయింది. కరుణా గోపాల్ - యాన్ ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ థాట్ లీడర్ అండ్ ఫిలాంథ్రపిస్ట్, క్లీన్ సిటీ ఈజ్ ద టాప్ ప్రయారిటీ, టెక్నాలజీ షుడ్ రెజోనేట్ టు ద లోకల్ నీడ్స్, హి ఈజ్ మై మదర్, డెవలపింగ్ స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ఇండియా విల్ బి యుషెర్డ్ ఇన్ సూనర్ దెన్ వుయ్ బిలీవ్ ఈజ్ పాసిబుల్, కన్‌స్ట్రక్షన్ ఆపర్జునిటీస్, ఏ మైటీ హర్ట్, చానల్ సిక్స్‌లో ప్రసారమైంది. దివాస్ ఆఫ్ దక్కన్, ఐ లవ్ టు ఇన్ ఫ్యూజ్ న్యూ ఏజ్ థింకింగ్ ఇన్ టు పాలసీ, ఇఫ్ హైదరాబాద్ కుడ్ కమ్ అప్ ట్రంప్స్..వై నాట్ గూర్గాన్, పవర్ అండ్ పర్పస్, ప్లానింగ్ ఫర్ ఏ సిటీస్ గ్రోత్, నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ పేరుతో పలు జాతీయ పత్రికల్లో ఆర్టికల్స్ రాశారు కరుణా గోపాల్. సౌత్ వెస్ట్ డెయిలీ టైమ్స్, ద టెలిగ్రాం, గుయ్మాన్ డెయిలీ హెరాల్డ్ ఇంటర్నేషనల్ పేపర్స్‌లో ఇంటర్యూ ప్రచురితమయ్యాయి.
కెన్ సిటీస్ బికమ్ ఫ్రీ, బూట్ స్ట్రాపింగ్ ఇండియాస్ స్మార్ట్ గ్రోత్, స్మార్ట్ గ్రోత్ - యాన్ ఎకనమిక్ ఇంపారిటివ్ ఫర్ ఇండియా, హాక్ ద ప్లాన్ నాట్ ద ట్రీస్, ఇన్నోవేటింగ్ టు ప్రొడ్యూస్ ఫర్ స్మార్ట్ సిటీస్, బిల్డింగ్ ఏ స్మార్ట్ కేపిటల్, లైఫ్ టు గెట్ స్మార్టర్, స్మార్ట్ వైజాగ్ ఇన్ ద మేకింగ్, బిల్డింగ్ ఏ స్మార్ట్ కేపిటల్, హైవ్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ హై గెయిన్స్, ఈజ్ ఫ్లయింగ్ బ్లైండ్ యాన్ ఆప్షన్, ఎకో టూరిజం ఇన్ ఇండియా, సస్టెయినబుల్ సిటీస్ ఫర్ ఇండియా, బిల్డింగ్ వరల్డ్ క్లాస్ సిటీస్, కెన్ హైదరాబాద్ బి మేడ్ లివబుల్, ఇన్ క్లూసివ్ సిటీస్ అండ్ స్పెషల్ చిల్డ్రన్ , పార్ట్‌నర్ షిప్స్ ఫర్ స్కూల్ ట్రాన్స్‌ఫార్మేషన్, మేకింగ్ ఏ పిచ్ ఫర్ బ్రాండ్ హైదరాబాద్, గ్లోబల్ సిటీ - టువర్డ్స్ ఏ వరల్డ్ క్లాస్ సిటీ పేరుతో కథనాలు రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది స్టోరీస్ వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వందలాది పుస్తకాలలో ఆమె గురించిన కథనాలు ఉన్నాయి. ప్రింట్ అండ్ మీడియాలో ఆమె ఇండియన్ ఐకాన్‌గా ఉన్నారు. గ్లోబల్ పరంగా చూస్తే మోస్ట్ ఫేవరబుల్ విమెన్ థింకర్‌గా వినుతికెక్కారు. ప్రపంచం మెచ్చిన మేధావిగా..ఫ్రీ థింకర్‌గా..ఇన్నోవేటివ్ ఫిలాసఫర్‌గా ..మెంటార్‌గా..అనలిస్ట్‌గా..కీ నోట్ స్పీకర్‌గా..రైటర్‌గా..ఎదిగిన కరుణా గోపాల్ మన తెలుగు వారు కావడం మనకు గర్వకారణం కాదంటారా..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి