ఇమ్రాన్ కు ట్రంప్ హితబోధ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రాంగం బాగా పని చేసింది. తాజాగా దక్షిణ ఆసియా ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు ఇండియా అహర్నిశలు కృషి చేస్తుంటే, పాక్ రెచ్చగొట్టే ధోరణి అవలంభిస్తోందంటూ పీఎం యుఎస్ ప్రెసిడెంట్ కు తేల్చి చెప్పారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, మన దేశంలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఈ సందర్బంగా మోడీ ట్రంప్ కు విడమరిచి చెప్పారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో పాకిస్తాన్ లేవనెత్తిన కశ్మీర్ అంశంపై ఒక్క చైనా తప్ప సభ్య దేశాలు సపోర్ట్ ఇవ్వలేదు.

దీంతో విశ్వ వేదికపై పాకిస్తాన్ ఒంటరిగా మిగిలింది. తదనంతరం పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు, నిరాధార ఆరోపణలు ఇండియాపై చేశారు. దీనిపై మోడీ ఘాటుగా అమెరికా ప్రెసిడెంట్ కు సమాధానం చెప్పారు. ఏ సమయంలోనైనా యుద్ధం చేసేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. దీంతో అమెరికా కొంచం మెత్త బడింది. పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే వాస్తవాధీన రేఖ వెంట , పాక్ సరిహద్దులో తలదాచుకున్న ఉగ్ర మూకలను ఏరివేయాలని ట్రంప్ హెచ్చరించారు. అంతే కాకుండా పాక్ కు అందజేస్తున్న ఆర్ధిక సాయం లో కోత విధించారు.

ఇక సుదీర్ఘ మంతనాల ప్రభావంతో ట్రంప్ .. పాక్ ప్రధానితో ఫోన్ లో మాట్లాడారు. జమ్మూ కశ్మీర్ అంశంపై భారత్ తో మితంగా మాట్లాడాలని సూచించినట్లు శ్వేత సౌధం పేర్కొంది. భారత్ వాదనను అర్థం చేసుకున్న ట్రంప్ తక్షణమే తగ్గాలని లేకపోతే బాగుండదని సున్నితంగా హెచ్చరించారు. అలాగే ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇరు దేశాలు సంయమనం పాటించాలని ట్రంప్ సూచించారు. . మొత్తం మీద మోడీ ఫోన్ కాల్ బాగానే వర్కవుట్ అయ్యిందన్నమాట. దీంతో ఇకనైనా తన మాటల తీవ్రతను ఇమ్రాన్ ఖాన్ తగ్గించు కోకపోతే అమెరికాతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!