దలాల్ స్ట్రీట్..రైట్ రైట్
నిన్నటి దాకా స్టాక్ మార్కెట్ నష్టాలను చవి చూస్తే ప్రస్తుతం దలాల్ స్ట్రీట్‌లో మాత్రం లాభాల జోరు కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల బలమైన సెంటిమెంట్ వర్క్ అవుట్ కావడంతో సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్ చేసి 40, 816 వద్ద ఆల్ టైం గరిష్టానికి చేరింది. అటు నిఫ్టీ కూడా 12000 ఎగువన హుషారుగా కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగిసి 40770 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగిసి 12025 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా హెవీ వెయిట్ రిలయన్స్‌తో పాటు బ్యాంకింగ్ రంగ షేర్ల లాభాలు మార్కెట్లను సరి కొత్త గరిష్టాల దిశగా తీసుకెళ్తున్నాయి.
దీనికి టెలికం కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మరింత ఊతమిస్తున్నాయి. రిలయన్స్ టాప్ విన్నర్‌గా కొనసాగుతుండగా, వొడాఫోన్ ఐడియా మరో 22 శాతం ఎగిసింది. భారతి ఎయిర్టెల్ కూడా 2 శాతం ఎగిసింది. జీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, సన్‌ఫార్మ, కోల్ ఇండియా, యస్ బ్యాంకు, టాటా స్టీల్, మారుతి సుజుకి లాభ పడుతుండగా, భారతి ఇన్‌ఫ్రా టెల్, ఐషర్ మోటార్స్, కోటక్ మహీంద్ర, ఎస్‌బీఐ, ఐవోసీ, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో నష్ట పోతున్నాయి.
మరో వైపు దేశీయ కరెన్సీ ఆరంభంలో డాలరు మారకంలో బలహీనంగా ఉన్నా, అనంతరం పుంజుకుంది. 9 పైసలు నష్ట పోయినా ప్రస్తుతం స్వల్ప లాభంతో 71.69 వద్ద వుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ ఫ్యూచర్స్ 0.31 శాతం క్షీణించి బ్యారెల్ 60.72 డాలర్లకు చేరుకుంది. టెలికం. ఆయిల్. గోల్డ్, జవెలరీ, రియల్ ఇన్ ఫ్రా , తదితర వన్నీ పెరిగాయి. మార్కెట్ జోరుగా సాగుతుండడంతో మదుపరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో వైపు బంగారం ధర మాత్రం అమాంతం పెరుగుతూనే ఉన్నది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి