ప్రపంచకప్ టోర్నీకి టీం ఇండియా డిక్లేర్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రాబోయే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఇండియన్ క్రికెట్ జట్టును ఎట్టకేలకు ఉత్కంఠ కు తెర తీస్తూ ప్రకటించింది. ముంబైలోని బీసీసీఐ క్రికెట్ సెంటర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ , టీం జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు కోచ్ రవిశాస్త్రి , పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం సమావేశం వాడి వేడిగా కొనసాగింది. ఎవరిని ఉంచాలి..ఎవరిని తీసి వేయాలి..ఎవరికి అవకాశం ఇవ్వాలి..ఏ ఫార్మాట్‌లో ఎవరెవరు పనికి వస్తారు అనే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఇండియన్ సీనియర్ క్రికెటర్స్ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వచ్చారు. ఈసారి ఎలాగైనా ఇండియా వరల్డ్ క్రికెట్ కప్ ను ఎగరేసుకు రావాలని..భారతీయ జెండాను ప్రపంచంలో ఎగుర వేసేలా చేయాలన్నదే బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
జట్టును ఎంపిక చేసేందుకు తీవ్ర వత్తిళ్లను ఎదుర్కొన్నారు. మరో వైపు కోహ్లి ..రవిశాస్త్రి ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. కోట్లాది క్రికెట్ అభిమానులు తమ కలల జట్టును ఎప్పుడు ప్రకటిస్తారోనని ఆందోళనకు లోనయ్యారు. చాలా మంది ఫ్యాన్స్ త్వరగా ప్రకటించి తమను టెన్షన్ నుండి దూరం చేయాలని ఆయా సామాజిక మాధ్యమాలలో కోరారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ కు ఊహించని రీతిలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ జాబితాను ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో ఇంగ్లండ్, వేల్స్ నగరాల వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే ప్రపంచ కప్ అంగరంగ వైభవంగా జరగనుంది.
ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ దిగ్గజాలు, సీనియర్లు తమ ప్రతిభా పాటవాలకు పదును పెట్టనున్నారు. ఈ టోర్నీలో ఇండియన్ క్రికెట్ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ తీవ్రంగానే కసరత్తు చేసింది. ప్రపంచకప్ బరిలోకి దిగే టీమిండియా ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది. భారతీయ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ ప్రత్యేకంగా సమావేశమైంది.
ఇండియన్ క్రికెట్ జట్టుకు నాయకుడిగా విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మను ప్రకటించారు. వీరితో పాటు మహేంద్ర సింగ్ ధోనిని ప్రధాన వికెట్ కీపర్‌గా , రెండో వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్ పనికి వస్తాడని ఎంపిక చేశారు.
ఇక రిజర్వ్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కు జట్టులో చోటు కల్పించారు. ప్రధాన పేస్ బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను ఎంపిక చేయగా..స్పిన్నర్లుగా కులదీప్ యాదవ్, యజువేంద్ర చాపెల్‌లను తీసుకున్నారు. విజయ్ శంకర్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను ఆల్ రౌండర్లుగా పనికి వస్తారని జట్టులోకి చేర్చుకున్నారు. ఈ వరల్డ్ కప్ క్రికెట్ జట్టుకు రవిశాస్త్రి కోచ్‌గా ఉండనున్నారు. వికెట్ కీపర్లు, బౌలర్లు, స్పిన్నర్లు అవసరమైన సమయంలో పరుగులు తీసే ఆటగాళ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. క్రికెట్ అభిమానులు జట్టు కూర్పుపై కొంచెం అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి