వీడియో స్ట్రీమింగ్ సెక్టార్లో నువ్వా నేనా..!

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతూ రోజు రోజుకు ట్రెండ్స్ సృష్టిస్తూ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేస్తోంది. డిజిటల్ రంగం కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. దీంతో వ్యాపార రంగాలలో ఉన్న ఐటి సెక్టార్ తో ఎలాంటి సంబంధం లేని కంపెనీలు సైతం డిజిటల్ సెక్టార్ వైపు చూస్తున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అంటున్నాయి. ఇదే రంగంలో స్టార్ట్ అప్ లకు, ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న వాటిని చేజిక్కించుకునేందుకు కంపెనీలు తహతహ లాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి వచ్చాక గూగుల్ దిగ్గజ కంపెనీ తన హవాను కొనసాగిస్తున్నది. ఎప్పుడైతే ఈ దిగ్గజ కంపెనీ యూట్యూబ్ ను దక్కించుకుందో ఇక అప్పటి నుంచి ప్రపంచం చిన్న బోయేలా చేసింది. ప్రతి రోజుకు కోట్లాది వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి.

ఏది కావాలనుకున్నా క్షణాల్లో చూసే వెసులుబాటును గూగుల్ తీర్చి దిద్దింది. ఇందు కోసం మరిన్ని సేవలు అందించేలా ఎప్పటికప్పుడు సాంకేతికతను జోడిస్తోంది. ఈ ఒక్క యూట్యూబ్ ద్వారా ప్రతి రోజు ట్రిలియన్ డాలర్లను కొల్లగొడుతోంది గూగుల్ . దీనికి పోటీగా నెట్ ఫ్లిక్స్  , అమెజాన్, వ్యూ , అమెజాన్ ప్రైమ్ వీడియో , లాంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కావలసినప్పుడు లైవ్ గా చూసుకునే వెసలుబాటు కల్పించాయి కంపెనీలు. తాజాగా వీడియో స్ట్రీమింగ్ సెక్టార్ లోకి టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ ఎంటర్ కావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పోటీ రసవత్తరం కానుంది. కేవలం 99 రూపాయలకే అన్ని సౌకర్యాలను కల్పించ బోతోంది. ఇండియాలో ఇప్పటికే రిలయన్స్ కంపెనీ సైతం తాను కూడా రెడీ అంటోంది. దీంతో ఏది ఎంచు కోవాలో తెలియక వినియోగదారులు తేల్చుకోలేక పోతున్నారు.

ఒకవేళ యాపిల్ స్టార్ట్ చేస్తే ఇప్పటికే హవా కొనసాగిస్తున్న అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ కంపెనీలకు ఇబ్బందే. ఆపిల్ కంపెనీకి చెందిన 140 కోట్ల పరికరాలు వినియోగంలో ఉన్నాయి. ఈ కంపెనీ ఓవర్ ది టాప్ అంటే ఓటిటీ లోకి ప్రవేశం చేస్తోంది. దీని వల్ల మిగతా కంపెనీలకు పెద్ద దెబ్బ పడనుంది అన్నమాట. యాపిల్ టీవీ ప్లస్ ను ప్రకటించగానే మిగతా కంపెనీల షేర్స్ డీలా పడ్డాయి. ఇక రంగంలోకి దిగితే ఇంకెంత సంచలం రేపుతుందో వేచి చూడాలి. కేవలం 700 చెల్లిస్తే చాలు లైవ్ వీడియో , నెట్ కనెక్టివిటీ , వీడియో కాలింగ్, ఉచితంగా ఛానల్స్ తో పాటు కొంత మొత్తం చెల్లిస్తే కొత్త సినిమాలు విడుదల రోజే చూసుకునే వీలు కల్పించ నున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ప్రస్తుతానికి కొన్ని నగరాలకే పరిమితం చేయగా త్వరలో దేశమంతటా ఈ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించింది. దీని దెబ్బకుక్ ఎయిర్ టెల్ లాంటి కంపెనీలు డీలా పడ్డాయి. ఇది కూడా వీడియో స్ట్రీమింగ్ లోకి వస్తే కంపెనీల మధ్యన నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉండబోతుందన్నమాట.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!