ఆన్‌లైన్‌లో శిక్షణ..ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్
ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇండియాలో. చదువు కోవడం అంటే ఇప్పుడు మనల్ని మనం అమ్ముకోవడం అన్న స్థాయికి చేరుకుంది. కేజీ నుండి పీజీ చదవాలంటే లెక్కలేనంత ఖర్చు. గవర్నమెంట్ ఫీజులు మోయలేని భారంగా తయారైతే..ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐటీ సెక్టార్ పుణ్యమా అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉండడంతో ..ఆ రంగానికి సంబంధించిన కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కనీసం ఏడాదికి మినిమం 10 లక్షల నుండి 20 లక్షల దాకా ఖర్చవుతోంది.
వీరి ఇబ్బందులను గమనించారు ముగ్గురు ఐఐటియన్స్ పులికిత్ జైన్, వంశీ క్రిష్ణ, ఆనంద్ ప్రకాశ్. లైవ్ ట్యూటర్ పేరుతో వేదాంతు అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. అంతా ఆన్‌లైన్‌లోనే ఉచితంగా బోధన వుంటుంది. అక్కడికక్కడే ఎక్స్‌పర్ట్స్‌తో మీ సందేహాలకు సమాధానం దొరుకుతుంది. దీంతో టైం సేవ్ అవుతుంది. ఖర్చు బెడద తప్పుతుంది. వేదాంత ప్రత్యక్ష శిక్షణ ద్వారా మొదటగా 30 మంది స్టూడెంట్స్‌తో ప్రారంభమైన ఈ సంస్థ ఇపుడు 15 వేల మందికి చేరుకుంది. రాను రాను ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. విజ్ఞానం వేరు జ్ఞానం వేరు. సబ్జెక్టుల వారీగా అనుభవం కలిగిన అధ్యాపకులతో శిక్షణతో పాటు మెటీరియల్ కూడా అందజేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే ఈ సంస్థ ప్రారంభానికి నాంది పలికింది.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వేదాంతుతో అనుసంధానం అవుతున్నారు. తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన శాంతా అనే 17 ఏళ్ల విద్యార్థిలో వేదాంత ద్వారా తీసుకున్న శిక్షణ ద్వారా జేఇఇ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలో ర్యాంకు సాధించారు. పిడబ్ల్యుడి కోటా కింద సీటు సాధించారు. మొదట సీటు వస్తుందో లేదోనన్న అనుమానం వుండేది..ఎప్పుడైతే వేదాంతు ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు, పరీక్షలు, శిక్షణ తీసుకున్నానో అప్పటి నుంచి నాలో భయం అన్నది లేకుండా పోయింది.
కావాల్సిందల్లా పట్టుదల. ముఖ్యంగా ఆయా సబ్జెక్టులను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే చాలు ర్యాంకు అదంతకు అదే వస్తుందంటున్నారు మరికొందరు విద్యార్థులు. ఈ మొత్తం ట్రైనింగ్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. 500 నగరాలు 15 వేల మంది స్టూడెంట్స్ ఇందులో సభ్యులై శిక్షణ పొందారు. 40 మంది విద్యార్థులతో ఈ సంస్థ స్టార్ట్ అయింది. బిగ్ ఆన్‌లైన్ ఇనిస్టిట్యూట్‌గా పాపులర్ అయింది. టాప్ వన్‌లో నిలిచింది. విద్యార్థులకు వేదాంతు స్ఫూర్తిగా నిలుస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి