కోలుకుంటున్న బీఎ్‌సఎన్‌ఎల్ ..ఉద్యోగులు బేఫికర్ ..!
భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో మెరుగైన సేవలు అందిస్తూ వచ్చిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెలికాం కంపెనీ మెలమెల్లగా కోలుకుంటోంది. నిన్నటి దాకా అటుఇటు ఊగిసలాడిన ఈ కంపెనీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది . నష్టాలు వస్తున్నాయంటూ 54, 000 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని ..లేదా స్వచ్చంద పదవీ విరమణ ఇవ్వాలని బీఎ్‌సఎన్‌ఎల్ యాజమాన్యం నిర్ణయించింది . దీనిని ఆ సంస్థను నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది ఉద్యోగులు నిరసించారు. భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు . అయినా ఆ సంస్థ యాజమాన్యం కానీ ఇటు సేవలు పొందుతున్న కేంద్ర సర్కార్ కానీ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపేందుకు ఉత్సుకత చూపించలేదు . ఇండియాలో విశిష్టమైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి ..ఇటు ప్రజలకు చేదోడుగా ఉన్న ఈ సంస్థను నిట్ట నిలువునా ముంచారు . ఒక రకంగా ఆయా పాలక వర్గాలు దీనిని పనిగట్టుకుని పక్కన పెట్టేశారు.
దేశ వ్యాప్తంగా అపరిమితమైన నెట్ వర్క్ తో పాటు కోట్లాది వినియోగదారులను ఈ సంస్థ కలిగి ఉన్నది . ఇంటర్నెట్ వినియోగంలో ..బ్రాండ్ విడ్త్ కలిగి ఉన్న టెలికం కంపెనీల్లో దీని తర్వాతే ఏదైనా . రిలయన్స్ సంస్థ టెలికం రంగంలోకి అడుగు పెట్టాక రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి దాకా టాప్ వన్ లో నిలిచిన ఈ కంపెనీ ప్రైవేట్ టెలికాం కంపెనీల దెబ్బకు ఒక్కసారిగా కుదుపునకు లోనైంది . యాజమాన్యాలు ప్రైవేట్ సంస్థలకే వంత పాడటంతో లాభాల బాట పట్టిన బీఎ్‌సఎన్‌ఎల్ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం సంస్థ వాటాలు అమ్మి జవసత్వాలు అందించాలని నిర్ణయం తీసుకుంది . అయినా ఈ సమస్య ఒక కొలిక్కి రాలేదు . ఉన్నట్టుండి ఉద్యోగులను ఇంటికి సాగనంపాలని ..వీఆర్ ఎస్ తీసుకోవాలని యాజమాన్యం సూచించింది . దీంతో ఒక్కసారిగా సంస్థనే నమ్ముకున్న సిబ్బంది ..ఉద్యోగులు మూకుమ్మడిగా ఆందోళన చేపట్టారు .
ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగులుతుందని భావించిన సర్కార్ తాత్కాలింగా నిలిపి వేసింది . ఈ సమయంలో సంస్థాగత ఖాతాదారుల నుంచి రూ.6,500 కోట్లు ఒక్కసారిగా బీఎ్‌సఎన్‌ఎల్ కు రావడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది . దీంతో ప్రస్తుతానికి కీలకమైన వివిధ ఖర్చులకు ఢోకా ఉండదని భావిస్తున్నారు. ‘సాధారణంగా ఏటా సగటున 50-60 మంది సంస్థాగత ఖాతాదారుల నుంచి ఆదాయం సమకూరేది . 2018-19లో వీరి సంఖ్య 91కు చేరి రూ.6,500 కోట్ల ఆదాయం సమకూరింది’ అని బీఎ్‌సఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గానే ఉందన్నారు. ఇతర విభాగాల్లోనూ రాబడులు గాడిన పడుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక కష్టాలు గతం అనుకునే స్థాయికి చేరామన్నారు.
బీఎ్‌సఎన్‌ఎల్ ఆదాయంలో ఎక్కువ భాగం ఉద్యోగుల జీతాల కోసం ఖర్చు చేయడమే పెద్ద భారమని సీఎండీ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. టెలికాం శాఖ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను బీఎ్‌సఎన్‌ఎల్‌కు బదిలీ చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అయినా కంపెనీకి ఉన్న రూ.83,000 కోట్ల నికర ఆస్తులను, సరిగా ఉపయోగించుకోగలిగితే, చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.నష్టాల్లో ఉన్నా ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎ్‌సఎన్‌ఎల్ అప్పుల భారం తక్కువేనని అనుపమ్ చెప్పారు. ప్రస్తుతం బీఎ్‌సఎన్‌ఎల్ అప్పుల భారం రూ.14,000 కోట్లు మాత్రమేనన్నారు. 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు లేకపోయినా, ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటూ పనిచేయాల్సి వస్తోందన్నారు. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ద్వారా అన్ని కంపెనీలు ప్రతి నెలా ఉన్న ఖాతాదారులను కోల్పోతుంటే, బీఎ్‌సఎన్‌ఎల్, రిలయన్స్ జియో మాత్రమే నికరంగా అదనపు ఖాతాదారులను సంపాదిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రూ.7,000 ఈక్విటీ నిధులు సమకూర్చడం ద్వారా 4జీ స్పెక్ట్రమ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు శ్రీవాస్తవ చెప్పారు. మొత్తం మీద ప్రస్తుతానికి గండం గట్టెక్కినట్టే అనిపిస్తోంది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి