పూజాకు బిగ్ ఛాన్స్

టాలీవుడ్‌లో ఉన్న‌ట్టుండి టాప్ పొజిష‌న్‌లోకి దూసుకు వ‌చ్చిన న‌టి పూజా హెగ్డేకు అరుదైన ఛాన్స్ ద‌క్కింది. ఇప్ప‌టికే ప‌లు చిత్రాలు భారీ విజ‌యాల‌ను అందుకున్నాయి. తెలుగు సినిమా రంగంలో పేరున్న న‌టులు మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ , త‌దిత‌రుల‌తో ఆమె న‌టించారు. అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి, అల వైకుంఠ‌పురంలో సినిమాలు ఊహించ‌ని రీతిలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఆమె గ్రాప్ ఒక్క‌సారిగా పెరిగాయి. దీంతో ఆమెకు మ‌రింత డిమాండ్ పెరిగింది. భారీ ఎత్తున అవ‌కాశాలు వ‌చ్చినా ఆమె చాలా జాగ్ర‌త్త‌గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. అంతేకాకుండా త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారు. మ‌రో వైపు అద్భుతంగా తెలుగులో పాట‌లు కూడా పాడ‌టం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మంచి జోరు మీదుకున్న పూజా హెగ్డే కు బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని చేజిక్కించుకుంది ఈ అమ్మ‌డు.

మ‌రో వైపు ఇటీవల ఆమె నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్‌గా నిలవడంతో  ఈ ముద్దుగుమ్మకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్‌ హీరోలందరితో నటిస్తూ మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ అయ్యారు.  తెలుగులో అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ప్రభాస్‌ 20వ సినిమాలో నటిస్తున్న పూజా.. తాజాగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇప్పటికే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో ‘మొహంజోదారో’.. అక్షయ్‌ కుమార్‌తో ‘హౌస్‌ఫుల్‌-4’లో నటించిన ఈ భామ సల్మాన్‌తో జతకట్టి మరోసారి బీ-టౌన్‌లో అదృష్టాన్ని పరిశీలించుకోనున్నారు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఫర్హద్‌ సంజీ తెరకెక్కిస్తున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. 2021 ఈద్‌ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  సినిమాకు పూజా అయితేనే సరిగ్గా సరిపోతుందని ఆలోచించిన తర్వాతే ఆమెను ఎంచుకున్నట్లు నిర్మాత ఫర్హాద్ సంజీ తెలిపారు. సల్మాన్‌ ప్రస్తుతం రాధే సినిమా చేస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌. కాగా స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ద‌క్కినందుకు పూజా తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ అమ్మ‌డుకు గ‌త ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా మంచే జ‌రుగుతుంద‌న్న‌మాట‌. 

కామెంట్‌లు