ఆధిపత్యం కోసం ఆరాటం - ఎందుకీ రాద్ధాంతం
ప్రపంచంలోనే ఎనలేని ఇమేజ్ స్వంతం చేసుకున్న ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కు ఇప్పుడు కొత్త తలనొప్పులు చోటు చేసుకున్నాయి. సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ తీసుకున్న నిర్ణయాలపై మాజీ సారధి సునీల్ గవాస్కర్ తప్పు పట్టారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. గవాస్కర్ చేసిన విమర్శలపై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ సందర్బంగా ఎంపిక చేసిన టీమిండియా జట్టుపై వ్యతిరేకత రాలేదు. అయితే టోర్నీలో ఇండియా జట్టు టైటిల్ ఫెవరెట్ గా ఉన్నది. మన ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయక పోవడంతో సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ప్రసాద్ తో పాటు ఎంపిక చేసిన వారిపై దేశమంతటా నిరసనలు మిన్నంటాయి. జట్టు కెప్టెన్ కోహ్లీ తో పాటు జట్టు కోచ్ గా ఉన్న రవిశాస్త్రి ని తప్పించాలని డిమాండ్ చేశారు.
జట్టులో ఎంపిక చేసిన ఆటగాళ్లు సరైన వారు కాదని, పేలవమైన ప్రదర్శన చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు టోర్నమెంట్ సమయం లోనే సారధి కోహ్లీ , వైస్ కెప్టేన్ రోహిత్ శర్మ ల మధ్య ఆధిపత్య పోరు నడిచిందని అందుకే టీమిండియా లో ఇరువురి మధ్యన జట్టు సభ్యులు చీలి పోయారని విమర్శలు వచ్చాయి. అందుకే సరైన ప్రదర్శన చేయలేదని ఇండియా కప్పు తీసుకు రాకుండానే ఇంటికి వచ్చింది. మరో వైపు దేశమంతటా ఇండియా ఆట తీరుపై ఆరోపణలు తలెత్తడంతో ఎమ్మెస్కె ప్రసాద్ సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ మేరకు ఆయన అలాంటిది ఏమీ లేదంటూ స్పష్టం చేశారు. ఇదే సమయంలో నలువైపులా నుంచి సీనియర్ ఆటగాళ్లు దండెత్తినంత పని చేశారు. జట్టు ఎంపికలోనే లోపం ఉందని, అసలు నాలుగో స్థానంలో ఎందుకు సరైన ఆటగాడిని ఎంపిక చేయలేక పోయారంటూ నిలదీశారు.
దీనికి కూడా జట్టు ఎంపిక కమిటీ మౌనం వహించింది. మరో వైపు వెస్ట్ ఇండీస్ టూర్ కోసం జట్టులో పెను మార్పులు చేసింది. అంతకు ముందు టీమిండియా కెప్టేన్ తో పాటు కోచ్ ను మారుస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీనిని పటాపంచలు చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ప్రసాద్ కోహ్లీ, రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేస్తూ నిర్ణయం ప్రకటించారు. జట్టులో కొన్ని మార్పులు చేశారు. విండీస్ టూర్ లో ఇండియా టీ- 20 తో పాటు వన్డే, టెస్ట్ సిరీస్ లను టీమిండియా గెలుపొందింది. కోచ్ ఎంపిక విషయంలో కూడా కొంత సందిగ్ధత నెలకొన్నది. కోచ్ ను మారిస్తేనే బావుంటుందని మాజీ ఆటగాళ్లు, ఇండియన్ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయినా ఎమ్మెస్కె పట్టించు కోలేదు ..పరిగణలోకి తీసుకోలేదు. ఇదే విషయంపై పెద్ద రాధంతమే జరిగింది. కోచ్ ఎంపిక కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో నోటిఫికేషన్ విడుదల చేసింది బీసీసీఐ .
ఎందరో పేరున్న ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. కోచ్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఎంపిక చేసింది. కపిల్ దేవ్ చైర్మన్ గా గైక్వాడ్ , డయానా సభ్యులుగా ఉన్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కపిల్ దేవ్ ముంబయికి చెందిన రవి శాస్త్రికి పట్టం కట్టారు. అంతకు ముందు వద్దనుకున్నా, జట్టు సారధి కోహ్లీ రవి కావాలని పట్టు పట్టటడంతో తప్పని పరిస్థితుల్లో రవి ని ఎంపిక చేయాల్సి వచ్చింది. అయితే డ్రెస్సింగ్ రూమ్ లో జట్టు ఆటగాళ్ల మధ్యన ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా చూడాల్సిన బాధ్యత కోచ్ పై ఉంటుంది. మొదటి నుంచి ఈ ముంబయి పరివారమే డామినేట్ చేస్తూ వస్తోంది. కోహ్లీ, రోహిత్ ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. వీటిని కోచ్ రవి శాస్త్రి కొట్టి పారేశారు. అదంతా మీడియా సృష్టించిందని, అలాంటివి ఏమీ లేవంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉన్నా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి