సంకీర్ణ సర్కార్ సేఫ్ - ఫలించిన దేవగౌడ మంత్రాంగం
కర్ణాటక రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తగ్గి పోయేలా చేశారు..అపర చాణుక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని దేవెగౌడ. గత నాలుగు నెలలుగా ఏ క్షణంలోనైనా కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలి పోవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. ఆ దిశగా మోదీ, షాలు ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. కేంద్రంలో థంబింగ్ మెజారిటీ రావడంతో ఎట్టి పరిస్థితుల్లోను బీజేపీ పావులు కదిపి..పవర్ లోకి రావాలని ప్రయత్నాలు చేసింది. ఎందుకనో ఉన్నట్టుండి ఆ ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. దీని వెనుక మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవెగౌడ చేసిన మంత్రాంగం కారణంగానే మోదీ తన ఆపరేషన్ కు పుల్ స్టాప్ పెట్టారన్న వార్తలు గుప్పుమన్నాయి.
కర్ణాటక స్టేట్‌లో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.37 స్థానాలు జేడీఎస్ సభ్యులుండగా, 80 స్థానాలు కలిగిన కాంగ్రెస్ తో పాటు ఆరుగురు ఇండిపెండ్లతో కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేవెగౌడ కుమారుడు కుమార స్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన చాలా సార్లు ఈ వత్తిళ్లను భరించలేనంటూ..తనకు ఈ పదవి వద్దంటూ ప్రకటించారు. ఇటీవల నేనుండలేనంటూ ఏకంగా రాజీనామా కూడా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో 22 సీట్లను గెలుచుకుంది బీజేపీ. ఈ దెబ్బతో తన పని అయిపోయిందని భావించిన సీఎం ఇక చాలంటూ భీష్మించుకు కూర్చున్నారు. మిత్రపక్షాల సభ్యులు, సీనియర్లు ఆయనకు సర్ది చెప్పారు. బీజేపీ గెలుచుకున్నా మన ఓటు శాతం పెరిగిందంటూ ఆయనకు నచ్చ చెప్పారు.
ఈ సమయంలో మరింత బలం పుంజుకున్న బీజేపీని ఎలాగైనా పవర్‌లోకి తీసుకు రావాలని అమిత్ షా గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన మాజీ ప్రధాని దేవెగౌడ..ఢిల్లీలో మోదీని కలిశారు. కాంగ్రెస్ అసంతృప్తులతో కలిసి సర్కార్‌ను కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఆపరేషన్ కమలం నిరంతరం కొనసాగుతున్నట్లు అనిపించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఇక ప్రభుత్వం కూలి పోయేందుకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.
అంతలోనే అధిష్టానం నుంచి ఆపరేషన్ కమలకు స్వస్తి పలకాలనే సంకేతాలు రావడంతో సంకీర్ణ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీని దేవెగౌడ అభినందించడం, ఆయనకు అభయం ఇవ్వడంతో ప్రస్తుత సర్కార్ కు ఢోకా లేదని తేలిపోయింది. దేశమంతటా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టిన వేళ కర్ణాటకలో సర్కార్‌ను కూల్చారనే చెడ్డ పేరు తమకు వస్తుందనే ఉద్ధేశంతో ఆపరేషన్‌ను నిలిపి వేసినట్లు తెలుస్తోంది. స్పష్టమైన హామీ ఇవ్వడంతో..కుమార స్వామి పల్లెల్లో పల్లె నిద్రకు ఉపక్రమించారు. మొత్తం మీద మాజీ ప్రధాని మంత్రాంగం ఫలించినట్లయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి