శత్రువుతో స్నేహం..అధికారమే ముఖ్యం - రూట్ మార్చిన కమలం..!
ఢిల్లీలో మళ్ళీ బీజేపీ జెండా ఎగుర వేసేందుకు కమలనాథులు నానా తంటాలు పడుతున్నారు . దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం తగ్గింది . జీఎస్టీ మోత ..నోట్ల రద్దు ..వెక్కిరిస్తున్న ఖాళీలు ..ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం ..జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తానని వేయక పోవడం ..జనం నెత్తిన అధిక పన్నుల మోత మోగించడం తో ప్రస్తుతం 16 వ సారి జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎవ్వరి పొత్తు లేకుండానే మళ్ళీ అధికారంలోకి వస్తామని కలలు కన్న బీజేపీకి సింగిల్ డిజిట్ ఫిగర్ రాదనీ తేలి పోయింది . దీంతో పవర్ లోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ..బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమవుతుంది . దీంతో నిన్నటి దాకా తానే అంతా అయి ..ఒకే ఒక్కడిగా చక్రం తిప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు శత్రువు అయినా సరే చెలిమి చేసేందుకు సిద్దమే నంటూ ప్రకటించారు. సీన్ రివర్స్ కావడంతో ..ఓటమిని త్వరగా ఒప్పుకోని మోడీజీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు .
ఒక్కరైనా పర్వాలేదు ..వాళ్ళు శత్రువైనా సరే తాము అధికారం చేపట్టేందుకు సాదర స్వాగతం పలుకుతామంటూ మోడీ స్పష్టం చేశారు. నిన్నటి దాకా కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న మోడీ ఇప్పుడు శాంతి వచనం ప్రవచించడం పార్టీ వర్గాలతో పాటు ప్రాంతీయ పార్టీలను ఒకింత షాక్ కు గురి చేసింది . దేశ వ్యాప్తంగా అన్ని సర్వేలు ఏ ఒక్క పార్టీకి అధికారం లోకి రావాల్సిన ఎంపీ సీట్లు రావంటూ వెల్లడించాయి . దీంతో మరోసారి పవర్ లోకి రావాలని అనుకుంటున్నా బీజేపీ ..కాంగ్రెస్ ఇప్పటి నుంచే పట్టు సడలించాయి . 29 రాష్ట్రాల్లో బీజేపీ ..కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ సీట్లు తెచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు . దీంతో అధికారం కావాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకోవడం తప్పనిసరి . ఇప్పటి నుంచే మోడీ అండ్ అమిత్ షా పరివారం రంగంలోకి దిగాయి . ఆయా రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటోంది.
అందుకే మోడీ మాటల్లో తడబాటు కనిపించింది . ఒక్క ఎంపీ అయినా సరే దేశ భవిష్యత్తు కోసం కలుపుకుని పోతామని ప్రకటించారు . చివరకు మమ్మల్ని ద్వేషించే వారికి స్వాగతం పలుకుతామంటూ ఎన్నికల సభలో వెల్లడించారు . యువతీ యువకులు దేశం కోసం తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని పిలుపు నిచ్చారు . ఒక చౌకీదార్ గా మిమ్మల్ని అడుగుతున్నా ..నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి . మీ కలల్ని నిజం చేస్తా . మీ కోసం నా ప్రాణాలు సైతం ఇస్తానంటూ చెప్పారు . మా లక్ష్యం కేవలం ప్రభుత్వ ఏర్పాటు కాదు. దేశాన్ని నడిపించాలి. ప్రగతి దారుల్లో పరుగులెత్తించాలి. ఇందుకు ఏకాభిప్రాయం అవసరం. ఇందుకోసం పార్లమెంటుకు ఒక్క ఎంపీని పం పిన పార్టీని కూడా చేర్చుకుంటాం.
తమిళనాడులో ఒక్కో సీటు గెలుచుకునే అవకాశం ఉన్న పుతియ నీతి కచ్చి(పీఎన్‌కే), తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) మొదలైనవి ఉన్నాయి. రాజస్థాన్ లో హనుమాన్‌బేణీవాల్ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌టీపీతో పొత్తు పెట్టుకుని బేణీవాల్‌కు నాగౌర్ స్థానాన్ని ఇచ్చింది. యూపీలో అప్పాదళ్‌తో పొత్తు పెట్టుకుని రెండు సీట్లు కేటాయించింది. నిషాద్ పార్టీతోనూ అవగాహనకు వచ్చి ఒక సీటు(ముజఫర్‌నగర్ ) ఇచ్చింది. వీరందరూ బీజేపీ మిత్రపక్షాలే. గెలిచే సీట్లే! దేశవ్యాప్తంగా 44పార్టీలతో బీజేపీ ముందుస్తు పొత్తులు కుదుర్చుకుంది. ఇందులో సగం మాత్రమే బరిలో ఉన్నాయి. ఎన్నిక ల్లో జాతీయవాద నినాదాన్ని బలంగా వినిపిస్తున్న మోదీ కశ్మీర్‌లో ప్రస్తుత దుస్థితికి కారణం తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విధానాలేనని ఆక్షేపించారు.
‘‘రాజ్యాంగంలో ఆర్టికల్ 370, 35-ఎ చేర్చడంతో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన జరక్కుండా పోతున్నాయి. కశ్మీర్ సమస్య చాలా పాతది. పటేల్ కు వదిలేసి ఉండుంటే జునాగఢ్, నిజాం సంస్థానాలను కలిపేసినట్లుగా కశ్మీర్‌నూ పరిష్కరించేవారు. కశ్మీర్‌ను నెహ్రూ స్వయంగా టేకప్ చేయడంతో వివాదాస్పద గడ్డగా మిగిలింది. ఆయన విధానాలు ప్రగతికి అడ్డంకిగా మారాయి. సమస్యంతా లోయ లోని రెండున్నర జిల్లాల్లోనే! జమ్మూ, లద్దాఖ్‌లతో సమస్య లేదు. మిగిలిన రాష్ట్రాల్లా కశ్మీర్లోనూ విద్యాసంస్థలు పెట్టగలం. కానీ ప్రొఫెసర్లు ఆ సంక్షుభిత గడ్డపై ఉండడానికి ఇష్టపడరు. కంపెనీలు రావు. ఈపరిస్థితి కచ్చితంగా మారాలి’’ అని మోదీ చెప్పుకొచ్చారు. కశ్మీర్‌లో సాయుధ బలగాల విశేషాధికారాలను సమీక్షిస్తామన్న కాంగ్రెస్ వా గ్దానాన్ని ఆయన నిరసించా రు.
ఈ చట్టాన్ని నీరుగార్చడమంటే మన సైనికుల్ని మన మే ఉరికంబం ఎక్కించినట్లు అని బదులిచ్చారు. ‘‘జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ నేత మసూద్ అజార్‌ను వెనకేసుకొస్తున్న చైనా వైఖరికి నిరసనగా చైనా వస్తువుల్ని, ఉత్పత్తుల్ని భారతీయులు బహిష్కరించాలా?’’ అన్న ప్రశ్నకు.. ఇది ప్రజల వివేచనకే వదిలేస్తున్నానని మోదీ బదులిచ్చారు. ఒకప్పుడు రష్యా మాత్రమే భారత్ వెంట ఉండేది. మిగతా ప్రపంచమంతా పాక్ వెంట ఉండేది. మా హయాంలో పరిస్థితి మారింది. ఒక్క చైనా మాత్రమే పాక్ వెంట ఉంది. మిగిలిన ప్రపంచమంతా భారత్ వెంట ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో సీటు వయనాడ్ నుంచి కూడా పోటీచేయడంపై తనకేమీ అభ్యంతరం లేదని అంటూ ‘ఆయన కుటుంబ నియోజకవర్గం అమేఠీ. అక్కడి నుంచి ఆయన వయనాడ్‌కు పారిపోవాల్సిన పరిస్థితులేంటన్నది ముఖ్యం’ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే మోదీజీలో మార్పు కనిపిస్తోంది . అది అధికారం కోసమే నన్నది వాస్తవం . ఇంకొద్ది కాలం ఆగితే ఎవరు ఢిల్లీ కోటపై జెండా ఎగుర వేస్తారో తేలుతుంది . అంత దాకా వేచి చూడటమే మిగిలింది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి