నిన్నటి పోలేపల్లి ..నేటి నిజామాబాద్ కు ప్రేరణ
మట్టి ఎక్కడైనా మట్టే. కాకపోతే దానికి అందమైన ముసుగులు. ప్రత్యేక ఆర్ధిక మండళ్లు అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరుతో రైతుల నుండి తక్కువకు భూములు లాగేసుకోవడం . తిరిగి వాటిని ప్రభుత్వమే వేలానికి పెట్టడం . మార్కెట్లో బహిరంగంగా అమ్మేయడం . ఇక్కడ పాలకులకు ఎవరైతే దగ్గరగా ఉంటారో ..ఎవ్వరైతే పెట్టుబడులతో పాటు తాయిలాలు అందిస్తారో వారికే విలువైన భూములు దక్కుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం . ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి బతికే హక్కుతో పాటు భూమిని పొందటం కూడా ఓ హక్కే. కానీ రాను రాను భూమి కనిపించడం లేదు . కంపెనీలు ..ప్రమాదకరమైన పరిశ్రమలు ..వాటి చుట్టూ బడా బాబులు ..పాలకులు ..అధికారులు కాపలాగా ఉంటారు . పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు రెడ్ కార్పెట్లు పరుస్తున్నాయి . లెక్కలేనన్ని వనరులు సమకూర్చి పెడుతున్నాయి . నీళ్లు, కరెంట్ ..అనుమతి ..అవసరమీయతే రాయితీలు ఇస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నాయి .
తమకు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు వద్దంటూ అప్పట్లో పాలమూరు జిల్లా పోలేపల్లి గ్రామస్థులు అలుపెరుగని పోరాటం చేశారు . తమ నిరసనను ప్రకటించారు . దాదాపు తమ భూములు కోల్పోయిన భాదితులు 48 దాకా ప్రాణాలు కోల్పోయారు . అయినా సర్కార్ లో చలనం లేక పోయింది . పోలేపల్లి పోరాటం ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది . ఈ మొత్తం న్యాయపరమైన డిమాండ్ కోసం జనాన్ని కూడగట్టి ..సంఘాలను ఒకే చోటుకు చేర్చిన ఘనత సామాజిక కార్యకర్త మధు దే. అప్పట్లో పోలేపల్లి పోరాటపు స్ఫూర్తి ఎందరినో కదిలించింది . అప్పట్లో జరిగిన మహబూబ్ నగర్ ఎంపీ నియోజక వర్గంలో పోలేపల్లి వాసులు ..రైతులు భారీ ఎత్తున పోటీ చేశారు . వేలాది ఓట్లు సంపాదించారు . తెలంగాణ ఉద్యమం రాటు దేలిన సమయంలో వీరు చేసిన ప్రయత్నం ఎంపీగా కేసీఆర్ గెలుపొందడం జరిగింది . ఇదో రికార్డ్ . వీరు చేసిన ఈ ప్రయత్నం అప్పట్లో దేశంలోనే సంచలనం .
పోలేపల్లి రైతులు చేసిన ఈ పోరాటమే తిరిగి నిజామాబాద్ జిల్లా ఎంపీ ఎన్నికల్లో రైతులు పోటీ చేసేలా చేసింది . ప్రజా సంఘాలు ..రైతులు ..రైతు సంఘాలు ..ప్రతి పక్ష పార్టీలు ..విద్యార్ధి సంఘాలు ..ప్రజాస్వామిక వాదులు వీరి న్యాయమైన పోరాటానికి మద్దతు పలికాయి . గత కొన్నేళ్లుగా పసుపు ..కంది ..చెరుకు పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆందోళనలు చేశారు . మూకుమ్మడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు . పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో ఎంపీ కవిత విఫలమైందని రైతులు నిలదీశారు . అయినా సర్కారులో చెలనం లేక పోయింది . ఒకరు కాదు ఏకంగా ఈ ఎంపీ సీటు కోసం 178 మంది రైతులు బరిలో నిలిచారు . దేశ చరిత్రలో ఇదో భారీ రికార్డ్ గా నమోదైంది . 26 వేల మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు . ఈ ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ గా మారింది . ఇలాంటి చైతన్యం రైతుల్లో రావడం శుభ పరిణామం . ఇవ్వాళ పోలేపల్లి లో కంపెనీలు ..రియల్ ఎస్టేట్ కంపెనీలు చుట్టూ ముట్టాయి . కానీ ఆ పల్లె ప్రజలు చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటుంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి