చార్జీల మోత..కస్టమర్లకు వాత
భారతీయ వ్యాపార రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపీనీస్ త్వరలో వినియోగదారులకు షాక్ ఇచ్చే పనిలో పడ్డది. ఇప్పటికే ఏజిఆర్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో టెలికం కంపెనీలు పెద్ద ఎత్తున భారత టెలికం నియంత్రణ సంస్థ అంటే ట్రాయ్ కి బాకీ పడ్డాయి. వోడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలతో పాటు రిలయన్స్ జియో కంపెనీ కలిపి ఏకంగా లక్షా 50 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ధర్మాసనం ఈ కంపెనీలకు చెల్లించేందుకు మూడు నెలలు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో తాము ఇంత పెద్ద మొత్తం చెల్లించలేమని విన్నవించాయి.
అయినా లాభాల బాటలో ఉన్న ఈ కంపెనీలు ఇలా మొండి కేయడంపై కోర్టు సీరియస్ అయ్యింది. దీంతో డేటా వినియోగం, ఇంటర్ నెట్ అనుసంధానం అన్నది ఇప్పుడు ప్రధానంగా మారింది. ప్రతిదీ దీనితోనే మిళితమై ఉండడం తో టెలికం కంపెనీల పంట పండుతోంది. ఆదాయం గణనీయంగా సమ కూరుతోంది. ఇదిలా ఉండగా ఆయా టెలికాం కంపెనీల మధ్య పెరిగిన పోటీ తట్టుకునేందుకు కంపెనీలు టారిఫ్ లను పెంచాలని యోచిస్తున్నాయి. ఇందు కోసం పెద్ద ఎత్తున మొబైల్ వినియోగదారులకు నెలవారీ చార్జీలను పెంచాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే వోడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలు చార్జీలు డిసెంబర్ నెల నాటి నుంచే పెంచుతున్నట్లు ప్రకటించాయి.
తాజాగా ఆ కంపెనీల బాటలోనే జియో నడుస్తోంది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ రిలయన్స్ జియో త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్ ఫోన్ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని తెలిపింది. ఎంత మేర టారిఫ్ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ వెంటనే ప్రకటన చేయగా, ఒక రోజు తర్వాత జియో కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది.
దేశీ టెలికం రంగాన్ని బలోపేతం చేసి వినియోగదారులకు ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా టారిఫ్‌ను పెంచనున్నామని, జియో వివరణ ఇచ్చింది. దీని వల్ల డేటా వినియోగం పైన, డిజిటల్ అనుసరణ పైన ప్రతికూల ప్రభావం ఉండబోదని వ్యాఖ్యానించింది. సెప్టెంబర్‌లో కొత్తగా 69.83 లక్షల యూజర్లను జత చేసు కోవడంతో కంపెనీ మొత్తం చందాదారుల సంఖ్య 35.52 కోట్లకు చేరింది. ఎయిర్‌టెల్ 23.8 లక్షల యూజర్లను కోల్పోయింది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య 32.55 కోట్లుగా ఉంది. వోడాఫోన్ ఐడియా 25.7 లక్షల చందాదారులను కోల్పోయింది. ఈ సంస్థ యూజర్ బేస్ 37.24 కోట్లకు తగ్గింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి