జనం ఆశలపై నీళ్లు చల్లిన బీజేపీ
మరోసారి బీజేపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది . 2014 లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చారు . పీఎం చేసిన ఈ ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది . కోట్లాది ప్రజలు మోడీ మాటలు నమ్మారు . కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు . బీజేపీకి అనూహ్యమైన విజయాన్ని అందించారు . ఆ తర్వాత జనం నెత్తిన మోడీ పన్నులు విధించడం . నోట్లను రద్దు చేయడం . ఒంటెత్తు పోకడలు పోయారు . తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని మోడీ టార్గెట్ చేశారు . కేసులు నమోదు చేసేలా .. ఐటీ దాడులు జరిగేలా చేస్తూ పోయారు . దీంతో ఆయా రాష్ట్రాల్లో పరిపాలన సాగిస్తున్న విపక్షాలు బీజేపీపై నిప్పులు చెరిగాయి . ఏకంగా అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్ట్ కు ఫిర్యాదు చేశాయి . అయినా మోదీజీలో మార్పు రాలేదు .
ఏపీలో తెలుగుదేశం పార్టీతో నాలుగేళ్లపాటు చెలిమి చేసిన బీజేపీ ఆఖరులో కటీఫ్ చేసింది . ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు . ఎన్నికల్లో ఐటి దాడులు జరగడం ..ఈసీని మార్చడం చేస్తూ పోయారు . అయినా ఏపీ సీఎం చంద్ర బాబు ఎక్కడా రాజీ పడలేదు . ఒక్కడే ఒంటరి పోరాటం చేశారు . మోడీ ..అమిత షా ఆగడాలను ఎక్కి పారేశాడు . ఇంకో వైపు భావ సారూప్యత కలిగిన ఇతర పార్టీలు ..నాయకులను కూడగట్టే ప్రయత్నం చేశారు . ప్రజల సాక్షిగా ..జరిగిన ఎన్నికల సభలో మోడీ ప్రతి ఒక్క భారతీయుడి ఖాతాలో డబ్బులు జమ చేస్తానని ప్రకటించాడు . ఇది నిజం . అప్పట్లో ఓట్లు రాలాయి . ఐదేళ్లు గడిచాయి . తిరిగి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నానా తంటాలు పడుతోంది . అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కి పూర్తి స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం లేక పోవడంతో .. ఆ రెండు పార్టీలు పవర్ లోకి రావాలంటే ప్రాంతీయ పార్టీలతో జత కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
కర్ణాటకలో దేవెగౌడ ..తమిళనాడులో స్టాలిన్ .. ఏపీలో చంద్రబాబు ..బెంగాల్ లో మమతా బెనర్జీ ..నవీన్ పట్నాయక్ ..ఢిల్లీలో కేజ్రీవాల్ ..యూపీలో మాయావతి ..అఖిలేష్ యాదవ్ ..తో పాటు ఛత్తీస్ గడ్ ..గోవా .. కేరళ ..ఇలా చాలా ప్రాంతాలలో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమిత్ షా పావులు కదిపినా ..మహారాష్ట్రలో శివ సేన ఒంటరిగానే పోటీ చేస్తోంది . మోడీ ఒంటెత్తు పోకడలతో విసిగి పోయిన సీనియర్ నాయకులు మిన్నకుండి పోయారు . ఈసారి ఎన్నికల్లో మోడీ ప్రభావం తగ్గింది . దీంతో కమలనాథులు మాట మార్చారు . తాము ప్రతి ఖాతాలో డబ్బులు వేస్తామని అనలేదంటూ ఈ సారి ఎన్నికల్లో చెప్పడంతో జనం అవాక్కయ్యారు. కేవలం అధికారం కోసమే తమను వాడుకున్నారని ఈసారి బీజేపీకి షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని జనం శపథం చేస్తున్నారు . జరగబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది . హోమ్ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రకటన జనం ఆశలపై నీళ్లు చల్లింది . మొత్తం మీద కమలం దెబ్బకు అబ్బా అంటున్నారు జనం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి