చెన్నై షాన్ దార్ ..కోల్‌కతా బేకార్
ఐపీఎల్ టోర్నీలో ఎమ్మెస్ ధోనీ సారధ్యం లోని చెన్నై జట్టు తన హవాను కొనసాగిస్తూనే ఉన్నది . అంచనాలకు మించి అన్ని ఫార్మాట్ లలోను అద్భుతమైన రీతిలో ప్రదర్శనను కనబరుస్తోంది. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాట్టింగ్ లోను రాణిస్తూ గెలుపు బాటలో పయనిస్తోంది . కోల్‌కతా పై అతి కష్టం మీద విజయం సాధించింది . విన్నింగ్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి . కానీ చివరకు ఉత్కంఠ పోరులో సక్సెస్ చెన్నైని వరించింది . దీపక్ పవర్ దెబ్బకు కోల్‌కతా తలవంచక తప్పలేదు. పరుగు పరుగుకూ కష్టపడ్డాయి. ఎంత కొట్టినా బంతి మొరాయించడంతో బౌండరీలు గగనమయ్యాయి. ఐతే బౌలర్ల హవా సాగిన పోరులో చెన్నై జట్టే పైచేయి సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రమించిన ఆ జట్టు ఐపీఎల్-12లో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
పేసర్ దీపక్ చాహర్ , స్పిన్నర్లు విజృంభించడంతో గెలుపు సాధ్యమైంది. చాహర్‌తో పాటు హర్భజన్ , జడేజా , తాహిర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మొదట కోల్‌కతా పరుగుల కోసం తీవ్రంగా కష్టపడింది. 9 వికెట్లకు 108 పరుగులే చేయగలిగింది. రస్సెల్ మరోసారి మెరుపులు కురిపించాడు . 5 ఫోర్లు ఆరు సిక్సర్లతో దుమ్ము రేపాడు . అతడు ఒక్కడే ఆ మాత్రం స్కోర్ చేయలేక పోతే కోల్‌కతా తక్కువ స్కోర్ కే పరిమితమై పోయేది . ఇక ఈజీగా గెలుస్తుందని భావించిన చెన్నై లక్ష్య సాధనలో తడబడింది. చాహర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
చెన్నై కూడా అలాగే..: ఏ దశలోనూ విజయంపై అనుమానం కలగకపోయిన ఛేదనలో చెన్నై కూడా కష్టపడింది. పరుగులు అంత తేలిగ్గా రాలేదు.
ఆరంభంలో ఓపెనర్ వాట్సన్ .. ఆ తర్వాత రైనా .. ధనాధన్ బ్యాటింగ్‌తో చెన్నై పని తేలిక చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరూ ధాటిగా ఆడే క్రమంలో త్వరగానే నిష్క్రమించారు. 5 ఓవర్లలో స్కోరు 35/2. పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకున్న మరో ఓపెనర్ డుప్లెసిస్ జాగ్రత్తగా ఆడాడు. అతడికి రాయుడు తోడయ్యాడు. కానీ షాట్లు ఆడడం కష్టంగా ఉండడంతో పరుగులు వేగంగా రాలేదు. 10 ఓవర్లలో స్కోరు 57 మాత్రమే. 14 ఓవర్లకు 77. రాయుడు స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. కానీ విఫలమయ్యాడు. 15వ ఓవర్లో ఓ క్యాచ్‌ను ఫీల్డర్ వదిలేయడంతో బతికిపోయిన అతడు.. అదే ఓవర్లో మరో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు. ఐతే వస్తూనే బౌండరీ బాదిన కేదార్ జాదవ్ ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చాడు .
బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న మందకొడి పిచ్‌పై మొదట కోల్‌కతా పరుగుల కోసం చెమటోడ్చింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు కోల్‌కతాను ఏ దశలోనూ పుంజుకోనివ్వలేదు. రసెల్ మరో చక్కని ఇన్నింగ్స్‌తో ఆదుకోకుంటే ఆ జట్టు వంద పరుగులైనా చేసేది కాదు. ఎప్పటిలా అతడు వీరబాదుడు బాదలేకపోయినా ఎంతో విలువైన పరుగులు చేశాడు. మ్యాచ్‌లో కోల్‌కతా ఆరంభమే పేలవం. అద్భుతంగా బౌలింగ్ చేసిన పేసర్ దీపక్ చాహర్ ఆ జట్టు టాప్ లేపేశాడు. చెన్నై బౌలింగ్ దాడిని ఆరంభించిన అతడు ఓవర్‌కో వికెట్ తీస్తూ పోయాడు. 5 ఓవర్లలో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా చిక్కుల్లో పడింది. ఆ తర్వాత కూడా చెన్నై బౌలర్లు ఆ జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వికెట్ల వేట కొనసాగిస్తూనే పోయారు. రసెల్ పోరాడాడు. తాహిర్, హర్భజన్, జడేజాల కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల అతడు కూడా సులువుగా భారీ షాట్లు ఆడలేకపోయాడు. కానీ క్లిష్ట పరిస్థితుల్లోనూ మూడు సిక్స్‌లు, ఐదు ఫోర్లు కొట్టాడు. మొత్తం మీద చెపాక్ మైదానంలో చెన్నై అభిమానులకు పసందైన ఆటను అందించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి