విమానాలు ఎగిరేనా..జెట్ కుదురుకునేనా..!
భారతీయ విమానయాన రంగంలో రెండో అతిపెద్ద ఎయిర్‌వేస్ సంస్థగా పేరున్న జెట్ ఎయిర్‌వేస్ ఇపుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముంబయి కేంద్రంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దాదాపు 20 వేల మందికి పైగా ఈ సంస్థనే నమ్ముకుని ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి విమాన సర్వీసులను నిలిపి వేయడంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అసలు సంస్థను గట్టెక్కించేందుకు యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. జెట్ స్పీడ్‌తో స్టార్టింగ్‌లో ప్రారంభమైన జెట్ ఎయిర్ వేస్ ఇపుడు ఎగరలేక చతికిలపడింది. అత్యవసరంగా నిధులు ఇవ్వగలిగితే కొంతలో కొంతైనా సంస్థ గట్టెక్కగలదంటూ విమానయాన రంగానికి చెందిన వారు భావించారు. కానీ సంస్థ కథ మళ్లీ మొదటికొచ్చింది.
ప్రస్తుతం జీతాలు ఇచ్చుకోలేని స్థితికి దిగజారిన జెట్ ఎయిర్ వేస్ అంతర్జాతీయ సర్వీసులను నిలిపి వేసింది. కంపెనీ బోర్డు రుణదాతల నుండి సానుకూల స్పందన లభిస్తుందని ఆశించిన వారికి పాజిటివ్ సిగ్నల్ రాలేదు. దీంతో సంస్థ మనుగడపై నీలి నీడలు నమ్ముకున్నాయి. కంపెనీకి చెందిన ముఖ్య కార్యనిర్వహణాధికారి వినయ్ దూబే అంతర్గత మెయిల్ ద్వారా సంస్థలో జరుగుతున్న పరిణామాల గురించి ఉద్యోగులకు వివరాలు తెలియ చేశారు. రుణ దాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, తిరిగి సంస్థతో సమావేశం కానున్నారని..గట్టెక్కే అవకాశం ఉందని భరోసా నింపే ప్రయత్నం చేశారు దూబే. 1992 ఏప్రిల్ ఒకటిన జెట్ ఎయిర్ వేస్ ప్రారంభమైంది. 1993 మే 5న విమానయాన సర్వీసులు మొదలయ్యాయి. నేషనల్ , ఇంటర్నేషనల్ సర్వీస్‌లు ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది సంస్థ. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా ..ఢిల్లీ, బెంగళూరు కేంద్రంగా విమాన సర్వీస్‌లు స్టార్ట్ అయ్యాయి.
7 ఆపరేషన్స్..52 డెస్టినేషన్స్ ద్వారా ఇవి ప్రయాణికులను చేరవేస్తున్నాయి. జాయ్ ఆఫ్ ఫ్లయింగ్ స్లోగన్ తో సర్వీసులు నడుస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 51 కన్సార్టియం ఉండగా..నరేష్ గోయల్ 24 శాతం, ఎథిహాడ్ ఎయిర్ వేస్ 12 శాతం , పబ్లిక్ షేర్స్ 13 శాతంగా వాటాలు కలిగి ఉన్నాయి. నరేష్ గోయల్ దీనిని స్థాపించగా ..వినయ్ దూబే సీఇఓగా ఉన్నారు. 2017 -2018లో 3.5 బిలియన్ల ఆదాయం రాగా..ఆ తర్వాత ఆదాయం గణనీయంగా తగ్గి పోయింది. భారతీయ విమానయాన రంగంలో జెట్ ఎయిర్ వేస్ రెండో అతి పెద్ద వాటా కలిగిన సంస్థగా ఎదిగింది. 2004 నుండి ఇంటర్నేషనల్ సర్వీసులు ప్రారంభించింది. 2005 నుండి 2007లో పబ్లిక్ షేర్స్ కోసం వెళ్లింది. ఎయిర్ సహారాను కొనుగోలు చేసింది.
2010లో ప్రయాణికులను చేరవేయడంలో జెట్ ఎయిర్ వేస్ భారీ సంస్థగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఊహించని రీతిలో ఆర్థిక సంక్షోభంలోకి కూరుకు పోయింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకు పోయిన జెట్ ఎయిర్ వేస్‌ను భారత ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని విమానయాన రంగ నిపుణులు కోరుతున్నారు. విశిష్ట సేవలందిస్తూ త్వరిత కాలంలోనే టాప్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఫ్లయిట్స్ ఆకాశంలో ఎగరాలని..సంస్థనే నమ్ముకున్న ఉద్యోగులను ఆదుకోవాలని కోరుకుందాం. ఆ దిశగా సంస్థ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి