స్పెన్సర్ బంపర్ ఆఫర్ - 300 కోట్ల డీల్
భారతీయ వ్యాపార దిగ్గజం ఆర్.పి. సంజీవ్ గోయెంకా అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన సారథ్యంలోని స్పెన్సర్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ లాభాల బాటలో పయనిస్తోంది. వ్యాపార పరంగా తనకంటూ మెరుగైన వాటాను స్వంతం చేసుకుని దూసుకెళుతోంది. ఇండియా వ్యాప్తంగా ప్రధాన నగరాలలో స్పెన్సర్ స్టోర్స్, మాల్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఎక్కువ ధరల మోత మోగించకుండానే తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తూ లో మార్జిన్ తో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. దీంతో మిగతా దిగ్గజ వ్యాపార సంస్థలకు ధీటుగా స్పెన్సర్ కూడా ఎదుగుతోంది. మోర్, మెట్రో, డి-మార్ట్, మెట్రో, బిగ్ బజార్ రిటైల్ సంస్థలతో స్పెన్సర్ పోటీ పడుతూనే మార్కెట్ వాటాను పెంచుకుంటోంది.
కస్టమర్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూనే అత్యధికంగా ..అంటే మిగతా సంస్థలకంటే అధికంగా డిస్కౌంట్స్, ఆఫర్లు ప్రకటిస్తోంది. దీంతో కొనుగోలుదారులు స్పెన్సర్ స్టోర్స్, మాల్స్ వైపు పరుగులు తీస్తున్నారు. ఆయా స్టోర్స్‌లలో కస్టమర్స్ అభిరుచులకు అనుగుణంగా వారికి మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు స్పెన్సర్ సంస్థ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా ఉండేలా నేచరుల్ ప్రాడక్ట్స్‌ను అందుబాటులో ఉంచుతోంది. నేచర్స్ బాస్కెట్ లిమిటెడ్ కంపెనీని స్పెన్సర్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఏకంగా 300 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా స్పెన్సర్ షేర్ వాల్యూ అమాంతం పెరిగింది.
ఇండియాలోని ప్రైమ్ లొకేషన్స్ లలో 36 నేచర్స్ బాస్కెట్ స్టోర్స్‌ను సంస్థ ప్రారంభించనుంది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసే పనిలో పడింది స్పెన్సర్ యాజమాన్యం. ముంబయి, పూణె, బెంగళూరు, హైదరాబాద్ , కోల్‌కతా, ఢిల్లీ ,అహ్మదాబాద్, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాలను స్పెన్సర్ టార్గెట్ చేసింది. ఈ బిగ్ డీల్‌తో మిగతా వ్యాపార దిగ్గజాలు ఆశ్చర్యానికి లోనయ్యాయి. బిఎస్ఇలో షేర్స్ విలువ అమాంతం పెరిగింది. ఇది కూడా ఓ రికార్డుగా నమోదైంది. కేవలం 2 శాతం ఉన్న షేర్ వాల్యూ 132 శాతానికి పెరిగింది. శాతం వ్యత్యాసం 130 శాతం పెరగడం ఆశ్చర్యానికి గురి చేసింది ఇటు మార్కెట్ వర్గాలను ..స్పెన్సర్ సంస్థను.
నేచర్స్ బాస్కెట్ ను అంచెలంచెలుగా అభివృద్ధి చేసింది గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ. స్పెన్సర్ బిగ్ డీల్ ఆఫర్ ప్రకటించగానే అంచనాలు అమాంతం పెరిగాయి. 449.70 కోట్లకు పెరిగింది. గతంతో పోలిస్తే 2.34 శాతం పెరిగినట్లయింది. స్పెన్సర్‌తో గోద్రెజ్ ..ఇరు సంస్థలు నేచర్స్ బాస్కెట్ కంపెనీని టేక్ ఓవర్ చేసిన మాట వాస్తవమేనంటూ ..ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తున్న లోధా కేపిటల్ మార్కెట్స్ వెల్లడించింది. నేచర్స్ బాస్కెట్ ఆపరేషన్స్ 2005లో ప్రారంభమయ్యాయి. ఇందులో ఎలాంటి మందులు లేని వాటినే అమ్ముతారు. వేరే వాటికి చోటు అంటూ ఉండదు.
ఈ నేచర్స్ స్టోర్స్ లో పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసంతో పాటు కన్సూమర్ గూడ్స్ అన్నీ అందుబాటులో ఉంచుతారు. దీంతో వేరే మార్కెట్ దగ్గరకు వెళ్లాల్సిన పని తప్పుతుంది. మరో వైపు ప్రస్తుత మార్కెట్ లో ఇదే తరహాలో అలీబాబా గ్రూప్ ఆధీనంలోని బిగ్ బాస్కెట్ కూడా తన హవాను కొనసాగిస్తోంది. నేచర్స్ స్టోర్ రాకతో కొంత మేరకు మార్కెట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 291 కోట్లతో స్టార్ట్ చేయగా..ఏకంగా 2017-18లో 9 వేల 968 కోట్ల ఆదాయాన్ని గడించింది. మొత్తం మీద నేచర్స్ స్టోర్ డీల్ తో స్పెన్సర్‌కు అదనపు ఆదాయం సమకూరినట్లయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి