ఎస్.బి.ఐ నిర్వాకం ఖాతాదారుల ఆగ్రహం..!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజి దెబ్బకు భారతీయ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ప్రాధాన్యతా రంగాలు ఎప్పుడూ లేనంతగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. నోట్ల రద్దు తో దేశంలో సేవలు అందిస్తూ వస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ దివాళా తీసేందుకు రెడీగా ఉన్నాయి. దీనికి తోడు జీఎస్టీ ఏర్పాటు చేయడంతో కోట్లాది మంది వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా పడి పోయింది. ఒకే ఒక్క నిర్ణయం కారణంగా మొత్తం ఆర్ధిక రంగమంతా ఇప్పుడు బేల చూపులు చూస్తోంది. మోదీ డెషిషన్ తో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో భద్రంగా దాచుకున్న కోట్లాది రూపాయలను ఖాతాదారులు తీసేసుకున్నారు. డిజిటలైజేషన్ అంటూ గొప్పలు పోయిన కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు జనం.

అన్ని వ్యాపార సంస్థలు ఇప్పుడు ఆర్ధిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందోనని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన మరింత నిరాశను కలుగ జేసింది. ఎన్నడూ లేనంతగా దేశ ఆర్ధిక వృద్ధి రేటు పడి పోయిందని, అందుకే ఉద్దీపన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆ ఒక్క ప్రకటనతో భారత షేర్ మార్కెట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. బడా కంపెనీల షేర్స్ అన్నీ పడి పోయాయి. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు వచ్చినా అవి దేశాన్ని నడిపించేందుకు సరిపోతోంది. ఇదే సమయంలో ఆర్బీఐ ఇటీవల కోట్లాది రూపాయలు కేంద్ర సర్కార్ కు ఇచ్చింది. ప్రతినెలా జీతాలు ఇవ్వలేని స్థితిలోకి చేరుకుంది. ఇదే సమయం లో ఇండియాలో అతి పెద్ద బ్యాంకింగ్ గా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల నెత్తి మీద శఠగోపం పెడుతోంది. రోజు రోజుకు మరింత ఇబ్బందులకు లోనే చేసేలా నిర్ణయాలు తీసుకుంటోంది.

దొంగలకు, ఆర్ధిక నేరగాళ్లకు వత్తాసు పలుకుతూ లెక్కకు మించి రుణాలు ఇస్తూ పోతున్న సదరు బ్యాంక్ కస్టమర్స్ వరకు వచ్చే సరికల్లా కఠినంగా వ్యవహరిస్తోంది. తమ డబ్బులను డ్రా చేసుకునే వెసలుబాటు ఎక్కువగా ఉండేది. దానిని ఇప్పుడు పూర్తిగా మార్చేసింది. మూడు సార్లకంటే ఎక్కువగా డబ్బులు డ్రా చేసుకుంటే అదనంగా రుసుము వసూలు చేస్తోంది. ఇక డిపాజిట్ వడ్డీ రేట్లను పూర్తిగా తగ్గించి వేసింది. దీంతో దాచుకున్న వారంతా తిరిగి డబ్బులను తీసేసుకుంటున్నారు. మరో వైపు గోల్డ్, ప్లాట్స్, ఫ్లాట్స్ కొంటున్నారు. ఎస్బీఐ అనుసరిస్తున్న తీరుపై ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడా బాబులకు వత్తాసు పలుకుతూ సామాన్యులపై నెత్తిన శఠగోపం పెడుతోందంటూ మండి పడుతున్నారు. ఇప్పటికైనా భారత విత్త మంత్రి సీతారామన్ బ్యాంకులను కలపడం కాదు చేయాల్సింది వీటిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు పోస్టల్ శాఖకు ఖాతాదారులు మారి పోతున్నారు. ఏది ఏమైనా మోదీ దెబ్బకు ఖాతాదారులు అబ్బా అంటున్నారు. 

కామెంట్‌లు