జార్జ్ రెడ్డి ఎందరికో స్ఫూర్తి
జార్జ్ రెడ్డి లాంటి వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి నేను ఒంగోలులో ఇంటర్ మీడియట్ చదువుకుంటున్నప్పుడు తెలిసింది. మళ్ళీ ఇప్పుడు జార్జ్ రెడ్డి సినిమా ద్వారా అతడి గొప్పదనం, చేసిన త్యాగం, అతడు అందించిన స్ఫూర్తి గురించి వింటున్నాను అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ కాలంలో ఎందరో జార్జ్ రెడ్డి గురించి చెబుతూ ఉండే వారు అని చెప్పారు. సందీప్ మాధవ్ లీడ్ రోల్‌లో ‘దళం’ సినిమా ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలకంగా వచ్చే అడుగడుగు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు అనే పాటను చిరంజీవి విడుదల చేశారు.
జార్జ్ రెడ్డి గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. మార్పు కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు మెగాస్టార్. తప్పును ప్రశ్నించే ఇలాంటి వాళ్లు ఎందరో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. వస్తూనే ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకున్నాను. అడుగడుగు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు పాట చూసిన తర్వాత నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. జార్జ్ రెడ్డి ఎలాంటి ఆశయాలతో ఉండేవారు. ఆయన రివల్యూషనరీ థాట్స్ ఎలా ఉండేవి, విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేసి, అన్యాయాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ పాటలో తెలుస్తోంది.
జార్జ్ రెడ్డి లాంటి సినిమాలు ఇంకా, ఇంకా రావాలి. ఎందరికో స్ఫూర్తి కలిగించే ఇలాంటి సినిమాలను ప్రతి ఒక్కరు చూడాలని చిరంజీవి పిలుపునిచ్చారు. జార్జ్ రెడ్డి సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహిస్తే, నేపథ్య సంగీతం హర్షవర్థన్ రామేశ్వర్ అందించారు. దాము రెడ్డి, సుధాకర్ యొక్కంటి, సంజయ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా మలక్ పేట ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ సినిమా తమ సంఘాలను కించ పరిచేలా మాటాలు ఉన్నాయంటూ ఆరోపించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి