జనం కోసం కలిసేందుకు సిద్ధం
తమిళనాడులో సూపర్ స్టార్ గా, కోట్లాది మంది అభిమానులు ప్రేమగా పిలుచుకునే తమిళ తలైవా రజనీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు. నిన్నటి దాకా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. దీనిని రజనీకాంత్ నిర్ద్వందంగా ఖండించారు. తమిళ ప్రజల హక్కులకు భంగం కలిగించే ఎవ్వరైనా లేదా ఏ పార్టీ అయినా, ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఒప్పుకునే ప్రసక్తి లేదని తలైవా స్పష్టం చేశారు. తాజాగా రజనీకాంత్, సహజ నటుడు కమల్ హాసన్ తో కలిసి తమకు సినిమా భిక్ష పెట్టిన, తమ ఉన్నతికి దోహద పడిన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తమ మధ్య ఉన్న స్నేహం గురించి వేలాది మంది అభిమానులతో పంచుకున్నారు.
బాలచందర్ విగ్రహాన్ని కమల్ హాసన్ స్వతహాగా ఏర్పాటు చేశారు. తమిళ ఆరాధ్య హీరోలు వీరిద్దరూ. రజనీకాంత్, కమల్ హాసన్ లకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాడు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం వీలైతే కమల్ హాసన్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తలైవా చేసిన ప్రతిపాదనను తాను ఆహ్వానిస్తున్నానని కమల్ హాసన్ చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అటు తమిళనాడుతో పాటు దేశమంతటా వైరల్ గా మారాయి. ఒకవేళ ఈ అగ్ర నటులు కలిసి అడుగులు వేస్తే పూర్తిగా రాజకీయాలు మారే అవకాశం ఉంది.
ఇప్పటికే డీఎంకే తో పాటు అన్నా డీఎంకే, తదితర పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరో వైపు హిందీ భాషను తప్పనిసరిగా చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడాన్ని రజనీకాంత్ తీవ్రంగా ఖండించారు. కమల్ హాసన్, స్టాలిన్, తదితర నేతలు అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపట్టారు. దీంతో కేంద్ర సర్కార్ దిగి రాక తప్పలేదు. ఇదే సమయంలో రజని, కమల్ హాసన్ లు గనుక కలిస్తే పాలిటిక్స్ లో పెను మార్పులు చోటు చేసుకోవడం మాత్రం ఖాయం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి