ఆగనంటున్న బంగారం..పెరుగుతున్న ధరాభారం

ప్రపంచ మార్కెట్ రంగంలో కొనసాగుతున్న ఒడిదుడుకుల దెబ్బకు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితికి చేరుకున్నాయి. వరల్డ్ వైడ్ గా ధరల తీరులో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. నిన్న మొన్నటి దాకా తులం పసిడి ధర 28 వేల రూపాయలు ఉండగా, తాజగా దాని రేట్ లో భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఏకంగా 40 వేల రూపాయల దాకా చేరుకుంది. పసిడి అమాంతం పైపైకి పోతుండగా, వెండి మాత్రం మెలమెల్లగా దిగి వస్తోంది. ధరలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కొనుగోలుదారులు బంగారాన్ని కొంటున్నారు.

దుకాణాదారులు, వ్యాపారులు ధరలు పెరుగుతూ పోతుండడంతో కొనుగోళ్లు తగ్గుతాయని ఆందోళనకు గురయ్యారు. వారి అంచనాలకు మించి ఆభరణాలు అమ్ముడు పోవడం, దుకాణాలు కొనుగాలుదారులతో కిటకిట లాడడం విస్తు పోయేలా చేసింది. దీంతో మరింతగా తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు భారీ ఎత్తున డిస్కౌంట్స్ తో పాటు ఖరీదైన గిఫ్ట్ లు కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. మహిళలు , యువతులు ఎక్కువగా బంగారు షాప్స్ ను సందర్శిస్తున్నారు. తమకు తోచినంత గా తీసి పెట్టుకుంటున్నారు. ఆషాఢం లో ఎక్కువగా ఈ అమ్మకాలు జరగడం  విశేషం. ఢిల్లీలో తులం బంగారం ధర 38 వేలకు పైగా ఉంటే , వెండి కిలో ధర 44 వేలకు పైగా ఉన్నది 43 వేలకు తగ్గింది.

అంటే వేయి రూపాయల తేడా అన్నమాట. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గినా దేశీయంగా ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. రూపాయి బలహీన పడటం కూడా మరో కారణం. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ తగ్గడంతో కిలో దిగి వచ్చ్చింది. యుఎస్ మార్కెట్ లో డాలర్ విలువ పెరగడం కూడా ధరల వ్యత్యాసంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా వ్యాపారులకు మరో షాక్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. బంగారానికి హాల్ మార్కింగ్ నిర్బంధం చేయాలని భావిస్తోంది. వ్యాపారులతో సంప్రదించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోనుంది. 

కామెంట్‌లు