వాల్‌మార్ట్ సిటిఓగా ఇండియన్
అమెరికా ఈకామర్స్ దిగ్గజ కంపెనీగా పేరొందిన వాల్ మార్ట్ కంపెనీకి ఇండియాలోని చెన్నైకి చెందిన ఐఐటియన్ సురేష్ కుమార్ సిటిఓగా ఎంపికయ్యారు. ఐఐటి మద్రాస్‌లో చదివారు. గతంలో గూగుల్ లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం అమెజాన్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారు. ఈ కామర్స్ బిజినెస్‌లో టాప్ వన్ కంపెనీగా వాల్ మార్ట్ కొనసాగుతోంది. గూగుల్‌లో పనిచేస్తున్న సమయంలో సురేష్ కుమార్ ..జనరల్ మేనేజర్‌గా సేవలందించారు. డిస్ ప్లే, వీడియా, యాప్ అండ్ అనలిటిక్స్ ను డెవలప్ చేశారు. ఐఐటి-మద్రాస్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు.
గూగుల్ లో చేరాక..ఎగ్జిక్యూటివ్‌గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా , చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాక, ప్రిన్‌సెంటన్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పొందారు. వాల్‌మార్ట్‌లో సిటిఓగా సురేష్ కుమార్ చేరడం వల్ల తమ కంపెనీకి అదనపు బలం చేకూరినట్లయిందని నిర్వాహకులు వెల్లడించారు. ఆయన నేరుగా సిఇఓ డౌగ్ మాక్ మిల్లన్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల జూలైలో కాలిఫోర్నియాలోని తమ కంపెనీలో చేరుతారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇక వాల్‌మార్ట్ కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కొన్నేళ్ల పాటు జెరెమీ కింగ్ పనిచేశారు.
ఆయనకు ఇపుడు 54 ఏళ్ల వయసు. వయోభారం ఎక్కువ కావడంతో తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో వాల్ మార్ట్‌కు ప్రధాన ప్రత్యర్థి కంపెనీగా అమెజాన్ వుంది. ఇందులో పనిచేస్తున్న సురేష్ కుమార్ ఇక్కడికి వస్తే ..మరింత బలం వస్తుందని యాజమాన్యం నమ్మింది. ఆయనకు ప్రధాన పదవిని కట్టబెట్టింది. ఇక వాల్ మార్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ క్లే జాన్సన్ సురేష్ కుమార్ కు రిపోర్ట్ ఇవ్వాల్సి వుంటుంది. మెయిన్ ఆపరేటింగ్ యూనిట్స్ ..యుఎస్, ఇంటర్నేషనల్, శామ్స్ క్లబ్‌లలో కొలువు తీరి ఉన్నాయి. గూగుల్‌లో , అమెజాన్‌లలో పనిచేసిన అనుభవం కొంత మేరకు వాల్ మార్ట్‌కు పనికి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సురేష్ కుమార్.
అమెరికా దిగ్గజ కంపెనీలకు ఇండియన్స్ ఎంపిక కావడం ఓ రకంగా భారత్ మేధోసంపత్తికి దక్కిన గౌరవంగా భావించాలి. ఓ వైపు గూగుల్ సిఇఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కు సత్య నాదెళ్ల ఉండగా ఇపుడు వాల్ మార్ట్‌కు సిటిఓగా సురేష్ కుమార్ ఎంపిక కావడం ఆనందించాల్సిన విషయం. కుమార్ ఈ కంపెనీలతో పాటు ఐబీఎం థామస్ జె.వాట్సన్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేశారు. టెక్నాలజీ లీడీర్ షిప్ విభాగంలో సురేష్ కు 25 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. అందుకే కుమార్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది వాల్ మార్ట్. ప్రపంచ వ్యాప్తంగా వాల్ మార్ట్‌కు 11,000 దుకాణాలు ఉన్నాయి. కోట్లాది రూపాయల టర్నోవర్ కలిగి ఉంది. భారీ ఆఫర్ తో పాటు భారీ వేతనం కూడా అందుకుంటున్నారు మనోడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి